అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 : బతికించేసిందిరా బాబోయ్.. నవ్వుతూ బయటకు వెళ్లిన నయని.. వాళ్లే బెస్ట్.. వీళ్లే వరెస్ట్

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో సండే ఫండే కాబట్టి కంటెస్టెంట్లతో నాగ్ ఆటలు ఆడించాడు. గౌతమ్, యష్మీలు సేఫ్ కాగా, ఓట్లు తక్కువ రావడంతో నయని బయటకు వచ్చేసింది.

Nayani Pavani Eliminate with Smiles And Says Nikhil Pruthvi And Hariteja Best : బిగ్ బాస్ ఇంట్లో సండే అంటే ఫన్ డే అన్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్లతో నాగ్ ఆటలు ఆడించారు. శనివారం నాటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు చీవాట్లు పెట్టారు. ఆదివారం నాడు ఆటపాటలతో ఎంటర్టైన్ చేయించారు. ఇక ఈ ఆటలు ఇలా ఉంటే.. గౌతమ్, యష్మీలు సేఫ్ అయినట్టుగా మధ్యలో చెప్పేశారు. చివరి రౌండ్ వరకు హరితేజ, నయని ఉండటం.. ఓట్లు తక్కువ రావడంతో నయని బయటకు వచ్చేయడం జరిగింది. అసలు సండే ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

ఇంగ్లీష్‌లో చెప్పే తెలుగు పాటల్ని గెస్ చేసే ఈ ఆట కోసం విష్ణు, అవినాష్ అంటూ రెండు టీంలుగా నాగ్ విడగొట్టారు. ఈ పాటలను అందరూ గెస్ చేస్తూ వచ్చారు. మధ్యలో గౌతమ్, రోహిణి డ్యాన్స్.. గౌతమ్, యష్మీ డ్యాన్స్‌ను నాగ్ మెచ్చుకున్నాడు. రోహిణి డ్యాన్స్, అవినాష్ ఎంటర్టైన్మెంట్లను నాగ్ ప్రశంసించాడు. ఈ ఆటలో విష్ణు టీం విన్ అయిందని నాగ్ చెప్పేశారు.

ఆ తరువాత గార్డెన్ ఏరియాలో స్కై, సీ, మౌంటేన్ అంటూ మూడు స్టేజీలను పెట్టాడు. పాట ఆగినప్పుడు తాను చెప్పిన దానిపైకి వెళ్లాలని అన్నాడు. చివరకు వెళ్లిన కంటెస్టెంట్ అవుట్ అని అన్నాడు. అలా చివరి వరకు ఆటలో నిలబడి నిఖిల్ గెలిచాడు. గెలిచిన నిఖిల్ వల్ల లక్ష ప్రైజ్ మనీ వచ్చిందని చెప్పారు. దీంతో టోటల్ ప్రైజ్ మనీ 42 లక్షల 16 వేలు అయిందని నాగ్ చెప్పారు.

ఆ తరువాత యాక్షన్ రూంలో జ్యూస్‌లు తాగించే ఆట పెట్టాడు. మంద బుద్ది, కోపిష్టి, స్వార్థం, నోటి దురుసు, బాధ్యతారాహిత్యం అంటూ ఇలా దోసకాయ, టమాట, చిల్లి, కాకరకాయ రసాలను పెట్టారు. ఇందులో చాలా మంది ప్రేరణ, గౌతమ్‌లకు రకరకాల కారణాలు చెప్పి జ్యూస్ తాగించారు. గౌతమ్ యష్మీకి, యష్మీ గౌతమ్‌కి జ్యూస్‌లు ఇచ్చుకుని మళ్లీ పాత గొడవనే నాగ్ ముందుకు తీసుకొచ్చారు. ప్రేరణ మీద ఇంటి సభ్యుల్లో చాలా మందికి కోపం ఉన్నట్టుగా కనిపించింది.

అనంతరం హరితేజ సేఫ్, నయని ఎలిమినేట్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. స్టేజ్ మీదకు వచ్చిన నయనికి తన జర్నీ వేసి చూపించాడు. అందులో చాలా వరకు ఏడ్పుగొట్టు సీన్లే ఉన్నాయి. వెళ్లిపోయే ముందు నయనికి టాస్క్ పెట్టాడు. డమ్మీ ఎవరు? బెస్ట్ ఎవరు? అని కంటెస్టెంట్ల గురించి చెప్పమని టాస్క ఇచ్చాడు.

దీంతో గంగవ్వ, రోహిణి, గౌతమ్, ప్రేరణ, విష్ణులు డమ్మీ ప్లేయర్స్ అని చెప్పింది. గంగవ్వకు ఒళ్లు నొప్పులు ఎక్కువ అయ్యాయ్.. ఏజ్ రిత్యా ఆడలేకపోతోంది అందుకే డమ్మీ అని చెప్పింది. మనం ఎదుటి వాళ్లకి ఏం ఇస్తే అదే మనకు వస్తుంది అంటూ గౌతమ్‌కు కౌంటర్ వేసింది. వెనకాల మాట్లాడొద్దని, ఆట ఇంకా బాగా ఆడాలని, ఎంటర్టైన్మెంట్ బాగానే చేస్తున్నారి రోహిణికి చెప్పింది.

విష్ణు ఇంకా బాగా ఆడే అవకాశం ఉందని, ఆమె ముందుకు వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రేరణ అయితే కోపంలో ఏదేదో మాట్లాడేస్తోందని, మాటలు కంట్రోల్‌లో పెట్టుకుంటే బెటర్ అని సలహాలు ఇచ్చింది. ఇక హరితేజ బెస్ట్ అని, ఫైర్ ఇంకా బయటకు తీయాలని చెప్పింది. నిఖిల్ బయటకు కోపం కనిపిస్తాడని, కానీ లోపల మాత్రం చాలా చిన్న పిల్లాడు అని బెస్ట్ కంటెస్టెంట్‌గా చెప్పింది. ఇంట్లో ఉన్న వాళ్లందరిలో కెల్లా పృథ్వీ చాలా నిజాయితీ గల వ్యక్తి.. ఆటలు కూడా బాగా ఆడుతున్నాడు అని చెప్పింది.

ఇంట్లో అందరూ కలిసి తనకు డెకరేషన్ అని పేరు పెట్టారట. మాట్లాడేటప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తోందని అలా పేరు పెట్టారట. ఇక వెళ్లే ముందు నయనిని ఇమిటేట్ చేయమని అవినాష్‌కు నాగ్ టాస్క్ ఇచ్చారు. నయనిని రోస్ట్ చేసేశాడు అవినాష్. ఆ ఇమిటేషన్‌కు నయని హర్ట్ అయినట్టుగానే ఉంది. మామూలుగా నయని ఇలా ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్పులు పెడబొబ్బులతో విసిగిస్తుందని అంతా అనుకుంటారు. కానీ కన్నీరు రాకుండా మ్యానేజ్ చేస్తూ ఏడుస్తూనే బయటకు వెళ్లింది. ఇంట్లో కూడా ఇలానే కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ నవ్వుతూ ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు.

Also Read : ఆట కంటే మాటే ముఖ్యమన్న నబిల్.. యష్మీ రంగు బయటపెట్టిన నాగ్.. ప్రేరణ డేటింగ్ ముచ్చట్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget