శివాజీకి వేలు చూపించిన ప్రియాంక, నేను ఎవడి మాట వినను అన్న శివాజీ - రెండో వారం వాడివేడిగా సాగిన నామినేషన్స్!
బిగ్ బాస్ సీజన్ 7 లేటెస్ట్ ప్రోమో విడుదలయింది. ప్రోమోలో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఓ రేంజ్ లో జరగబోతున్నట్లు చూపించారు. ఈవారం ఎక్కువ మంది శివాజీని టార్గెట్ చేసినట్లు ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.
'బిగ్ బాస్' సీజన్ 7 మొదటి వారానికి గాను కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక తాజా ప్రోమోలో ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా ఉండబోతున్నట్లు చూపించారు. మొదటివారం సిల్లీ రీజన్స్ తో ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. కానీ రెండో వారం నామినేషన్స్ అయితే వాడివేడిగా ఉన్నాయని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇక ప్రోమోలో భాగంగా ముందుగా బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ గురించి చెప్పారు.' బిగ్బాస్ ఎవరు పేరు పిలుస్తారో వారు నామినేషన్ కోసం బిట్ లో నిలబడాల్సి ఉంటుంది.
బిట్ లో ఉన్న కంటెస్టెంట్ ను ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారు ముందుకొచ్చి ఒకరి తర్వాత ఒకరు తగు కారణాలు చెప్పి ముందున్న బజర్ ని ప్రెస్ చేసి స్లష్ ని డంప్ చేయాల్సి ఉంటుంది' అని చెప్పగానే.. సందీప్ "నా నామినేషన్ ప్రిన్స్ బిగ్ బాస్" అని అంటాడు. అప్పుడు ప్రిన్స్.." నువ్వు నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నావ్ అని అంటాడు. నేను టార్గెట్ చేయాలంటే ప్రశాంత్ ని టార్గెట్ చేయాలి. కానీ నేను అలా చేయలేదు." అని సందీప్ అంటాడు." అన్నా, నేను తప్పు చేసింది చెప్పు. నావల్ల గిట్ల అనుకున్నారు, గట్లనుకున్నారు అని కాదు" అని ప్రశాంత్ సందీప్ తో అంటాడు.
" నాకు నీతో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. పీకుతున్నవ్ అనే వర్డ్ నాకు నచ్చలేదు" అని రతిక టేస్టీ తేజను నామినేట్ చేస్తుంది." తిని తొంగుంటున్నవ్ అని నువ్వు నన్ను అన్నప్పుడు, ఏం పీకుతున్నావ్ అంటే తప్పేంటి" అని తేజ బదిలిస్తాడు. "ప్రశాంత్ వేటాడేందుకు వచ్చాడు, వాడికి ఫోకస్ ఉంది. ఆడు మగాడు అంటే నేను పేకాటడానికి వచ్చానా అన్నా" అని అమర్ దీప్ శివాజీని నామినేట్ చేస్తాడు. "ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పాయింట్ చెప్పేలోపు మీరు ఒక పాయింట్ చెప్పి దాన్ని దబాయిస్తున్నారు" అని ప్రియాంక జైన్ శివాజీ తో అంటుంది." నేనిక్కడ బిగ్ బాస్ మాట తప్ప ఎవడి మాట వినను?" అని శివాజీ ప్రియాంకకు బదులిస్తాడు.
దానికి ప్రియాంక సీరియస్ అవుతూ..' సార్ నాతో ఇలా మాట్లాడకండి' అని చెప్తే, 'అంత లేదమ్మా' అని శివాజీ అంటాడు. "నేనిక్కడ ఎవరికి నచ్చట్లేదా? లేక నా మీద ఎవరికి ఒపీనియన్ లేదా? అని అనిపిస్తుందని" అమర్దీప్ అంటే "నువ్వు ఫస్ట్ గేమ్ ఆడు" అని శివాజీ బదిలిస్తారు. ఇక చివర్లో హౌస్ మెట్ సందీప్ ఇంటి నుంచి బయటకు పంపేందుకు మీరు ఒక కంటెస్టెంట్ ను డైరెక్ట్ గా నామినేట్ చేయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ ఆదేశిస్తే, చివరగా శివాజీని చూపించారు. దీంతో సందీప్ నేరుగా శివాజీని నామినేట్ చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది." నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే వచ్చా. Iam a Entartainer.. That's All" అని శివాజీ చెప్పే డైలాగ్ తో ప్రోమో ఎండ్ అవుతుంది. మొత్తానికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఓ రేంజ్ లో ఉండబోతుందని ప్రోమో లోనే చూపించారు. అంతేకాకుండా ఈ వారానికి ఎక్కువ మంది శివాజీనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
Also Read : రజినీకాంత్ తో లోకేష్ కనగరాజ్ మూవీ - రెగ్యులర్ షూటింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
View this post on Instagram