Bigg Boss 5 Telugu: ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పదా..?
ట్రాన్స్ జెండర్ కేటగిరీలో హౌస్ లోకి వచ్చిన ప్రియాంక మొదట్లో గేమ్ బాగానే ఆడేది. ఎప్పుడైతే మానస్ కి క్లోజ్ అయిందో అప్పటినుంచి గేమ్ పక్కన పెట్టేసి మానస్ చుట్టూనే తిరుగుతుంది.
బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైతే.. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. వారిలో షణ్ముఖ్, సన్నీ తప్ప.. మిగిలినవారంతా కూడా నామినేషన్ లో ఉన్నారు. శ్రీరామ్, కాజల్, సిరి, ప్రియాంక, మానస్ లలో ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్లబోతున్నారనే విషయంలో ఓ కంటెస్టెంట్ పేరు బాగా వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు.. ప్రియాంక.
ట్రాన్స్ జెండర్ కేటగిరీలో హౌస్ లోకి వచ్చిన ప్రియాంక మొదట్లో గేమ్ బాగానే ఆడేది. ఎప్పుడైతే మానస్ కి క్లోజ్ అయిందో అప్పటినుంచి గేమ్ పక్కన పెట్టేసి మానస్ చుట్టూనే తిరుగుతుంది. మధ్యలో చాలా సార్లు తన ప్రవర్తనతో మానస్ తో పాటు ఆడియన్స్ ను కూడా విసిగించింది. కానీ ఆమె ఎక్కువ సార్లు నామినేట్ అవ్వకపోవడంతో సేఫ్ అయిపోయేది. గత వారం నామినేషన్ లో ఆమె సేఫ్ అయినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. రవి లాంటి కంటెస్టెంట్ కంటే ప్రియాంకకి ఎక్కువ ఓట్లు పడ్డాయంటే నమ్మశక్యంగా లేదంటూ రవి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెట్టారు.
అయితే ఈ వారం మాత్రం ఆమె హౌస్ వీడక తప్పదని అంటున్నారు. నిజానికి ఈ వారంలో ప్రియాంక ఎమోషనల్ బిహేవియర్, మానస్, కాజల్ లతో ఆమె గొడవ ఆడియన్స్ ను బాగా విసిగించింది. ఆమె కారణంగా మానస్ ఇబ్బంది పడుతున్నాడనే విషయంలో చాలా క్లియర్ గా తెలుస్తోంది. అయితే ప్రియాంక మాత్రం అతడిని విడిచిపెట్టకుండా సాధించింది. అదే సమయంలో కాజల్ తో కూడా గొడవ పడింది. కోపంలో చాలా మాటలు అనేసింది. కానీ కాజల్ పట్టించుకోకుండా వదిలేసింది.
గేమ్ లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతోనే గేమ్ ఆడుతూ.. నిజంగానే ఓడిపోతుంది ప్రియాంక. బిగ్ బాస్ ఇచ్చిన టికెట్ టు ఫినాలే ఛాన్స్ ను కూడా ఆమె వినియోగించుకోలేకపోయింది. రెండు ఛాలెంజ్ లు అయ్యేసరికి ఆమె గేమ్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ వారం హౌస్ నుంచి కూడా ఎలిమినేట్ అవుతుందని టాక్. మరేం జరుగుతుందో చూడాలి!
Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
Also Read: సెట్స్‌కు వచ్చిన మెగాస్టార్... నెర్వస్‌లో డైరెక్టర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి