అన్వేషించండి

Chanti Elimination: చలాకీ చంటి షాకింగ్ నిర్ణయం, సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని బిగ్‌‌బాస్ నుంచి బయటికి వచ్చేసిన కమెడియన్?

బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఈ వీకెండ్ ఎలిమినేషన్ కూడా అలాగే జరిగిందని సమాచారం.

ప్రతి వారం ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఈ వారం రానే వచ్చింది. ఎవరు ఎలిమినేట్ అవుతారా? అని చర్చించుకుంటున్నారు ప్రేక్షకులు. కానీ ఈలోపే ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చంటి తనకు తానుగా బయటికి వచ్చేశాడని, అంటే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడని టాక్ నడుస్తోంది. నాగార్జున పర్మిషన్ తోనే ఇలా చేశారని తెలుస్తోంది. ఆయన ఇంట్లో ఇమడలేక చాలా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గీతూకు ఆయనకు అయిన గొడవ చినికి చినికి గాలివానగా మారాయి. మొదటి వారం నుంచి వారిద్దరికీ పడడం లేదు. గీతూ కక్ష కట్టి మరీ ఆయనపై చెడు ప్రచారాలు చేసింది. ఒక వారం గీతూ - చంటి గొడవే హైలైట్ అయింది. ఆ సమయంలో చంటి చాలా అప్ సెట్ అయినట్టు కనిపించాడు. గీతూ ప్రవర్తనతో ఆయన చాలా ఇబ్బంది పడినట్టు షో చూసే వారికి ఎవరికైనా అర్థం అవుతుంది. 

ఫ్లాఫ్ అని చెప్పుకుని మరీ...
నేటి ప్రోమోలో హౌస్లో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనే గేమ్ ఆడించారు.ఇందులో అందరూ తమను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. తాము ఆడామని, తామే హిట్ అని చెప్పుకున్నారు. ఒక్క చంటి మాత్రం ‘నేను హిట్ అని చెప్పుకోవడం లేదు’ అని షాకిచ్చాడు. దానికి నాగార్జున ‘ప్రేక్షకులందరికీ చెబుతున్నావా నువ్వు ఫ్లాప్ అని’ అడిగారు. దానికి కూడా చంటి ‘అవును నేను ఫ్లాప్ అని ఒప్పుకుంటున్నాను’ అన్నాడు. ఆ మాటల్లో ఆయన ఎలిమినేట్ కావాలని నిర్ణయించుకున్నాకే ఇలా చెప్పాడని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. 

వాసంతి సేఫ్ 
నిజానికి చంటి తనకు తానుగా ఎలిమినేట్ కాకపోతే వాసంతి కచ్చితంగా బయటికి వెళ్లేదని తెలుస్తోంది. ఆమె డేంజర్ జోన్లో ఉందని, అందరి కన్నా చాలా తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం. కానీ చంటి తనకు తానుగా బయటికి వెళ్లడం వల్ల వాసంతి సేఫ్  అయిందని టాక్. ప్రతి వారం వాసంతి వెళ్లిపోతుందనే అనిపిస్తుంది ప్రేక్షకులకు. కానీ ఏదో విధంగా ఆమె సేఫ్ అవుతూ వస్తోంది. 

చంటి హర్ట్ అయ్యాడా?
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన మొదటి వారమే ఆయనకు గీతూ గొడవలు మొదలయ్యాయి. రెండు వారాల క్రితం చంటి గీతూని నామినేట్ చేసినప్పుడు గీతూ చాలా ఓవర్ గా ప్రవర్తించింది. కీర్తి దగ్గరికి వెళ్లి చంటి నిన్ను ఇలా అన్నాడు, అలా అన్నాడు అని నాలుగు మాటలు కలిపి చెప్పింది.  అలాగే రేవంత్ దగ్గరికి వెళ్లి చంటి నీ మీద జోకులు వేస్తున్నాడు అంటూ ఏవేవో చెప్పింది. ఆమె ప్రవర్తన బయట చూస్తున్న జనాలకే చికాకు కలిగింది. మరి చంటికి ఏమనిపించిందో అర్థం చేసుకోగలం. అలాగే చిన్న చిన్న గొడవల్లో కూడా చంటి ఇన్వాల్వ్ అయ్యాడు. నిజానికి రేవంత్, ఇనయా వంటి వారితో పోలిస్తే చంటికి హౌస్ లో ఉన్న గొడవలు పెద్దవేం కాదు. వీరిద్దరే చాలా ఫైట్ చేస్తూ నిలబడుతున్నారు. కానీ చంటి ఒకరిద్దరితో ఉన్న గొడవలు పడలేక, హౌస్‌లో ఇమడలేక బయటికి వచ్చేయడం కాస్త వింతగానే ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget