Bigg Boss 8 Telugu Day 24 Promo: గద్దెనెక్కిన కిరాక్ సీత... సోనియా వల్ల నిఖిల్‌ని చీఫ్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్న హౌస్ మేట్స్
చీఫ్ గా నిఖిల్ పై సోనియా వల్ల హౌస్ మేట్స్ లో నెగెటివిటీ పెరుగుతోంది. తాజాగా రిలీజైన డే 24 ప్రోమోలో క్లాన్ ను ఎన్నుకున్న సభ్యులు ఈ విషయాన్ని స్పష్టంగా బయట పెట్టారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో రోజురోజుకూ లెక్కలు మారిపోతున్నాయి. ముఖ్యంగా సోనియా వల్ల పృథ్వీ, నిఖిల్ పై నెగెటివిటీ పెరుగుతుంది. వాళ్లు స్ట్రాటజికల్ గా గేమ్ ఆడుతున్నప్పటికీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటూ మిగతా ఇంటి సభ్యులందరూ ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా డే 24 కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, అందులో ఈ విషయాన్ని స్పష్టంగా చూపించారు. సోనియా, పృథ్వి తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరూ చీఫ్ గా సీతను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమోలో ఉన్న విశేషాలపై ఒక లుక్కేద్దాం పదండి.
గద్దెనెక్కిన కిరాక్ సీత...
నిన్న జరిగిన రెండవ చీఫ్ టాస్క్ లో కిరాక్ సీత బొమ్మ చివరిగా మిగిలిపోవడంతో ఆమెను బిగ్ బాస్ కాంతారా చీఫ్ గా అనౌన్స్ చేశారు. ఇక శక్తి టీం చీఫ్ గా ఇప్పటికే నిఖిల్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రోమోలో కొత్త చీఫ్ సెలెక్ట్ అయిన సందర్భంగా ఇష్టమైన క్లాన్ లోకి వెళ్లే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. ఈ నేపథ్యంలోనే ప్రోమోలో నిఖిల్ క్లాన్ లోకి వెళ్లడానికి సోనియా, పృథ్వీ ఇంట్రెస్ట్ చూపించారు. మిగతా హౌస్ మేట్స్ అందరూ సోనియా క్లాన్ లోకి వెళ్లడానికే ఆసక్తిని కనబరిచారు.
Read Also : Bigg Boss News: బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ హీరోయిన్ల ఎంట్రీ... మహేష్ బాబు మరదలు కూడా
నిఖిల్ ఫేక్... ముఖంపైనే చెప్పేసిన నబిల్
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో గ్రూప్ గేమ్ మొదలైంది. పృథ్వీ, సోనియా, నిఖిల్ ఒక టీం లాగా ఉంటే.. యష్మి గౌడ, నబిల్ అఫ్రిది, ప్రేరణ కంబం మరొక టీం, కిరాక్ సీత, నైనిక, విష్ణు ప్రియ ఇంకో టీంగా మారిపోయారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో విష్ణు ప్రియ మాట్లాడుతూ "శక్తి క్లాన్ లో నాకు గుర్తింపు వచ్చినట్టుగా అనిపించలేదు. నాకు సీత దగ్గర ఉండాలని ఉంది" అంటూ సీత దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత సోనియా "నిఖిల్ కో ఆర్డినేషన్ బాగుంటుంది. నేను నిఖిల్ క్లాన్ ని చూజ్ చేసుకుంటున్నాను" అని సోనియా చెప్పగానే ఊహించింది కదా అన్నట్టుగా యష్మి గౌడ మరోసారి ఆటిట్యూడ్ తో స్మైల్ ఇచ్చింది. "శక్తి టీంలో ఆల్రెడీ స్ట్రెంత్ ఉండడం వల్ల కొన్నిసార్లు నాకు ఆడే ఛాన్స్ దక్కలేదు. సీత క్లాన్ లో నేను ఆడగలను అనుకుంటున్నాను" అంటూ సీత క్లాన్ లోకే వెళ్ళిపోయింది నైనిక.
"నిఖిల్ గుడ్ లీడర్, స్ట్రాంగ్" అంటూ పృథ్వి నిఖిల్ టీంలోకి వెళ్లిపోయాడు. నెక్స్ట్ నబిల్ "సీత అండ్ నిఖిల్ ని కంపేర్ చేస్తే నాకు సీత రియల్ అనిపిస్తుంది. అక్కడైతే నేను గేమ్ బాగా ఆడగలను, నా బెస్ట్ ఇవ్వగలను అనుకుంటున్నాను" అంటూ ఇన్ డైరెక్ట్ గా నిఖిల్ పై ఫేక్ అంటూ కామెంట్స్ చేశాడు.. చివరగా యష్మి గౌడ తన నోటికి పని చెప్పింది. సమయం సందర్భం లేకుండా ఎప్పటిలాగే "నేను ఈ హౌస్ కి బాండ్ ని పెంచుకోవడానికి రాలేదు. స్పోర్టివ్ గా గేమ్ ఆడటానికి వచ్చాను, సీత క్లాన్ లో ఉన్న అందరూ గేమ్ ను స్పోర్టివ్ గా తీసుకుంటారు అని నమ్ముతున్నాను. అందుకే కాంతారా టీం" అంటూ వెళ్తుండగా... ప్రేరణ "ఒక్క నిమిషం బిగ్ బాస్" అంటూ యష్మి గౌడను ఆపింది. ప్రేరణ డైలాగ్ తో ప్రోమోను ఎండ్ చేసి అసలేం జరగబోతోంది అనే విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు బిగ్ బాస్.