Bigg Boss 6 Telugu: నామినేషన్స్ డే, ఎందుకోగాని హీట్ తగ్గింది, నామినేషన్లలో తొమ్మిది మంది
Bigg Boss 6 Telugu: నామినేషన్స్ డే అనగానే హీట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. కానీ ఎందుకోగానీ ఈ వారం ఆ వేడి తగ్గినట్టు కనిపిస్తోంది.
![Bigg Boss 6 Telugu: నామినేషన్స్ డే, ఎందుకోగాని హీట్ తగ్గింది, నామినేషన్లలో తొమ్మిది మంది Nominations in Bigg Boss House in Bigg Boss 6 Telugu Bigg Boss 6 Telugu: నామినేషన్స్ డే, ఎందుకోగాని హీట్ తగ్గింది, నామినేషన్లలో తొమ్మిది మంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/10/131d53a5b97124808edfbeb3a89ac1611665398512169248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss 6 Telugu: సోమవారం... నామినేషన్ డే. నామినేషన్లు అనగానే వేడి వాతావరణం వచ్చేస్తుంది ఇంట్లో. కానీ ఎందుకో ఈ ప్రోమోను చూస్తుంటే ఎవరిలోనూ ఆ వేడి కనిపించడం లేదు. ముఖ్యంగా గీతూ చాలా కూల్‌గా మారిపోయినట్టు అనిపించింది. ఓ రేంజ్ యాటిట్యూడ్ చూపించే గీతూ ఈ ప్రోమోలో మాత్రం ఎంత అవసరమో అంతే మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎపిసోడ్ చూస్తే కానీ పూర్తి వివరాలు తెలియవు.
నామినేషన్స్‌లో భాగంగా ముఖానికి ఫోమ్ (నురగ) పూసి నామినేట్ చేయాలని చెప్పారు బిగ్‌బాస్. రేవంత్ బాలాదిత్య ముఖానికి ఫోమ్ పూశాడు. శనివారం నాటి ఎపిసోడ్ వివరాలను మాట్లాడాడు రేవంత్. ‘వందశాతం తగ్గించుకోలేదు అన్నారుగా మీరిచ్చిన కామెంట్‌ను’ అని రేవంత్ అనగానే, బాలాదిత్య ‘మీరు వందశాతం ఫ్లాప్ అనలేదు, వందశాతం మార్పు రాలేదు కాబట్టి ఫ్లాప్ అన్నాను’ అని చెప్పుకొచ్చాడు. రేవంత్ సుదీపను కూడా నామినేట్ చేశాడు. ఆదివారం ఇచ్చిన ట్యాగ్ గురించి ఇద్దరు వాదులాడుకున్నారు. సుదీప ‘నువ్వు వందసార్లు మాట్లాడితే, నేను నూటొక్కసారి కూడా మాట్లాడతా’ అంది. దానికి రేవంత్ ఏమాత్రం తగ్గకుండా ‘నేను కోటిసార్లు మాట్లాడతా’ అన్నాడు.
కీర్తి నురగను సత్య ముఖానికి పూసింది. ఇంట్లో పనుల గురించి ఇద్దరూ వాదించుకున్నారు. సత్య నా పని అయ్యాక నాకు నచ్చినట్టు ఉంటా అని సమాధానం ఇచ్చింది. ఆదిరెడ్డి ఎవరి గురించి చెప్పాడో తెలియదు కానీ ‘మీరు చాలా నాలెడ్జ్ బుల్ పర్సన్ అని ఇప్పటివరకు అనిపించింది, ఆ ఒపినియన్ మార్చుకునేలా చేయద్దు’ అన్నాడు. అది ఎవరిని అన్నాడో ఎపిసోడ్‌లో చూడాలి.
It’s that time of the week! 💥
— starmaa (@StarMaa) October 10, 2022
Evaru evarni nominate chestaru? Miss avvakunda chudandi.. on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/6t9Md7g2tG
బాలాదిత్య గీతూని నామినేట్ చేశాడు. గీతూ వల్లే తాను స్టార్ ఆఫ్ ది వీక్ టైటిల్ కోల్పోయినట్టు చెప్పాడు. దానికి గీతూ ‘నువ్వు నావల్ల కోల్పోలేదు, నీ అజాగ్రత్త వల్ల’ అని చెప్పింది. దానికి బాలాదిత్య ‘నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా అభిప్రాయంలో అది తప్పే’ అని చెప్పాడు బాలాదిత్య.
తెలిసిన సమాచారం ప్రకారం ఈ వారం నామినేషన్లలో తొమ్మిది మంది నిలిచారు.
1. ఆదిత్య
2. గీతూ
3. రాజ్
4. కీర్తి
5. సుదీప
6. ఆదిరెడ్డి
7. ఇనయా
8. శ్రీహాన్
9. అర్జున్
ఆదివారం జరిగిన ఎపిసోడ్లో చలాకీ చంటి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
Also read: ఊహించిందే జరిగింది, చలాకీ చంటి ఎలిమినేషన్, ఇనయాకు దగ్గరవుతున్న సూర్య
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)