Bigg Boss 6 Telugu: రోహిత్ ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్, ఆదిరెడ్డిపై ఓ రేంజ్‌లో అరిచిన రోహిత్, అదే స్థాయిలో రెచ్చిపోయిన ఆదిరెడ్డి
Bigg Boss 6 Telugu: ఈ రోజు విడుదలైన మొదటి ప్రోమో చాలా కూల్ గా ఉంది. కానీ రెండో ప్రోమో మాత్రం ఫైర్‌లా ఉంది.
Bigg Boss 6 Telugu: నామినేషన్స్ డే ఎపిసోడ్ కోసమే కాదు, ప్రోమో కోసం కూడా వెయిట్ చేసే వాళ్లు ఎంతో మంది. అలాంటివాళ్లకి ఈ రోజు విడుదలైన ప్రోమో చాలా చప్పగా అనిపించింది. కానీ రెండో ప్రోమో మాత్రం మామూలుగా లేదు. హౌస్‌లో మిస్టర్ కూల్ అనుకున్న రోహిత్ ఈ రోజు తనలోని ఫైర్ చూపించారు. ఆదిరెడ్డి కూడా తగ్గకుండా ఆయన మీదకు అరిచి రెచ్చగొడుతూనే ఉన్నాడు. ప్రోమోలో ఏముందంటే...
నామినేషన్స్ డే సందర్భంగా ఫోమ్ (నురగ)ను ముఖానికి రాసి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. ఇందులో సూర్య గీతూ ముఖానికి నురగ రాసి నామినేట్ చేశారు. ‘ఎవరైనా ఆడుతున్నప్పుడు Lag అంటావు’ అని సూర్య అనగానే గీతూ ‘నేను ఒక మాట అంటే నీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతోందంటే నువ్వు చాలా వీక్ అని అర్థం. నా కామెంట్స్ కే మీరు ఎఫెక్ట్ అయ్యారంటే, బయటి కామెంట్స్ మరీ అవ్వచ్చు, కాబట్టి స్ట్రాంగ్ గా ఉండండి’ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ చెప్పింది. ఇక ఫైమా సుదీపను నామినేట్ చేసింది. నాకు ఫ్లాప్ ఎందుకిచ్చావ్ అని అడిగింది. దానికి సుదీప ‘నా వల్లే నీకు ఫ్లాప్ రాలేదు’ అంది. దానికి ఫైమా ‘గేమ్ ఆడితే తెలుస్తుంది’ అంటూ వాదించింది. ఫైమా వాదనలో కూడా నిజం ఉంది. సుదీపతో పోలిస్తే ఫైమా చాలా ఆటలు ఆడింది.
ఇనయా కీర్తితో కాసేపు వాదించింది. ‘కెప్టెన్ అయితే పెద్ద పవర్సేమీ రావు, ఇది నా ఆర్డర్, దట్స్ ఇట్ అని చెప్పడం ఎంతవరకు కరెక్టు’ అని అంది ఇనయా. దానికి కీర్తి గట్టిగానే రెస్పాండ్ అయింది. ‘నేను ఆర్డర్ చేయడం తప్పు అయి ఉంటే నాకు 80 మార్కులు వచ్చేవి కావు’ అంది కీర్తి. దానికి ఇనయా ‘20 తగ్గింది కదా’ అంది. దానికి కీర్తి ‘80 కంటే ఎక్కువ తెచ్చుకో, అప్పుడు చూసుకో’ అని ఓ స్టైల్లో అంది.
రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి
మెరీనా ఫోమ్‌ను ఆదిరెడ్డి ముఖానికి రాసింది. ఆమె మాట్లాడుతూ ‘మీరు కెప్టెన్‌గా ఎలా చేశారు?’ అంది. దానికి ఆదిరెడ్డి గట్టిగా ‘నేను కెప్టెన్‌గా ఫెయిలైన మాట నిజం, కానీ మీరిద్దరూ వాదించిన విషయంలో మీ ఇద్దరిదే తప్పు కానీ నాది లేదు’ అని మెరీనా-రోహిత్‌లను కలిపి అన్నాడు. దానికి రోహిత్ ‘వాయిస్ మీరే కాదు, మేము కూడా పెంచగలం’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘వాయిస్ రైజ్ చేయు, రైజ్ చేయు’ అంటూ రోహిత్ దగ్గరికి వెళ్లిపోయాడు. ఇక్కడ ఆదిరెడ్డి అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది. ఆదిరెడ్డి మాత్రం నోటికి పనిచెప్పి ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. దానికి రోహిత్ చాలా సీరియస్‌గా ఆదిరెడ్డిని చూశాడు.
రోహిత్ ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడడు. చాలా కూల్‌గా ఉంటాడు. అలాంటి వ్యక్తికి కూడా చాలా కోపం వచ్చింది. ఆదిరెడ్డి ఎప్పుడూ రివ్యూలు చెబుతూనే ఉంటాడు. తనదే కరెక్టు అని వాదించుకుంటూ ఉంటాడు. గీతూతో ఉండి ఉండి ఆమెలానే తయారవుతున్నాడనిపిస్తోంది.
Also read: నామినేషన్స్ డే, ఎందుకోగాని హీట్ తగ్గింది, నామినేషన్లలో తొమ్మిది మంది
Also read: ఊహించిందే జరిగింది, చలాకీ చంటి ఎలిమినేషన్, ఇనయాకు దగ్గరవుతున్న సూర్య