Bigg Boss 6 Finale: ఆదిరెడ్డి ఎలిమినేటెడ్ - సూట్‌కేసుతో ఇంట్లోకి వెళ్లిన రవితేజ
Bigg Boss 6 Finale: డబ్బుల సూటుకేసుతో ఇంట్లోకి వెళ్లారు రవితేజ.
Bigg Boss 6 Finale: ప్రతి సీజన్లో సూట్‌కేసుతో వెళ్లి కంటెస్టెంట్లను టెంప్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా హీరో రవితేజ ఆ బాధ్యతను తీసుకున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించేందుకు ఇంట్లోకి వెళ్లారు. అంతకు ముందు వేదికపై కాసేపు టాప్ 5 కంటెస్టెంట్లతో ముచ్చటించారు రవితేజ. అతనితో పాటూ ధమాకా హీరోయిన్ శ్రీలీల కూడా వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున.. శ్రీహాన్‌ను చూపిస్తూ అతడు ఫ్లర్టింగ్‌లో కింగ్ అని చెప్పారు. దీంతో రవితేజ ‘‘డూ ఏజ్ మచ్ ఏజ్ పాజిబుల్’’ అని అన్నారు. దీంతో నాగ్.. ‘‘ఆ స్కూల్‌లో రవితేజ మాస్టర్’’ అని పంచ్ వేశారు. దీంతో రవితేజ ‘‘మీరు తక్కువ బాగా.. మీకు ఏమీ తెలియదు పాపం’’ అని అంటూ నవ్వించారు. శ్రీలీల, రవితేజ కోసం పాటలు పాడి వినిపించాడు రేవంత్. తరువత శ్రీలీల-కీర్తి కలిసి కన్నడలో మాట్లాడుకున్నారు.
ఎలిమినేట్
టాప్ 4 కంటెస్టెంట్ల నుంచి ఒకరిని ఎలిమినేట్ సమయం వచ్చింది. ఇందులో భాగంగా చిన్న టాస్కు పెట్టారు. ఆ టాస్కు ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యారో చెప్పారు. ఆ టాస్కులో ఆదిరెడ్డి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. అతడు వేదిక మీదకు వచ్చాడు. శ్రీలీలను పంపించేసిన నాగార్జున, రవితేజను కాసేపు ఉండమని అడిగారు. ఈలోపు ఆదిరెడ్డితో ముచ్చటించారు.
ఆదిరెడ్డితో నాగార్జున మాట్లాడించారు. అంతేకాదు పాటలకు డ్యాన్సు కూడా వేయించారు. ఆదిరెడ్డి కీర్తి గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆమెలాగా అందరూ స్ట్రాంగ్ గా ఉంటే ఎక్కడా ఆత్మహత్యలే జరగవని చెప్పాడు. ఆ అమ్మాయి వీక్ అనుకున్నాను కానీ చాలా స్ట్రాంగ్, నాకు ఆ విషయం మధ్యలోనే తెలిసిందని అన్నాడు. రేవంత్ గురించి కూడా మంచిగా చెప్పాడు. అతని కోపమే కనిపిస్తుంది కానీ, అతను చాలా మంచివాడని చెప్పారు. ఆదిరెడ్డి తండ్రిని కూడా వేదిక మీదకు తీసుకొచ్చి ముచ్చటించారు.
View this post on Instagram
Also read: ‘బిగ్ బాస్’ జర్నీ చూసి ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్ - గీతూ మాత్రం మారలే, అదే ఏడుపు!