Bigg Boss 5 Telugu: 'ఏంటి మామా ఇది.. ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాం..' ఏడ్చేసిన సన్నీ, మానస్..
టాస్క్ లో విజేతలుగా నిలిచిన రవి టీమ్ నుంచి యానీ మాస్టర్, ప్రియా, శ్వేతా, రవి కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఈ నలుగురికీ 'పదివేలు సరిపోవు సోదరా' అనే టాస్క్ ఇచ్చారు.
బిగ్ బాస్ సీజన్ 5 ఐదో వారంలో వాతావరణం వేడెక్కింది. రెండు రోజుల పాటు హౌస్ లో 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే టాస్క్ నడిచింది. ఇప్పుడు ఆ టాస్క్ లో విజేతలుగా నిలిచిన రవి టీమ్ నుంచి యానీ మాస్టర్, ప్రియా, శ్వేతా, రవి కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఈ నలుగురికీ 'పదివేలు సరిపోవు సోదరా' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో నలుగురు సభ్యులకు నాలుగు రంథ్రాలు ఉండే నీటి ట్యాంక్లను ఇచ్చారు. వారికి సపోర్ట్ చేసే సభ్యులు ఆ ట్యాంక్ రంథ్రాలు మూసి నీళ్లు బయటకు పోకుండా సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్క్‌కు షణ్ముఖ్‌ను సంచాలకుడిగా వ్యవహరించాలని పేర్కొన్నాడు.
Also read: సోనూసూద్ కు మరో గుడి... ఈసారి ఏ గ్రామంలో కట్టారంటే?
టాస్క్ లో ఎవరు గెలిచారో ఈరోజు ఎపిసోడ్ లో చూపించనున్నారు. ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పాలని హౌస్ మేట్స్ కి సూచించాడు బిగ్ బాస్. ఈ క్రమంలో హౌస్ మేట్స్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. జెస్సీ అయితే శ్రీరామ్ మీద అరిచేశాడు. అలానే రవి-కాజల్ ల మధ్య కూడా పెద్ద గొడవే జరిగినట్లుంది.
ఇప్పుడు మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సన్నీ, మానస్ ఏడుస్తూ కనిపించారు. ''నేను వాళ్లను పనిష్ చేయాలనుకోలేదు.. వదిలేద్దాం అనుకున్నా అంతే..'' అంటూ లోబో, విశ్వలతో చెప్పుకొని బాధ పడ్డాడు సన్నీ. అక్కడే ఉన్న మానస్ ఏడుస్తుంటే లోబో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత సన్నీ.. 'ఏంటి మామా ఇది.. ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాం..' అంటూ ఏడ్చేశాడు.
Emotional aipoina #Sunny & #Maanas .. Anthalaga em jarigindi?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/tkbMSj0ReM
— starmaa (@StarMaa) October 8, 2021
Also Read: నాకు ఎఫైర్స్ ఉన్నాయని.. అబార్షన్స్ అయ్యాయని అంటున్నారు.. విడాకుల తరువాత సమంత ఫస్ట్ ట్వీట్..
Also Read: మహిళల్ని క్వశ్చన్ చేసినట్టు మగవారిని ఎందుకు ప్రశ్నించరు..సమంత పోస్ట్ వైరల్
Also Read: అతడి వల్లే 'మా'లో ఇన్ని గొడవలు.. శివాజీరాజా ఆరోపణలు..
Also Read: కొండ పొలం సమీక్ష: మట్టివాసన చూపించే సినిమా.. వైష్ణవ్ మళ్లీ కొట్టాడా?
Also Read: అతడు ఒక్క రోజు కూడా షూటింగ్‌కు సమయానికి రాలేదు.. ‘మా’ ఎన్నికలపై కోటా వ్యాఖ్యలు
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి