Bigg Boss 5 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఆ హౌస్ మేట్ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
బిగ్ బాస్ సీజన్ 5 పదకొండు వారాలను కంప్లీట్ చేసుకోబోతుంది. ఇప్పటివరకు పది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం మరో హౌస్ మేట్ ఎలిమినేట్ కానున్నారు. ఆ హౌస్ మేట్ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. అందరూ అనుకుంటున్నట్లుగా.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేది కాజల్ కాదు.. యానీ మాస్టర్. మొదటి నుంచి కూడా యానీ తన గేమ్ ని బాగానే ఆడుతుంది.
Also Read:గ్యాప్ ఉంటే వచ్చేస్తాం.. 'బంగార్రాజు' విడుదలపై సుప్రియ కామెంట్స్..
అది కాకుండా.. సన్నీ, కాజల్ లతో గొడవలు పడుతూ వార్తల్లో నిలిచింది. గ్రూప్ గా ఆడడం లేదని చెబుతూనే.. రవి-శ్రీరామ్ లతో కలిసి గేమ్ ఆడింది. వారి కారణంగానే ఒక వారం కెప్టెన్ గా కూడా నిలిచింది. యానీ మాస్టర్ కి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంటుంది. కోపంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తారు. ఆమెని ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఆమె కారణంగా హౌస్ లో కాజల్ చాలా ఇబ్బంది పడింది.
ఎప్పటికప్పడు కాజల్ ని టార్గెట్ చేస్తూ.. ఆమె అనరాని మాటలు చాలానే అన్నారు. తనను వెక్కిరించొద్దని కాజల్ వంద సార్లు చెప్పినా.. యానీ మాత్రం తన పద్దతిని మానుకోలేదు. కాజల్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే అది ర్యాగింగ్. ఆమె బిహేవియర్ తో ఆడియన్స్ కూడా విసిగిపోయారు. దీంతో ఆమెకి ఓటింగ్ బాగా తగ్గిపోయింది. ఆమె ఎప్పుడెప్పుడు నామినేషన్ లోకి వస్తుందా..? అని చూసిన ప్రేక్షకులకు ఈ వారం ఛాన్స్ రావడంతో ఎలిమినేట్ చేయడానికి రెడీ అయిపోయారు. ఈ వారం యానీ మాస్టర్ హౌస్ ను వీడకతప్పదు.
Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..
Also Read: 'దీప్తిని మిస్ అవుతుంటే.. వెళ్లిపో..' షణ్ముఖ్ కి షాకిచ్చిన నాగ్..
Also Read: హౌస్ మేట్స్ కి షాక్ ఇవ్వనున్న బిగ్ బాస్.. డబుల్ ఎలిమినేషన్ తప్పదా..?
Also Read: హాస్పిటల్ లో సీనియర్ నటుడు.. పరిస్థితి విషమం..
Also Read: సల్మాన్‌తో రాజమౌళి మీటింగ్... సినిమా చేస్తున్నారా? 'ఆర్ఆర్ఆర్'కి ఇన్వైట్ చేశారా?
Also Read: బాలీవుడ్‌కు నాగచైతన్య పరిచయమయ్యేది ఆ రోజే... లాల్ సింగ్ చద్దా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి