Bigg Boss 6 Telugu: ‘కుక్క తోక వంకర’ అని ట్యాగ్ ఇచ్చినా అర్జున్ ఇక మారడా? మళ్లీ శ్రీ సత్య గోలే, గీతూకి తండ్రితో మాట్లాడే అవకాశం
Bigg Boss 6 Telugu: అర్జున్ కళ్యాణ్ అనే వ్యక్తి తాను బిగ్‌బాస్ హౌస్ కి ఎందుకొచ్చాడో అన్న విషయం కూడా మర్చిపోయినట్టున్నాడు.
![Bigg Boss 6 Telugu: ‘కుక్క తోక వంకర’ అని ట్యాగ్ ఇచ్చినా అర్జున్ ఇక మారడా? మళ్లీ శ్రీ సత్య గోలే, గీతూకి తండ్రితో మాట్లాడే అవకాశం Arjun gets a chance to talk to his father, Bigg Boss 6 Promo Bigg Boss 6 Telugu: ‘కుక్క తోక వంకర’ అని ట్యాగ్ ఇచ్చినా అర్జున్ ఇక మారడా? మళ్లీ శ్రీ సత్య గోలే, గీతూకి తండ్రితో మాట్లాడే అవకాశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/12/06e25e2b5abc47c8103ee81a0c147bec1665558878977248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss 6 Telugu: అర్జున్ కళ్యాన్ బిగ్‌బాస్ హౌస్‌కి ఆడేందుకు రాలేదని, శ్రీ సత్య చుట్టూ తిరిగేందుకే వచ్చాడని మరోసారి నిరూపించాడు. నెలన్నరగా కుటుంబానికి దూరమైన ఇంటి సభ్యులకు వారితో మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు బిగ్బాస్. ఆ అవకాశాన్ని కూడా శ్రీ సత్య కోసం వదిలేయడానికి సిద్ధపడ్డాడు అర్జున్. ఇది చూస్తే ‘తన తల్లిదండ్రుల కన్నా శ్రీసత్యా ఎక్కువైపోయిందా అర్జున్‌కు?’ అనే భావన ప్రేక్షకుల్లో రాకమానదు. తన తండ్రితో మాట్లాడాలని, వారెలా ఉన్నారో అన్న ఆలోచన లేకుండా తనకు వచ్చిన అవకాశాన్ని శ్రీసత్యకు ట్రాన్స్‌ఫర్ చేయచ్చా అని అడిగాడు ఈ మహానుభావుడు. ఇక శ్రీసత్య టిష్యూ పేపర్లా ఇతడిని అవసరమైనప్పుడు వాడి, తరువాత డస్ట్ బిన్లో పడేస్తోంది. కొత్తగా విడుదలైన ప్రోమోలో ఏముందంటే...
నిన్నటి ఎపిసోడ్లో సుదీప, శ్రీహాన్, ఆదిరెడ్డి తమకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించడంతో బ్యాటరీ ఛార్జింగ్ పూర్తిగా అయిపోయింది. దీంతో తిరిగి బ్యాటరీ నింపే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. బ్యాటరీ రీఛార్జ్ అవ్వాలంటే ఇంటి సభ్యులెవరూ ఏమీ తినకూడదని లేదా బాలాదిత్య సిగరెట్లు మొత్తం త్యాగం చేయాలని చెప్పాడు. చివరికి బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అతడు సిగరెట్లు కాల్చకుండా చూసే బాధ్యతని రేవంత్‌కు అప్పజెప్పాడు బిగ్‌బాస్. బాలాదిత్య మధ్యలో కోపంగా గీతూ వద్దకు వెళ్లి ‘ఇదే పని నువ్వు స్ట్రెయిట్ గా నా దగ్గరకు వచ్చి చెప్పి ఉంటే బాగుండేది’ అన్నాడు. అలా ఎందుకు అన్నాడో ఎపిసోడ్లో చూడాలి.
కాగా బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయడం వల్ల బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయింది. ఈసారి అర్జున్‌కు అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే ఇక్కడ కూడా అతను శ్రీ సత్య గురించే ఆలోచించాడు. ‘శ్రీ సత్యకు వాళ్ల అమ్మతో మాట్లాడాలని ఉంది, నాకొచ్చిన అవకాశాన్ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చా’ అని అడిగాడు. దానికి బిగ్ బాస్ ఒప్పుకోలేదని అర్థమవుతోంది. దీంతో వీడియో కాల్ ఎంచుకున్నాడు అర్జున్. అతని తండ్రి వీడియోలో కొడుకుతో మాట్లాడారు.
గీతూకి అవకాశం...
ఇక గీతూకి కూడా అవకాశం ఇచ్చాడు బిగ్బాస్. అందరికీ వీడియో కాల్, ఆడియో మెసేజ్, ఫుడ్ అనే ఆప్షన్లు ఇస్తే గీతూకి మాత్రం వీడియో కాల్, ఆడియో కాల్, పిల్లి బొచ్చు అనే ఆప్షన్లు వచ్చాయి. చివరికి ఆమె ఆడియో కాల్ ఎంచుకుని తండ్రితో మాట్లాడింది. మాట్లాడడం పూర్తయ్యాక యథావిధిగా ఓవర్ యాక్షన్ చేసింది. ‘సరే డాడీ, అందరినీ కొట్టి కొట్టి పెడతా, బిగ్‌బాస్‌ను కూడా గుద్దిపడేస్తా’ అంటూ గట్టిగట్టిగా మాట్లాడింది. తరువాత పుష్ఫ స్టైల్లో భుజం పైకెత్తి నడవడం మొదలుపెట్టింది. అది చూసి ఆదిరెడ్డి ‘ఫోన్ కట్టయ్యాక షో చేసిందిలే’ అని గాలి తీసేశాడు.
Also read: భార్యను, కూతురిని చూసి ఆదిరెడ్డి ఫుల్ రీఛార్జ్, సుదీపకు భర్త ఫోన్ కాల్, శ్రీహాన్‌కు మటన్ బిర్యానీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)