Bigg Boss 6 Telugu: ముందు ఏడిపించేసిన బిగ్‌బాస్, తరువాత మాత్రం ఇంటి సభ్యులకు అంతులేని ఆనందం
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ముందు ఇంటి సభ్యులను బాగా ఏడిపించేశాడు. కానీ తరువాత మాత్రం వారికి కావాల్సినవి అందించాడు.
Bigg Boss 6 Telugu: వచ్చే వారం కెప్టెన్ ను ఎంచుకునే టాస్క్ ప్రస్తుతం ఇంట్లో నడుస్తోంది. దీనికి ముందు కెప్టెన్సీ కంటెండర్లను నిర్ణయించాలి. ఇందులో భాగంగా బ్యాటరీ రీఛార్జ్ అనే గేమ్ ఇచ్చారు. ఇందులో భాగంగా తమ ఇంట్లో వారితో ఫోన్ మాట్లాడే అవకాశం, వీడియో కాల్, ఇష్టమైన ఫుడ్ తెప్పించుకోవడం ... ఈ మూడు ఆప్షన్లు ఇచ్చారు. అయితే వీటికి ఎంత శాతం బ్యాటరీ తగ్గుతుందో కూడా చూపించారు. ఇక ప్రోమోలో ఏముందంటే...
గార్డెన్లో వందశాతం బ్యాటరీ నమూనాని ఇచ్చారు. ఎవరైనా ఇంటి సభ్యులు ఇచ్చి ఆప్షన్లలో ఏదైనా వాడుకుంటే కొంత శాతం ఛార్జింగ్ పడిపోతుంది. ఆదిరెడ్డి కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్‌బాస్ తన భార్య కూతురితో వీడియో కాల్ మాట్లాడేందుకు 40 శాతం బ్యాటరీ వాడాలని, అదే ఆడియో మెసేజ్ కావాలంటే 30 శాతం బ్యాటరీ, లేదా వారి దుస్తులు కావాలంటే 35 శాతం బ్యాటరీ వాడాలని చెప్పాడు. దానికి ఆదిరెడ్డి తానొక్కడినే అంత బ్యాటరీ వాడేస్తే ఎలా అని ఆలోచించాడు. ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావ్ బిగ్ బాస్ అంటూ వెళ్లిపోయాడు ఆదిరెడ్డి. మరి ఇతను ఏదైనా ఎంచుకున్నాడో లేదో తెలియదు.
తరువాత సుదీప కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లింది. తన భర్తతో ఆడియో కాల్ మాట్లాడేందుకు 30 శాతం బ్యాటరీ, అతని టీ షర్టు కోసం 40 శాతం బ్యాటరీ, ఇంటి ఆహారం కోసం 35 శాతం బ్యాటరీ వాడాలని చెప్పాడు. దానికి సుదీప ‘ఇది అన్యాయం బిగ్ బాస్’ అంటూ ఏడ్చింది. చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ ఆదిరెడ్డి చాలా ఆనందంగా ఏదో వీడియో చూస్తూ కనిపించాడు. శ్రీహాన్ కూడా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తింటూ కనిపించాడు. సుదీప ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. వారు ఏదైనా అవకాశాన్ని వాడకున్నారేమో ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది.
ఇక నిన్న వాడి వేడిగా బిగ్ బాస్ నామినేషన్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వారం నామినేషన్లలో ఉన్నది వీళ్లే.
1. కీర్తి
2.మెరీనా
3. బాలాదిత్య
4. ఆదిరెడ్డి
5. గీతూ
6. సుదీప
7. శ్రీహాన్
8. రాజ్
9. శ్రీసత్య
View this post on Instagram
Also read: శ్రీహాన్ చేసిన పనికి ఇంటి సభ్యులంతా ఇబ్బంది పడే పరిస్థితి, అసలేం జరిగింది?
Also read: కలిసి ఆడుతున్నారంటూ భార్యాభర్తలపై కంట్రోల్ తప్పి అరిచిన ఆదిరెడ్డి, కొట్టుకునే దాకా వెళ్లిన ఆ ఇద్దరూ