అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: 'విన్నరే మాట్లాడాలని నా రూల్ బుక్ లో లేదు..' శ్రీరామ్ కి షణ్ముఖ్ ఎటాక్.. ఇలాంటి ప్రోమో చూసి ఉండరు..
తాజాగా విడుదలైన ప్రోమోలో షణ్ముఖ్ ని పిలిచిన బిగ్ బాస్.. తనను ఎవరైతే నామినేట్ చేశారో వారందరినీ టీవీలో చూపించారు. మొత్తం ఎనిమిది మంది ఇంటి సభ్యులు షణ్ముఖ్ ని నామినేట్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు ఐదో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ ఉండడంతో ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. దీనికి సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలో హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు సభ్యుల పేర్లు చెప్పమని అడిగారు బిగ్ బాస్. ఈ క్రమంలో ఒక్కొక్కరూ తమకు నచ్చిన కారణాలను చెబుతూ హౌస్ మేట్స్ ని నామినేట్ చేశారు.
Also Read: సమంతకు భరణం ఇస్తున్నారా..? అసలు నిజాలివే!
ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో షణ్ముఖ్ ని పిలిచిన బిగ్ బాస్.. తనను ఎవరైతే నామినేట్ చేశారో వారందరినీ టీవీలో చూపించారు. మొత్తం ఎనిమిది మంది ఇంటి సభ్యులు షణ్ముఖ్ ని నామినేట్ చేశారు. ఆ తరువాత సన్నీ.. 'ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు నన్ను ఎందుకు నామినేట్ చేశారో అర్ధం కాలేదు' అని హౌస్ మేట్స్ కి చెబుతుండగా.. 'ఫస్ట్ వీక్ లో ఉన్నట్లు నువ్ ఫోర్త్ వీక్ లో లేవని' విశ్వ కామెంట్ చేశాడు. శ్వేతాకి మానస్ కి మధ్య ఏదో గొడవ జరిగినట్లు ఉంది. మానస్ ని ఉద్దేశిస్తూ.. 'అంత యాటిట్యూడ్ అవసరం లేదు' అని శ్వేతా అనగా.. 'నీక్కూడా అంత యాటిట్యూడ్ అవసరం లేదని' మానస్ బదులిచ్చాడు.
ఆ తరువాత కిచెన్ రూమ్ లో జెస్సీని ఉద్దేశిస్తూ.. 'ఇలా ఉంటే ఎవరి తిండి వాళ్లు వండుకోవాలని రూల్ పెడతా ఓకేనా నీకు' అని ప్రశ్నించాడు శ్రీరామ్. దీంతో జెస్సీ సీరియస్ అవుతూ.. 'ఫుడ్ ఇవ్వను.. ఫుడ్ పెట్టను అని ఎలా చెప్తారు..?' అని ఫైర్ అవుతుండగా.. షణ్ముఖ్ ఇన్వాల్వ్ అవుతూ.. 'ఇది మీ ఇల్లు కాదు.. బిగ్ బాస్ హౌస్ ఇది' అని శ్రీరామ్ పై విరుచుకుపడ్డాడు. వెంటనే శ్రీరామ్.. 'షణ్ముఖ్ నువ్ మధ్యలో వచ్చి మాట్లాడకు.. నీకు ఫస్ట్ నుంచి ఏమైందో తెలియదు' అని వేలు చూపిస్తూ మాట్లాడగా.. 'నేను మధ్యలో వస్తాను' అని షణ్ముఖ్.. 'అసలు నువ్ ఎవరు చెప్పడానికి అని సిరి' శ్రీరామ్ ని వేసుకున్నారు.
ఆ తరువాత తన స్నేహితులతో కూర్చున్న షణ్ముఖ్.. 'నేను కెప్టెన్ నేనేదైనా చెప్తానంటే దొబ్బవ్' అని అన్నాడు. 'గ్రూప్ గా వచ్చి ఎటాక్ చేయకూడదు' అని యానీ.. 'కావాలని వన్ చేస్తున్నారని' జెస్సీ మాట్లాడుతూ కనిపించారు. వెంటనే షణ్ముఖ్ తో మాట్లాడడానికి వచ్చిన శ్రీరామ్ 'నువ్ విన్నావా అసలు నేనేం అన్నానో' అని అనగా.. 'తను నా ఫ్రెండ్.. నేను స్టాండ్ తీసుకుంటా' అని బదులిచ్చాడు షణ్ముఖ్. ఇక్కడ అందరూ అందరికీ ఫ్రెండ్సే అని శ్రీరామ్ అనగా.. 'బట్ నా రూల్ బుక్ లో విన్నరే మాట్లాడాలని లేదు' అని షణ్ముఖ్ యాటిట్యూడ్ తో అన్నాడు. ఆ తరువాత జెస్సీకి హైఫై ఇస్తూ.. 'ఇప్పుడు చూస్తార్రా.. నా గేమ్' అని చెప్పాడు షణ్ముఖ్.
Conflict between #Shanmukh and #SreeramaChandra .. Ipudu chudali evari game ento!#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/7IGeXWuQ33
— starmaa (@StarMaa) October 4, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
పాలిటిక్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion