Bigg Boss Telugu Season 8 : తేజని హీరో చేసిన బిగ్ బాస్.. ఫ్యామిలీ ఎపిసోడ్ సంపూర్ణం.. అవినాష్‌కు కలిసొచ్చిన లక్
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ ఎపిసోడ్ ముగిసింది. చివరి వరకు టేస్టీ తేజని ఏడిపించిన బిగ్ బాస్ చివరకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు అలాగే ప్రేరణకి కూడా..
Surprise to Tasty Teja And Avinash Become Mega Chef Once Again:
బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం గడిచేందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎపిసోడ్ ముగిసింది. చివరి వరకు టేస్టీ తేజని బిగ్ బాస్ ఏడ్పించేశాడు. తన అమ్మ రాదని తేజ కన్నీరు మున్నీరు అయ్యాడు. కానీ చివరకు బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇలా సర్ ప్రైజ్ ఇస్తాడని ఆడియెన్స్‌కి కూడా తెలుసు. బిగ్ బాస్ అంత కఠినాత్ముడు కాడని లోపల ఉన్న కంటెస్టెంట్లకి కూడా తెలుసు. కానీ ఓ టీఆర్పీ టాపిక్ కావాలి.. దానికి తేజ కన్నీటిని వాడుకోవాలి అని బిగ్ బాస్ టీం అనుకుంది. అందుకే చివరి వరకు బిగ్ బాస్ తేజతో ఆడుకున్నాడు. చివరి పంచ్ మనద అయితే వచ్చే కిక్కే వేరప్పా అన్నట్టుగా.. తేజ మదర్‌ను చివరగా పంపి.. అతడ్ని హీరో చేసేశాడు బిగ్ బాస్.
శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ప్రేరణ భర్త శ్రీపాద్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు. తన భర్తను చూడటానే ప్రేరణ ఎగిరి గెంతేసింది. శ్రీపాద్ చూడటానికి సింపుల్ కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్నాడు. తన భార్యకు ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చాడు. ధైర్యాన్ని, భరోసాని కూడా ఇచ్చాడు. కోపం కాస్త తగ్గించుకో.. మాట్లాడే విధానం మార్చుకో అని సలహాలు ఇచ్చాడు. ఇంటి సభ్యులతోనూ శ్రీపాద్ బాగానే మాట్లాడాడు. శ్రీపాద్ ప్రేరణ కలిసి ఆడిన టాస్కుతో కిచెన్ టైం ఎక్స్ ట్రా వచ్చేసింది.
తన అమ్మని బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకు రాలేకపోతోన్నానని తేజ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక మెగా చీఫ్ కోసం బిగ్ బాస్ టాస్క్ పెట్టడం అందులో అవినాష్ గెలిచి మళ్లీ మెగా చీఫ్‌గా అవ్వడం జరుగుతుంది. తేజ కోసం వాళ్ల అమ్మని ఇంట్లోకి తీసుకు రండి అంటూ బిగ్ బాస్‌ను అవినాష్ రిక్వెస్ట్ చేస్తాడు. అలా చాలా సేపు డ్రామా తరువాత అర్దరాత్రి టైంలో తేజకు బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇస్తాడు. అమ్మ నుంచి ఫోన్ కాల్ రావడంతో తేజ సంబరపడతాడు. ఆ కాసేపటికే తేజ మదర్ లక్ష్మీ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెడుతుంది.
అమ్మని అలా చూడటంతో తేజ సంబరపడిపోతాడు. ఇంటి సభ్యులంతా కూడా ఖుషీ అవుతారు. తన కల నెరవేరిందని, తాను సక్సెస్ అయ్యానని తేజ ఎగిరి గంతేశాడు. ఇక తన అమ్మ చేసిన చికెన్ ది బెస్ట్ చికెన్ అందరినీ టేస్ట్ చేయమని కోరాడు. టాస్కులు ఇంత బాగా ఆడతావ్ అని అనుకోలేదు.. బాగా ఆడుతున్నావ్.. ఇంకా ఇలానే ఆడు.. టాప్ 5లో కచ్చితంగా ఉంటావ్ అని తేజకు సలహాలు, సూచనలు ఇచ్చింది. అలా మొత్తానికి ఫ్యామిలీ ఎపిసోడ్‌కు బిగ్ బాస్ మంచి ఎండింగ్ అయితే ఇచ్చాడు.
వారం అంతా కూడా తేజని ఏడ్పించిన బిగ్ బాస్ చివరకు హీరోని చేసేశాడు. తేజ మదర్ ఎంట్రీతో ఫ్యామిలీ ఎపిసోడ్‌కు ముగింపు వచ్చేసింది. తేజ కోసం వచ్చిన చికెన్‌ను ప్రేరణ, యష్మీ, పృథ్వీ బ్యాచ్ ఎగబడి తినేశారన్నట్టుగా రోహిణి చెప్పింది. వాళ్ల కోసం వచ్చిన ఫుడ్‌ని మాత్రం మనతో షేర్ చేసుకోలేదంటూ అవినాష్, తేజ, గౌతమ్‌లతో రోహిణి ముచ్చట్లు పెట్టింది. ఇక ఇదే ఎపిసోడ్‌లో ఎగ్ దోశ గురించి ప్రేరణ, తేజల మధ్య చిన్న గొడవ కూడా జరిగింది. విష్ణు, పృథ్వీలు ఒకే రకమైన ఎల్లో డ్రెస్‌లు వేసుకున్నారు అంటూ తేజతో రోహిణి చెబుతుంది. బయటకు వెళ్లాక కూడా అదే వైబ్ మెయింటైన్ చేస్తారో లేదో చూడాలి అన్నట్టుగా తేజ మాట్లాడాడు. ఇలా మొత్తానికి ఫ్యామిలీ వీక్ అయితే కంప్లీట్ అయింది. మరి ఈ వారం ఇంటి నుంచి బయటకు ఎవరు వెళ్తారో చూడాలి.