News
News
X

Bigg Boss 6 Telugu Episode38: భార్యను, కూతురిని చూసి ఆదిరెడ్డి ఫుల్ రీఛార్జ్, సుదీపకు భర్త ఫోన్ కాల్, శ్రీహాన్‌కు మటన్ బిర్యానీ

Bigg Boss 6 Telugu: ఈ ఎపిసోడ్ మొత్తం ఇంటిసభ్యులను ఎమోషనల్‌గా మార్చేసింది.

FOLLOW US: 
Share:

Bigg Boss 6 Telugu: ఈ రోజు ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా మారింది. ‘బ్యాటరీ రీఛార్జ్’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో ఇంటి సభ్యులకు తమ కుటుంబసభ్యుల నుంచి సర్ ప్రైజ్ గిఫ్టులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇక ఎపిసోడ్ లో ఏముందంటే...

నామినేషన్లు అయ్యేసరికి ఉదయం మూడున్నర అయింది. ఆ తరువాత అందరూ నామినేషన్ల గురించే మాట్లాడుకుంటూ కనిపించారు. కీర్తి , ఫైమా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీసత్య తన గురించి అలా అనడం నచ్చలేదని, తాను ఇనయా గురించి చాలా పెద్ద మాట అందని, ఆ విషయం చెబితే ఇనయా శ్రీసత్యను చెప్పుతో కొడుతుందని అంది. రాజశేఖర్ కూడా గీతూ గురించి ఇనయా, సూర్య దగ్గర కూర్చుని బాధపడ్డాడు. అందరూ నిద్రపోయారు. ఉదయం ‘తార్ మార్ తక్కర్ మార్’ పాటతో నిద్రలేపాడు బిగ్‌బాస్. ఫ్లాప్ డ్రెస్సులు వెనక్కి తీసుకుని వారి వారి సూట్ కేసులు వెనక్కి ఇచ్చేశారు. 

బ్యాటరీ రీచార్జ్ టాస్కు
దాదాపు నెలన్నరగా కుటుంబానికి దూరంగా ఉంటున్న ఇంటి సభ్యులకు కొన్ని సర్‌ప్రైజ్ గిఫ్టులు ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఇందులో భాగంగా గార్డెన్లో వందశాతం బ్యాటరీ నమూనాను ఉంచారు. సర్‌ప్రైజ్ గిఫ్టులను ఇంటిసభ్యులు తీసుకుంటే ఆ బ్యాటరీలో కొంత శాతం తగ్గుతుంది. అలాగే ఇంటి నియమాలను ఉల్లంఘించినా కూడా బ్యాటరీ రీఛార్జ్ తగ్గిపోతుంది అని చెప్పాడు బిగ్ బాస్. మొదట శ్రీహాన్‌ను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్.‘మీ నాన్న గారితో వీడియోకాల్ మాట్లాడటానికి 35 శాతం బ్యాటరీ ఉపయోగించాలి, సిరి నుంచి ఆడియో మెసేజ్ పొందాలంటే 30 శాతం బ్యాటరీ, ఇంటి నుంచి మటన్ బిర్యానీ తెప్పించుకోవాలంటే 15 శాతం బ్యాటరీ వాడాలి’ అని చెప్పాడు బిగ్ బాస్. శ్రీహాన్ తాను ఏదీ వాడకూడదని అనుకుంటున్నట్టు చెప్పాడు. దానికి బిగ్‌బాస్ ‘టాస్క్‌లో పాల్గొనకూడదని అనుకుంటే బయటికి వెళ్లచ్చు, తరువాతి పర్యవసానాలు ఇల్లు మొత్తం ఎదుర్కోవలసి వస్తుంది’ అని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్ ఫుడ్ ఎంచుకున్నాడు. కేవలం 15 శాతం మాత్రమే వాడాడు. దీంతో బయట ఉన్న బ్యాటరీ వంద నుంచి 85 శాతానికి పడిపోయింది. 

తరువాత సుదీపను పిలిచాడు బిగ్‌బాస్. భర్త ఆడియో కాల్ మాట్లాడేందుకు 30 శాతం, టీ షర్టు కోసం 40 శాతం, అమ్మ చేసిన చికెన్ బిర్యానీ కోసం 35 శాతం బ్యాటరీని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పాడు. దీంతో సుదీప బాగా ఏడ్చింది. తరువాత ఆడియో కాల్ ఆప్షన్ ఎంచుకుంది. భర్తతో ఫోన్ మాట్లాడింది. శ్రీహాన్‌కు ఇంటి నుంచి మటన్ బిర్యానీ, మటన్ కర్రీ వచ్చింది. వాటిని అందరికీ పంచాడు. 

భార్య కూతురితో వీడియో కాల్...
ఆదిరెడ్డి 40 శాతం బ్యాటరీని వాడుకున్నాడు. భార్యాకూతురితో వీడియో కాల్ మాట్లాడాడు. వీడియో కాల్‌లో భార్య కవిత, కూతురి హద్వితను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. కవిత భర్తతో మాట్లాడుతూ ‘ఒకప్పుడు బిగ్ బాస్‌కి వెళ్లొద్దని చెప్పాను. కానీ ఇప్పుడు చెబుతున్నా నువ్వు వెళ్లినందుకు చాలా గర్వపడుతున్నా.  నీ వైపు తప్పులేనప్పుడు అవతల వ్యక్తి ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేయి. నాగార్జున్ సర్ చెప్పినట్టు కామన్ మ్యాన్ రివ్యూవర్ అయ్యాడు, రివ్యూవర్ కంటెస్టెంట్ అయ్యాడు... కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యాడు, కెప్టెన్ బిగ్‌బాస్ విన్నర్ అయ్యాడు. విన్నర్ అయ్యి రావాలి, ఈ మూడు నెలలు మేము ఎందుకు మిస్సయ్యాం అనే దానికి నువ్వు విన్నర్ అయి రావడమే సమాధానం’ అని చెప్పింది కవిత. ఆదిరెడ్డి కూతురిని, కవితను చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. 

Also read: ముందు ఏడిపించేసిన బిగ్‌బాస్, తరువాత మాత్రం ఇంటి సభ్యులకు అంతులేని ఆనందం

Also read: కలిసి ఆడుతున్నారంటూ భార్యాభర్తలపై కంట్రోల్ తప్పి అరిచిన ఆదిరెడ్డి, కొట్టుకునే దాకా వెళ్లిన ఆ ఇద్దరూ

Published at : 12 Oct 2022 05:58 AM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Written Updates Adireddy video call Adireddy wife and Daughter Bigg Boss Telugu Episode High lights

సంబంధిత కథనాలు

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

టాప్ స్టోరీస్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?