Bigg Boss 5 Telugu: 'గేమ్ గేమ్ లా చూడండి.. ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు'.. సిరిపై షణ్ముఖ్ తల్లి
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో రవి, ప్రియాంక, షణ్ముఖ్ ల ఫ్యామిలీలు సందడి చేయబోతున్నాయి.
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో రవి, ప్రియాంక, షణ్ముఖ్ ల ఫ్యామిలీలు సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే రవి ఫ్యామిలీకి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. తాజాగా ప్రియాంక, షణ్ముఖ్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చిన ప్రోమోను విడుదల చేశారు. షణ్ముఖ్ తన తల్లిని చూసిన వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత తన కెప్టెన్సీ బ్యాండ్ ను తన తల్లి చేతికి పెట్టి మురిసిపోయాడు. 'నీ మోజ్ రూమ్ చూడాలి నేను' అంటూ ఆమె అడగడంతో షణ్ముఖ్ తీసుకెళ్లి చూపించాడు.
ఆ తరువాత రవి కూతురు వియా.. బిగ్ బాస్ అంకుల్ ఎక్కడ..? అని రవిని అడిగింది. 'బిగ్ బాస్ అంకుల్ ఒకసారి చూస్తా మిమ్మల్ని' అంటూ క్యూట్ గా అడిగింది. మోజ్ రూమ్ లో తన తల్లితో కలిసి కూర్చున్న షణ్ముఖ్.. ఎవరితో తన బాండ్ బావుందని రవి, సిరి పేర్లను తీసుకురాగా.. అందరితో ఉండు అని షణ్ముఖ్ తల్లి చెప్పింది. 'దీపుని కలిశావా..?' అని షణ్ముఖ్ అడగ్గా.. 'కలిశాను..' అని చెప్పింది అతడి తల్లి.
'నువ్వు అబద్ధం చెబుతున్నావ్' అని అనగా.. 'అమ్మ అబద్ధం చెబుతుందా..?' అని అన్నారు. 'వంద సార్లు అడక్కు.. బావుంది' అని చెప్పింది షణ్ముఖ్ తల్లి. ఆ తరువాత సిరి ఎగురుకుంటూ మోజ్ రూమ్ లోకి వచ్చింది. 'ఏంటి ఆంటీ సంగతులు' అని సిరి అడగ్గా.. 'గేమ్ గేమ్ లా చూడండి. ఎక్కువ ఎమోషనల్ అయిపోవద్దు' అని డైలాగ్ వేసింది.
#Priyanka and #Shanmukh families tho house lo sandadi#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/LJGhtu7JHW
— starmaa (@StarMaa) November 26, 2021
Also Read:'2021 నాకో రఫ్ ఇయర్..' సమంత వీడియోపై ఫ్యాన్స్ కామెంట్స్..
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మ లాంటి పాట... 'జనని' వచ్చేసింది! చూశారా?
Also Read: 'అనుభవించు రాజా' రివ్యూ: సోసోగా ఉంది రాజుగారూ!
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!