News
News
X

Bigg Boss 6 Telugu Episode 37: కలిసి ఆడుతున్నారంటూ భార్యాభర్తలపై కంట్రోల్ తప్పి అరిచిన ఆదిరెడ్డి, కొట్టుకునే దాకా వెళ్లిన ఆ ఇద్దరూ

Bigg Boss 6 Telugu: ఈ సీజన్లో ఇలాంటి సీన్ జరగడం ఇదే తొలిసారి. ఇద్దరూ కొట్టుకునే దాకా వెళ్లారు.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: ఈ ఎపిసోడ్లో ఆదివారం జరిగిన గేమ్ గురించే అందరూ మాట్లాడుతూ కనిపించారు. సామెతలు ఇచ్చుకునే గేమ్ పై కొంతమంది వివరణలు ఇచ్చుకున్నారు. ముఖ్యంగా రేవంత్ ఇదే విషయంపై మాట్లాడుతూ కనిపించాడు. ఇక గీతూతో ఆదిరెడ్డి రేవంత్‌కు వాసంతి అంటే ఇంట్రెస్ట్ అనే విషయంపై మాట్లాడాడు. పెళ్లయింది కదా అన్నాడు. దానికి గీతూ పెళ్లియితే ఇంట్రెస్ట్ ఉండకూడదా అంటూ మాట్లాడింది. అర్జున్ వచ్చి తనకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టే కనిపిస్తోందని చెప్పాడు. ఇక నామినేషన్లు మొదలయ్యాక అసలు వేడి మొదలైంది. 

ముఖానికి ఫోమ్ పూసి ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. మొదటగా రేవంత్ బాలాదిత్య, సుదీప ముఖానికి ఫోమ్ రాశాడు. బాలాదిత్య తను ఫ్లాప్ ఇవ్వడం నచ్చలేదని చెప్పాడు బాల. సుదీప తనకు ‘అందితే జుట్టు అందకపోతే కాళ్లు’ అనే ట్యాగ్ ఇవ్వడం నచ్చలేదని నామినేట్ చేశాడు. వీరిద్దరూ కాసేపు వాదించుకున్నారు.  కీర్తి గీతూని, శ్రీసత్యను నామినేట్ చేసింది. చంటి విషయంలో గతంలో గీతూ చెప్పిన మాట విని తప్పు చేశానని అంది కీర్తి. ఆదిరెడ్డి మెరీనాను నామినేట్ చేశాడు. ‘ఎవరైనా గేమ్ ఆడుతూ ఉండాలి కానీ, మంచితనంలో ఉండకూడదు’ అని చెప్పాడు. ఆదిరెడ్డి మాట్లాడే తీరు చాలా హైపర్ గా ఉంది. ఈ విషయాన్ని కూల్‌గా కూడా చెప్పొచ్చు. కీర్తిని కూడా నామినేట్ చేశాడు ఆదిరెడ్డి. ఆదిరెడ్డి కీర్తిపై కూడా అలాగే అరిచాడు. 

ఫైమా బాలదిత్యను, సుదీపను నామినేట్ చేసింది. తనకు ఫ్లాప్ అని ఇచ్చినందుకు సుదీపతో వాదించింది. అలాగే బాలాదిత్యతోనూ ఆర్య్గూ చేసింది. ఇక ఆదిరెడ్డిని వాసంతి,సూర్య నామినేట్ చేశారు. ఎంటర్ టైనింగ్‌గా ఆయన ఆటలేదని చెప్పారు. దానికి ఆదిరెడ్డి చాలా ఇరిటేట్ అయిపోయారు. ‘నాతో డ్యాన్సు చేస్తావా’ అంటూ ఆదిరెడ్డి వాసంతిని అడిగాడు. ఇక్కడ్నించి వెళ్తూ వెళ్తూ మంచి డ్యాన్సర్ అనిపించుకుని వెళ్తా అంటూ శపథం చేశాడు. ఇనయా శ్రీహాన్‌ను, కీర్తిని నామినేట్ చేసింది. శ్రీహాన్‌తో అకారణంగా వాదించినట్టు కనిపించింది. చంటి సెల్ఫ్ నామినేట్ చేసుకుని వెళ్లడానికి కీర్తి కారణమని చెప్పింది ఇనయా. 

ఆదిరెడ్డిని నామినేట్ చేయకూడదా?
మెరీనా కీర్తిని నామినేట్ చేసింది. తరువాత ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. తనను నామినేట్ చేయగానే ‘బై 1 గెట్ 2 ఆఫర్లో వచ్చేశారు. ఒకరిని నామినేట్ చేస్తే ఇద్దరు వచ్చేస్తారు’ అన్నాడు. దానికి మెరినా అదేం లేదండి అన్నాడు. ‘మీ కెప్టెన్సీలో ఎలా చేశారు? సుదీప నేను కిచెన్లో ఎంత ఇబ్బంది పడ్డామో తెలిసిందా?’ అని అడిగింది. మెరీనా కూల్ గా మాట్లాడుతున్నా ఆదిరెడ్డి మాత్రం రెచ్చిపోయాడు. మీ ఇద్దరిదే తప్పు అన్నాడు ఆదిరెడ్డి. ఈలోపు రోహిత్ మాట్లాడుతూ ‘నేను అక్కడే ఉన్నాను, నేనూ మాట్లడొచ్చా’ అని అడిగాడు. దానికి ఆదిరెడ్డి మాట్లాడండి అన్నాడు. ఆదిరెడ్డి తన స్థానం నుంచి రోహిత్ ఉన్న చోటుకి వచ్చి మరీ అరిచాడు. ఆయన ప్రవర్తన చాలా చికాకు పెట్టేలా ఉంది. రోహిత్ కూడా ఏమాత్రం తగ్గకుండా పెద్ద కళ్లు పెట్టి సీరియస్ అయ్యాడు. వీరిద్దరూ కొట్టుకుంటారా అనే దాకా అరుచుకున్నారు. వాసంతి, రేవంత్ వచ్చి వెనక్కి తీసుకెళ్లారు. 

News Reels

ఈ వారం నామినేషన్లలో తొమ్మిది మంది నిలిచారు. 
1. ఆదిత్య
2. గీతూ
3. రాజ్ 
4. కీర్తి
5. సుదీప
6. ఆదిరెడ్డి
7. ఇనయా
8. శ్రీహాన్
9. అర్జున్
 Also read: రోహిత్ ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్, ఆదిరెడ్డిపై ఓ రేంజ్‌లో అరిచిన రోహిత్, అదే స్థాయిలో రెచ్చిపోయిన ఆదిరెడ్డి

Also read: ఊహించిందే జరిగింది, చలాకీ చంటి ఎలిమినేషన్, ఇనయాకు దగ్గరవుతున్న సూర్య

Published at : 11 Oct 2022 06:26 AM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Bigg boss daily Updates Bigg boss written Updates Rohith and Adireddy

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

Bigg Boss 6 Telugu: కంటతడి పెట్టించిన రేవంత్ - భార్యతో మాట్లాడుతుండగా షాకిచ్చిన ‘బిగ్ బాస్’

Bigg Boss 6 Telugu: కంటతడి పెట్టించిన రేవంత్ - భార్యతో మాట్లాడుతుండగా షాకిచ్చిన ‘బిగ్ బాస్’

Geetha Madhuri: ‘బిగ్ బాస్’ విన్నర్ అతనే, నందు-రష్మీల మీమ్స్ చూసి భలే ఎంజాయ్ చేశా: గీతా మాధురి

Geetha Madhuri: ‘బిగ్ బాస్’ విన్నర్ అతనే, నందు-రష్మీల మీమ్స్ చూసి భలే ఎంజాయ్ చేశా: గీతా మాధురి

Bigg Boss 6 Telugu: కొడుకుతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి - అందరి దృష్టి ఇనయా, సత్యా పైనే!

Bigg Boss 6 Telugu: కొడుకుతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి - అందరి దృష్టి ఇనయా, సత్యా పైనే!

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!