అన్వేషించండి
Advertisement
Bigg Boss Telugu 6: ఐటెం సాంగ్ తో యాంకర్ నేహా ఎంట్రీ - నాగార్జునను డ్రీమ్ బాయ్ అంటూ!
నాల్గో కంటెస్టెంట్ గా యాంకర్ నేహా ఐటెం సాంగ్ పెర్ఫార్మన్స్ తో స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చారు.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
నాల్గో కంటెస్టెంట్ గా యాంకర్ నేహా ఐటెం సాంగ్ పెర్ఫార్మన్స్ తో స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చారు. అనంతరం.. 'ఈ హౌస్ కి వచ్చేముందు పెళ్లైన చేస్కో.. లేదా బిగ్ బాస్ కి అయినా వెళ్లు అని కండీషన్ పెట్టారట' అని నాగార్జున అనగా.. 'మీకెలా తెలుసు' అంటూ షాక్ అయింది. తన బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా ఈ విషయం చెప్పలేదని తెలిపింది. తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని నేహా చౌదరి చెప్పింది. అప్పుడు 'బిగ్ బాస్' ఆఫర్ వచ్చిందని, అందుకని ఇంట్లో చెప్పి మరీ వచ్చేశానని ఆమె చెప్పింది. ''మంగళసూత్రం, మెట్టెలతో 'బిగ్ బాస్' హౌస్‌లో ఏం చేస్తాను?'' అని నేహా చౌదరి సరదాగా తెలిపింది. తన డ్రీమ్ బాయ్ మన్మథుడిలా, గ్రీకువీరుడిలా ఉండాలని నాగార్జునను ఉద్దేశిస్తూ చెప్పింది.
కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరినీ ఒక్కో కార్డు సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు నాగార్జున. నేహా సెలెక్ట్ చేసుకున్న కార్డు గుంట నక్క. దానికి అర్ధం ఏంటో తరువాత చెబుతానని అన్నారు నాగార్జున.
ఇక ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.
We welcome our 4th contestant #NehaChowdary to Bigg Boss house.#NehaOnBBTelugu#BiggBossTelugu6 #BBLiveOnHotstar@StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/Ie7ArDj6zY
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 4, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion