![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bigg Boss 8 Telugu Grand Finale Date: బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే డేట్ ఫిక్స్... ఈ షో ఎండ్ చేయబోయేది ఎప్పుడో తెలుసా?
Bigg Boss 8 Telugu Ending Date: బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. మరి బిగ్ బాస్ 8 ఫైనల్ జరగబోయేది ఎప్పుడో తెలుసుకుందాం పదండి.
![Bigg Boss 8 Telugu Grand Finale Date: బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే డేట్ ఫిక్స్... ఈ షో ఎండ్ చేయబోయేది ఎప్పుడో తెలుసా? Bigg Boss 8 Telugu Grand Finale Date Star Maa Channel and Nagarjuna plans to end show on December 15th 2024 Bigg Boss 8 Telugu Grand Finale Date: బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే డేట్ ఫిక్స్... ఈ షో ఎండ్ చేయబోయేది ఎప్పుడో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/15/a27d29b43c594f7c11d61356b0e6b53817316700684811106_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉండగా, ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎప్పుడు ఉండబోతోంది అనే విషయం బయటకు వచ్చింది. మరి ఈ సీజన్ ఫైనల్ ఏ రోజున రాబోతుందో తెలుసుకుందాం పదండి.
బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ స్లోగా మొదలై, ఊహించని ట్విస్ట్ లు, టర్న్ లతో ఇప్పుడు రసవతరంగా మారింది. ముందుగా పలువురు హౌస్ మేట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా, వాళ్ళలో వాళ్ళకే చిచ్చు పెట్టారు బిగ్ బాస్. ఆ తర్వాత ఏకంగా ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీలను హౌస్ లోకి పంపి, ఆసక్తిని క్రియేట్ చేశారు. ముందుగా హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అన్నట్టుగా పలు గేమ్స్ ని పెట్టి, నామినేషన్స్ పరంగా ఊహించని ట్విస్ట్ లు ఇచ్చారు. ఆ తర్వాత అందరిని కలిపేసి ఒకే టీం అంటూ కంటెండర్ పోటీలో ఫైట్ చేయమన్నారు. దీంతో హౌస్ మేట్స్ మధ్య లెక్కలు మారుతూ వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే హౌస్ లో గతవారం హరితేజ, గంగవ్వ బయటకు వెళ్లగా మొత్తం పది మంది కంటెస్టెంట్స్ మిగిలారు.. ఇక ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఈ వారం మొదటి నుంచి ఒక్కో కంటెస్టెంట్ ఫ్యామిలీ మేట్ హౌస్ లోకి రావడం, తమ వాళ్లకు తగిన సలహాలు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. దీంతో మొత్తానికి ఈ వారం అంతా ఎమోషనల్ వీక్ గా సాగింది. అయితే గతవారం చేసిన తప్పిదం కారణంగా టేస్టీ తేజకు పనిష్మెంట్ గా తన తల్లిని హౌస్ లోకి పంపించబోమని నాగార్జున తేల్చేసిన విషయం తెలిసిందే. ఇది అతనిని తీవ్ర నిరాశకు గురి చేయగా, ఈ సీజన్ లో తాను అడుగు పెట్టిందే తన తల్లిని హౌస్ లో చూడడం కోసం అంటూ వారం మొదటి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు తేజ. ఈ నేపథ్యంలోనే అతని ఆశ్చర్యపరిచేందుకు రహస్యంగా టేస్టీ తేజ తల్లిని హౌస్ లోకి పంపించినట్టుగా తెలుస్తోంది.
ఇక ఫైనల్ కుమరికొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉండడగా, హౌస్ లోకి వచ్చిన ప్రతి ఫ్యామిలీ మెంబర్ 'ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క.. గ్రూప్ గేమ్ ఆడొద్దు' అంటూ సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకు వచ్చింది. ఆ వార్తల ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న జరగబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సనాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరికొన్ని కొత్త ట్విస్ట్ లను గేమ్లో పెడుతూ, ప్రైజ్ మనీని మరింతగా పెంచడానికి ట్రై చేస్తున్నట్టు సమాచారం.
ఇక గ్రాండ్ ఫినాలే కి ప్రముఖ కథానాయకులు, స్టార్ హీరోల స్పెషల్ పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రైజ్ మనీ 50 లక్షలకు చేరుకోగా, ఫైనల్ కి వెళ్లే వరకు ఇది మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి హౌస్ లో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ పెరిగింది. ఇక ఫైనల్ కి చేరుకునే వాళ్ళ లిస్టులో నిఖిల్, గౌతమ్, నబిల్, యష్మి మొదటి 5 స్థానాల్లో ఉన్నారు. ఈ వారం పృథ్వీరాజ్, టేస్టీ తేజ డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)