News
News
X

Bigg Boss 5 Telugu : ఎలిమినేట్ అయిన సరయు.. లహరి, షణ్ముఖ్ లపై ఫైర్.. తట్టుకోలేక ఏడ్చేసిన విశ్వ..

ఎప్పటిలానే ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. తన స్టెప్పులతో ఆడియన్స్ ను అలరించారు.

FOLLOW US: 
Share:

ఎప్పటిలానే ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. తన స్టెప్పులతో ఆడియన్స్ ను అలరించారు. అనంతరం హౌస్ మేట్స్ ని 'సన్ డే.. ఫన్ డే' అంటూ పలకరించారు. జెస్సీని పక్కన నుంచోమని చెప్పి.. మిగిలిన 18 మంది కంటెస్టెంట్ ని పెయిర్స్ గా మారి.. ర్యాంప్ వాక్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ ను ర్యాంప్ వాక్ కోసం వాడుకోమని చెప్పారు. ఈ టాస్క్ కి జెస్సీని జడ్జిగా నియమించారు. జెస్సీతో పాటు నాగ్ కూడా మార్క్స్ వేస్తానని చెప్పారు. 

రవి-హమీద, ప్రియా-షణ్ముఖ్, శ్రీరామచంద్ర-సిరి, లోబో-ఉమాదేవి, విశ్వ-సరయు, ఆర్జే కాజల్-సన్నీ, లహరి-మానస్, నటరాజ్-యానీ, శ్వేతా-పింకీ పెయిర్స్ గా ఫామ్ అయ్యారు. 

 • ముందుగా కొరియోగ్రాఫర్లు నటరాజ్-యానీ మాస్టర్ లతో ర్యాంప్ వాక్ మొదలుపెట్టారు. ఇద్దరూ 'i wanna follow follow follow you' పాటకు కొరియోగ్రఫీ లాంటి ర్యాంప్ వాక్ చేశారు.
 • విశ్వ-సరయు.. 'సయ్యా సయ్యా' సాంగ్ కి డంబుల్స్ పట్టుకొని ర్యాంప్ వాక్ చేశారు.
 • లోబో-ఉమాదేవి.. 'మరొక్కసారి చూడు' సాంగ్ కి ర్యాంప్ వాక్ చేశారు.
 • రవి-హమీద.. 'చారుశీల' పాటకు ర్యాంప్ వాక్ చేస్తూ.. యానీ మాస్టర్, జెస్సీల గొడవను ఇమిటేట్ చేసి బాగా నవ్వించారు.  
 • షణ్ముఖ్-ప్రియా.. 'నీతోనే డాన్స్ టు నైట్' పాటకు ర్యాంప్ వాక్ చేస్తూ.. షన్ను తన  'అరె ఏంట్రా ఇది..' అంటూ తన ఫేమస్ డైలాగ్ చెప్పాడు. అనంతరం నాగ్ వాళ్లిద్దరినీ డాన్స్ చేయమని చెప్పడంతో షన్ను తన స్టెప్స్ తో ఇరగదీశాడు.
 • మానస్-లహరి.. 'సీటీమార్.. సీటీమార్' అనే సాంగ్ కి ర్యాంప్ వాక్ చేశారు.
 • శ్రీరామచంద్ర-సిరి.. 'డౌన్ డౌన్ డౌన్ డప్పా..' సాంగ్ కి ర్యాంప్ వాక్ చేశారు. వీరి రొమాంటిక్ పెర్ఫార్మన్స్ చూసిన హౌస్ మేట్స్.. 'బాగా ప్లాన్ చేశారుగా' అంటూ సెటైర్స్ వేశారు.
 • ఆర్జే కాజల్-సన్నీ.. 'జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్లుగా ఉందిలే ఈ సుందరి' సాంగ్ కి ర్యాంప్ వాక్ చేశారు. 
 • శ్వేతా-ప్రియాంక సింగ్.. 'హె హలో హలో డాన్ బాస్కో' సాంగ్ కి యాటిట్యూడ్ చూపిస్తూ ర్యాంప్ వాక్ చేశారు. 

ఈ మొత్తం క్యాట్ వాక్ రౌండ్ లో శ్వేతా-ప్రియాంక విన్నర్స్ గా నిలిచారు. 

మానస్ సేఫ్.. 

నామినేషన్ లో ఉన్న నలుగురిని రెడ్ కార్పెట్ బిగినింగ్ కి వెళ్లి నుంచోమని నాగ్ చెప్పారు. వారి పేర్లు రాసి ఉన్న ట్రేలను వాళ్ల ముందు ఉంచారు. ఆ ట్రేలో యాపిల్ ఉంది. దాన్ని కత్తితో కట్ చేయాలని చెప్పారు నాగ్. యాపిల్ లోపల రెడ్ గా ఉంటే మీరు సేఫ్ కాదని చెప్పారు. ఈ టాస్క్ లో సరయు, జెస్సీ, కాజల్ లకు 'అన్ సేఫ్' రాగా.. మానస్ సేఫ్ అయ్యాడు. 

నేను మీకు తెలుసా..?

ఈసారి బిగ్ బాస్ పెయిర్స్ క్రియేట్ చేశారు.  సిరి-జెస్సీ, మానస్-ప్రియాంక, లహరి-సన్నీ, యానీ-కాజల్, రవి-శ్వేతా, ఉమా-సరయు, షణ్ముఖ్-విశ్వ, నటరాజ్-ప్రియా, గేమ్ లో గుమ్మడికాయ లోబో.. ఒకవేళ మీకు అవకాశం ఇస్తే మీరు ఒకరినొకరు ఏ ప్రశ్న అడగలనుకుంటున్నారని నాగ్ ఒక్కొక్కరిని ప్రశ్నించారు. 

సిరి-జెస్సీ

ముందుగా సిరి 'నువ్ ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తావ్..? అని జెస్సీని అడిగింది. అది ఓవరాక్షన్ కాదని నేచురల్ అని అన్నారు. తరువాత 'ఎందుకంత త్వరగా ఎంగేజ్ అయ్యావ్' అని సిరిని అడిగాడు జెస్సీ. దానికి సిరి 'నువ్ వస్తావ్ అని తెలియక' అని కొంటెగా బదులిచ్చింది. 
అనంతరం వారిద్దరినీ నాగార్జున ప్రశ్నించారు. 'జెస్సీ మొదటిరోజు వేసుకున్న స్కార్ఫ్ ఏంటి' అని సిరిని అడగ్గా.. తప్పు సమాధానం చెప్పింది. ఆ తరువాత జెస్సీని సిరి ఫుల్ నేమ్ ఏంటని అడిగారు నాగ్. శిరీష హన్మంత్ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు జెస్సీ. 

ప్రియా-నటరాజ్

మీ పార్ట్నర్ లో మార్చాలనుకుంటున్న క్వాలిటీ ఏంటని ప్రియని అడగ్గా.. కొంచెం సెల్ఫిష్ గా ఉండాలని చెప్పింది. అదే ప్రశ్న నటరాజ్ ని అడిగితే.. 'తన గేమ్ తన గేమ్ ఆడడం లేదని.. అది మార్చుకోవాలని' చెప్పారు. ఆ తరువాత నాగార్జున.. 'ప్రియా నాతో నటించిన మొదటి సినిమా ఏంటి' అని నటరాజ్ ని అడగ్గా చెప్పలేకపోయారు. దానికి ఆన్సర్ 'చంద్రలేఖ' అని చెప్పింది ప్రియా. నటరాజ్ వైఫ్ కి ఎన్నో నెల అని నాగ్ ప్రియాను అడగ్గా.. సెవెన్త్ మంత్ అని కరెక్ట్ గా ఆన్సర్ చేసింది.

సరయు-ఉమాదేవి

మీ పార్ట్నర్ కి సూటయ్యే క్యారెక్టర్ చెప్పమని నాగ్ సరయిని అడగ్గా.. 'రౌడీ రంగమ్మ' అని చెప్పింది. అదే ప్రశ్నను ఉమాదేవిని అడగ్గా.. 'అర్జున్ రెడ్డి' అని బదులిచ్చింది. ఆ తరువాత నాగార్జున.. ఉమాకి ఏ పదమంటే నచ్చదని సరయుని అడగ్గా.. 'నీకు రాదు.. నీకు నచ్చదు..' అనే పదాలని బదులిచ్చింది. సరయుకి సూపర్ పవర్ ఉంటే ఏం చేస్తుందని ఉమాదేవిని ప్రశ్నించారు నాగ్.. దానికి ఆమె అందరినీ అర్జున్ రెడ్డి లను చేసేస్తోందని ఫన్నీగా చెప్పింది. 

ఆర్జే కాజల్-యానీ

మీ పార్ట్నర్ కి ఏది ఎక్కువ సంతోషాన్నిస్తుందని యానీ మాస్టర్ ని అడగ్గా.. ఏదైనా రిలేటెడ్ టు బిగ్ బాస్ అని అన్నారు. అదే ప్రశ్నను కాజల్ ని అడగ్గా.. 'డాన్స్' అని చెప్పింది కాజల్. కాజల్ ప్రస్తుత ప్రొఫెషన్ ఏంటని నాగ్.. యానీ మాస్టర్ ని అడగ్గా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కరెక్ట్ గా ఆన్సర్ చేశారు యానీ మాస్టర్. యానీ ఎన్ని భాషల్లో మాట్లాడగలదని కాజల్ ని అడగ్గా.. నాలుగు అని సరైన సమాధానం చెప్పింది కాజల్. 

షణ్ముఖ్-విశ్వ

మీ పార్ట్నర్ ఏ హౌస్ మేట్ గురించి మాట్లాడతారని చెప్పగా.. ముందు దీప్తి సునయన పేరు చెప్పి ఆ తరువాత సిరి పేరు చెప్పాడు. అదే ప్రశ్న షణ్ముఖ ని అడగ్గా.. పింకీ గురించి, వాళ్ల చెల్లి గురించి అని చెప్పాడు. ఆ తరువాత నాగార్జున.. విశ్వ లోబోను ఎత్తుకోగలడా..? అని షణ్ముఖ్ ని అడగ్గా.. 'ఎత్తుకోగలడు కానీ రేపు లేవలేడని' చెప్పాడు షణ్ముఖ్. కానీ ఎత్తుకొని చూపించాడు విశ్వ. షణ్ముఖ్ చేతి మీదున్న టాటూ ఏంటి..? అని విశ్వని నాగ్ అడగ్గా.. 'డి' (దీప్తి) అని చెప్పాడు. 

శ్రీరామచంద్ర-హమీద

శ్రీరామచంద్రకి ఏం లేకుండా బ్రతకలేడని హమీదను నాగ్ ప్రశ్నించగా.. మ్యూజిక్ అని చెప్పింది. అదే ప్రశ్న శ్రీరామచంద్రని అడగ్గా.. హమీద క్యాట్స్ లేకుండా ఉండలేదని చెప్పాడు శ్రీరామచంద్ర. 

మానస్-ప్రియాంక

బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక క్రష్ ఎవరు..? అని మానస్ ని అడగ్గా.. శ్రీరామచంద్ర అని చెప్పాడు. మానస్ అబ్సెషన్ ఏంటి..? ఏంటని ప్రియాంకను అడగ్గా.. వర్కవుట్ అని చెప్పింది. కానీ అది తప్పని హెయిర్ అంటే తనకు అబ్సెషన్ అని చెప్పాడు మానస్. ప్రియాంక చేసుకోబోయే వాడిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి..?అని మానస్ ని అడిగారు నాగ్. ఓపిక అండ్ కేరింగ్ అని చెప్పాడు మానస్.  


లహరి-సన్నీ

సన్నీ ఫేస్ లో బెస్ట్ ఫీచర్ ఏంటి..? అని లహరిని అడగ్గా.. హెయిర్ అని చెప్పింది. అదే ప్రశ్న సన్నీను లహరి గురించి అడగ్గా.. కళ్లు అని చెప్పాడు. హౌస్ లో ఒకరిని లహరి 'స్కూల్ నుంచి డైరెక్టర్ గా వచ్చేశారని..' అంది. ఆ వ్యక్తి ఎవరని నాగ్.. సన్నీని అడగ్గా.. జెస్సీ పేరు చెప్పాడు.  
సన్నీలో హిడెన్ టాలెంట్ ఏంటని నాగ్.. లహరిని అడగ్గా.. టోన్ మార్చి బర్డ్ లా మాట్లాడతారని చెప్పాడు. అలా చేసి చూపించాడు సన్నీ. నాగ్ కి డిఫరెంట్ టోన్ లో 'ఐలవ్యూ' చెప్పగా.. అది ఏ భాషలో చెప్పినా తనకు అర్ధమవుతుందని నాగ్ ఫన్ చేశారు. 

రవి-శ్వేతా 

శ్వేతా మీద ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటని రవిని అడిగారు నాగ్. దానికి రవి.. 'కూల్' అంటూ బదులిచ్చాడు. అదే ప్రశ్నను శ్వేతాను అడగ్గా.. 'గుడ్ వైబ్ ఫర్ మీ..' అని రవి గురించి చెప్పింది. రవి కూతురి వయసెంత..? అని నాగ్.. శ్వేతను అడగ్గా.. 5 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పింది. 
శ్వేతా ఊతపదం ఏంటని నాగ్.. రవిని అడగ్గా.. 'సెట్టూ..' అని చెప్పాడు.  

ఇక లోబోని హౌస్ మేట్స్ అందరికీ నిక్ నేమ్స్ ఇవ్వమని అడిగారు నాగ్. దానికి లోబో ఇచ్చిన పేర్లేంటంటే..  

 • రవి-మిల్క్ బాయ్
 • శ్వేతా-టామ్ బాయ్
 • సన్నీ-చాక్లెట్
 • లహరి-వద్దు సర్
 • మానస్-హ్యాండ్సమ్
 • ప్రియాంక-బ్యూటిఫుల్
 • యానీ-అమ్మ
 • కాజల్-ఎలుక
 • సరయు-తొండ
 • ఉమా- తరువాత చెప్తా సర్..
 • నటరాజ్-బావ
 • ప్రియా-క్వీన్
 • విశ్వ-చపాతీ
 • షణ్ముఖ్-డార్లింగ్
 • హమీద-వద్దు సర్ పరేషాన్ చేస్తారు..
 • శ్రీరామచంద్ర-మూడీ గయ్
 • సిరి-బటర్ ఫ్లై
 • జెస్సీ-క్యాట్ 

కాజల్ సేఫ్.. 

నామినేషన్స్ లో ఉన్నవారి ముందు మూడు బాక్సులను ఉంచారు. అందులో ఒక స్క్రోల్ ఉంటుంది. అందులో సేఫ్, అన్ సేఫ్ అని రాసి ఉంటుంది. ఇందులో జెస్సీ, సరయులకు అన్ సేఫ్ రాగా.. కాజల్ కి సేఫ్ వచ్చింది.

సరయు అవుట్.. 

అనంతరం జెస్సీ-సరయులను రెండు సైకిల్స్ మీద చేయేసి పెట్టమని చెప్పారు నాగ్. ఎవరి లైట్ వెలుగుతుందో వాళ్లు సేఫ్. ఎవరి లైట్ వెలగదో వాళ్లు అన్ సేఫ్. జెస్సీ సైకిల్ లైట్ వెలిగడంతో అతడు సేవ్ అయ్యాడు. ఈ వారం హౌస్ నుండి సరయు ఎలిమినేట్ అయింది. దీంతో విశ్వ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. 

హౌస్ మేట్స్ కి గుడ్ బై చెప్పేసి స్టేజ్ మీదకు వచ్చిన సరయుని '5 బెస్ట్ హౌస్ మేట్స్', '5 వరస్ట్ హౌస్ మేట్స్' ఎవరో చెప్పమని అడిగారు నాగ్. బెస్ట్ కంటెస్టెంట్స్  గా.. శ్వేతా, మానస్, ప్రియాంక, విశ్వ, హమీదల పేర్లు చెప్పింది. 

వరస్ట్ కంటెస్టెంట్స్ గా సిరి, సన్నీ, లహరి, షణ్ముఖ్, కాజల్ ల పేర్లు చెప్పింది.

సిరి, షణ్ముఖ్ లు ఇక్కడికి రాకముందే.. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలని బయట మాట్లాడుకొని వచ్చారని ఓ రేంజ్ లో వేసుకుంది.  

ఇక లహరిని టార్గెట్ చేస్తూ.. 'నిన్ను నువ్ తోప్ అని ప్రూవ్ చేసుకోవడానికి అవతలి వాళ్లను హర్ట్ చేయాల్సిన అవసరం లేదు.. నీకు అంత ఈగో ఏంటి..?' అని ప్రశ్నించింది. చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది సార్ అంటూ నాగ్ కి కంప్లైంట్ చేసింది. ఆమె టోన్ తో హౌస్ లో వాళ్లకు చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పింది

 

Published at : 12 Sep 2021 10:39 PM (IST) Tags: nagarjuna Bigg Boss 5 Telugu Bigg Boss 5 Sarayu eliminated Sarayu elimination Telugu Bigg Boss

సంబంధిత కథనాలు

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!

Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!

Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

Ashu Reddy : అషు రెడ్డి బికినీ రేటు ఎంతో తెలుసా? - ఆ 'విక్టోరియా సీక్రెట్' కొనొచ్చా?

Ashu Reddy : అషు రెడ్డి బికినీ రేటు ఎంతో తెలుసా? - ఆ 'విక్టోరియా సీక్రెట్' కొనొచ్చా?

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి