అన్వేషించండి
Advertisement
Big Boss 5 Telugu : నామినేషన్స్ లో ఆరుగురు.. వాళ్లెవరంటే..?
బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం నాడు మొదలైన సంగతి తెలిసిందే. రెండో రోజు ఉదయాన్నే 'ప్రణామం.. ప్రణామం' సాంగ్ కి స్టెప్పులు వేసి రచ్చ చేశారు కంటెస్టెంట్స్.
బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం నాడు మొదలైన సంగతి తెలిసిందే. రెండో రోజు ఉదయాన్నే 'ప్రణామం.. ప్రణామం' సాంగ్ కి స్టెప్పులు వేసి రచ్చ చేశారు కంటెస్టెంట్స్. ఆ తరువాత శ్వేతా, హమిద, జెస్సీలు కూర్చుని ముచ్చట్లు పెట్టారు. హౌస్ లోకి ఎంటర్ అయిన మరుసటి రోజే నామినేషన్స్ రచ్చ మొదలెట్టేశారు బిగ్ బాస్. హౌస్ లో ఉన్న 19 మంది ఫొటోలతో చెత్త కవర్లను పెట్టి.. నామినేషన్ చేయాలనుకునే వాళ్ల ఫోటో ఉన్న కవర్ ని తీసుకొని వెళ్లి చెత్త తొట్టెలో వేయాలని నామినేషన్ ప్రక్రియను షురూ చేశారు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్ లు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ తిట్టుకోవడం మొదలుపెట్టేశారు.
ముందుగా శ్రీరామచంద్ర.. మానస్, జెస్సీలను నామినేట్ చేయగా.. సరయు వచ్చి ఆర్జే కాజల్, యాంకర్ రవిలను నామినేట్ చేసింది. షణ్ముఖ్.. వీజే సన్నీను నామినేట్ చేస్తూ.. 'ఎవరైనా తనకు గేమ్ ఆడమని చెబితే నచ్చదని' రీజన్ చెప్పాడు. ఆ తరువాత సన్నీ.. షణ్ముక్‌ని నామినేట్ చేస్తూ.. 'మనం ఏం చేసినా సైన్యం ఉందని అనుకుంటాం కానీ.. ఇక్కడకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికీ ఓ సైన్యం ఉంటుంది' అని అన్నాడు. 'ఏమో నాకైతే ఆ ఫీలింగ్ లేదు' అని షణ్ముక్ అనగా.. చెత్త తొట్టెలో షణ్ముఖ్ ఫోటో ఉన్న కవర్ ను విసిరికొట్టాడు సన్నీ.
యాంకర్ రవి.. నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేస్తూ.. బయట అతనితో మంచి రిలేషన్ ఉందని.. కానీ హౌస్ లో ఆయన అలా ఉండడం లేదని.. వేరే వ్యక్తిలా అనిపిస్తున్నారని కామెంట్ చేశాడు. దీనికి కౌంటర్ ఇస్తూ నటరాజ్ మాస్టర్.. రవిని నామినేట్ చేశాడు. తనకు నటించడం రాదని.. ఏడు నెలల గర్భిణి అయిన తన భార్యకి దూరంగా ఉంటూ కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని ఎమోషనల్ గా మాట్లాడారు. జెస్సీ-విశ్వల మధ్య నామినేషన్స్ కి సంబంధించి డిస్కషన్ హీటెక్కింది. అందరూ తననే నామినేట్ చేస్తుండడంతో ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు జెస్సీ.
హమీద, లహరిలు కూడా ఒకరిపై మరొకరు ఫైర్ అయ్యారు. లహరి తనతో సరిగ్గా మాట్లాడడం లేదని.. రూడ్ గా బిహేవ్ చేస్తుందని నామినేట్ చేసింది హమీద. దీంతో లహరి తన టర్న్ వచ్చినప్పుడు హమీదను నామినేట్ చేస్తూ గట్టిగానే ఫైర్ అయింది. ఇలా నామినేషన్స్ లో ఒకరినొకరు దూషించుకున్నారు. మొత్తానికి ఈ వారం నామినేషన్ లో యాంకర్ రవి, మానస్, సరయు, ఆర్జే కాజల్, హమీద, జెస్సీ ఉన్నారు. మరి వీరిలో ఎవరు హౌస్ నుండి బయటకు వెళ్లిపోతారో చూడాలి!
Alos Read : Bigg Boss Telugu 5 Promo : హౌస్ మేట్స్ కి నిద్ర లేకుండా చేసిన లోబో.. అప్పుడే దొంగతనం మొదలెట్టిన సిరి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion