అన్వేషించండి

Bigg Boss 6 Telugu Episode 44: బురదతో తలంటిన బిగ్‌బాస్, ఈసారి హౌస్ టార్గెట్ మళ్లీ రేవంతే

Bigg Boss 6 Telugu: బురద స్నానాలతో నామినేషన్ ప్రక్రియ సాగింది.

Bigg Boss 6 Telugu: సోమవారం ఎపిసోడ్ వాడీ వేడిగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే గీతూని చూపించేశాడు బిగ్ బాస్. ఆమె బాలాదిత్య, ఆదిరెడ్డితో కూర్చుని మాట్లాడుతోంది. సుదీప లేకపోతే నువ్వు సెట్ అయిపోతావు అన్న గీతూ మాటల్నే గుర్తు చేశాడు బాలాదిత్య. నీ మీద ప్రేమ లేకపోతే నా భార్యతో నీ గురించి చెప్తా అన్నాడు. అయినా గీతూ ఏమాత్రం తగ్గలేదు. తరువాత ఇనయా - సూర్య మాట్లాడుకుంటూ కనిపించారు. ఇద్దరం కొట్టుకుందాం ఆడదాం అంటూ కనిపించాడు సూర్య. ఇనయా కూడా ‘రెడీయా వార్‌కి’ అంది. తరువాత సూర్య కెమెరాలతో మాట్లాడు కనిపించాడు. ‘ఇనయా గేమ్‌ని మారుస్తా, ఇనయా ఇండిపెండెంట్ ఉమెన్, అందుకే ఆమె అంటే ఇష్టం, అమ్మని కానీ, బుజ్జమ్మని కానీ పట్టుకుని ఏడవాలని ఉంది బిగ్ బాస్’ అన్నాడు సూర్య. తెల్లారడంతో ఓ జోరు పాటతో ఇంటి సభ్యులను నిద్రలేపాడు బిగ్ బాస్. 

నామినేషన్లు షురూ...
ఈసారి నామినేషన్లలో బురద స్నానాన్ని ప్రయోగించారు బిగ్ బాస్. ఎవరైతే నామినేట్ అవుతారో వారికి బురదతో తలంటేలా షవర్ పెట్టారు. ఫైమా బాలాదిత్యని, వాసంతిని నామినేట్ చేసింది. తరువాత రోహిత్ రేవంత్‌ని, శ్రీహాన్‌ను నామినేట్ చేశారు. రేవంత్ కెప్టెన్ గా ఉండి నిద్రపోవడంపై నామినేట్ చేసినట్టు చెప్పారు. శ్రీసత్య కూడా రేవంత్ నే నామినేట్ చేసింది, తరువాత బాలాదిత్యను చేసింది. కెప్టెన్ అయినప్పుడు రేవంత్ చేసి పని నచ్చలేదని చెప్పింది. బాలాదిత్య కూడా ‘కెప్టెన్‌గా అయి పడుకోవడం నచ్చలేదు’ అంటూ రేవంత్ ను నామినేట్ చేశాడు. ఇక ఫైమాను కూడా రెండో నామినేట్ చేశాడు. 
 
ఆదిరెడ్డి నామినేషన్
ఆదిరెడ్డి అర్జున్‌ను నామినేట్ చేశాడు. అర్జున్ ఎంటర్టైన్ చేయలేదు అని, నడుము ఊపుతూ ఇలా డ్యాన్సు చేశానని, అర్జున్ చేయలేదు అని నామినేట్ చేశాడు ఆదిరెడ్డి. ఆయన నడుము ఊపుతూ చేసిన డ్యాన్సు చూసి అందరూ నవ్వారు. తరువాత వాసంతిని నామినేట్ చేసి ఆమెతో కాసేపు వాదించాడు. ఆదిరెడ్డి ‘మీరు సోఫా వెనుక రెండు సార్లు నిలిచారు. నేను కెప్టెన్ అయ్యాను. నాకన్న తక్కువ డిజర్వ్, నాకన్కా తక్కువ ఆడుతున్నారు’ అంటూ వాసంతిని మాటలతోనే రెచ్చగొట్టాడు. 

శ్రీహాన్ వర్సెస్ ఇనయా
‘మొన్న గేమ్‌లో మీ టీమ్ గెలిచింది... అప్పుడు నువ్వు యాక్షన్ చేస్తూ లయర్స్ అన్నావ్ అది నచ్చలేదు’ అన్నాడు. దానికి ఇనాయ వాదించింది. శ్రీహాన్ ‘వెళ్లి కూర్చో’ అంటూ కసురుకున్నాడు. తరువాత కీర్తిని నామినేట్ చేశాడు. వీక్ కంటెస్టెంట్లు ఇంట్లో ఉండకూడదు అంటూ కామెంట్ చేశాడు. మెరీనా ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. అలాగే రేవంత్ ని కూడా నామినేట్ చేసి కెప్టన్‌గా నిద్రపోవడం నచ్చలేదు అని చెప్పింది. ఇక గీతూ వాసంతిని నామినేట్ చేసింది. 

ఈ నామినేషన్లలో ఎందుకోగానీ గీతూని ఎవరూ నామినేట్ చేయలేదు. కెప్టెన్ అయినందున సూర్యను నామినేట్ చేయలేదు.గీతూ, సూర్య తప్ప మిగతా వారంతా నామినేట్ అయ్యారు. 

Also read: ‘ఏమైనా కానీ తగ్గేదేలే’ అంటూ బురదలో తడిసి ముద్దయిన రేవంత్, ఇనయా వర్సెస్ శ్రీహాన్ గొడవ మళ్లీ రాజుకుందిగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
CSIR UGC NET 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
Embed widget