Bigg Boss 5 Telugu Promo: షణ్ముఖ్ కి అసిస్టెంట్ గా మారిన లోబో.. సిరిని హెచ్చరించిన బిగ్ బాస్..
బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం నుండి మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరిగింది.
బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం నుండి మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరిగింది. మొత్తం ఆరుగురు హౌస్ మేట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. నిన్నటి షోలో బిగ్ బాస్ పవర్ రూమ్ యాక్సెస్ కి సంబంధించి ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఎవరైతే ఎక్కువ సార్లు పవర్ రూమ్ లోకి వెళ్తారో వాళ్లకి కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో హౌస్ మేట్స్ అంతా పవర్ రూమ్ యాక్సెస్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు.
Also Read : Bigg Boss 5 Telugu : వాళ్లంతా చాలా క్లోజ్.. కానీ నా సపోర్ట్ మాత్రం ఆమెకే.. నాగబాబు కామెంట్స్..
తాజాగా ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో కాజల్ కి నిన్న ఇచ్చిన టాస్క్ ను ఎలా గెలవకుండా చేయాలా..? అని టీమ్ మేట్స్ అంతా ఆలోచిస్తున్నారు. ఇక అర్ధరాత్రి సమయంలో బిగ్ బాస్ షోలో ఉరుములు వినిపించడంతో అందరూ పవర్ రూమ్ దగ్గరకు పరిగెత్తారు. ఈసారి పవర్ స్కాన్ సిరి చేయడంతో ఆమెకి పవర్ రూమ్ యాక్సెస్ దక్కింది. పవర్ రూమ్ లోకి వెళ్లిన సిరికి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
Also Read : Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ‘పులిహోర’.. శ్రీరామ చంద్ర మొదలెట్టేశాడు.. ఆ మాటలకు హమీద ఫిదా!
దాని ప్రకారం షణ్ముఖ్ కి లోబో సేవకుడిగా మారాల్సి వచ్చింది. షణ్ముఖ్ కి సంబంధించిన పనులన్నీ కూడా లోబో చేయాల్సి ఉంటుంది. దీంతో అతడు షణ్ముఖ్ కి మసాజ్ లు చేస్తూ కనిపించారు. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే.. అది లోబోనే. ఈ సర్వెంట్ టాస్క్ లో కూడా ఆయన ఎంతో ఫన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. మధ్యలో సిరిని బిగ్ బాస్ హెచ్చరించినట్లుగా ఉన్నారు. ఇక ప్రోమో చివర్లో హమీదాతో లహరి గొడవ పడుతున్నట్లు కనిపించింది. హమీద మాట తీరు లహరికి నచ్చకపోవడంతో ఆమె మండిపడింది. దీంతో హమీద కన్నీళ్లు పెట్టుకుంది.
Also Read : porn case: నటికి షాకిచ్చిన బాంబే హైకోర్టు... ముందస్తు బెయిలుకు నో
Also Read : Ranveer Singh RC15 movie launch: రెండు పిలకలతో రణ్‌వీర్ సింగ్.. రామ్ చరణ్ RC15 ప్రారంభోత్సవంలో సందడి
Also Read : Pawan Kalyan : పవన్ షాకింగ్ డెసిషన్.. మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా..?