Bigg Boss Telugu 6: నన్ను పంపించేస్తే వెళ్లిపోతా - 'బిగ్ బాస్' హౌస్‌లో రేవంత్ ఫ్రస్ట్రేషన్!
ఈరోజు బిగ్ బాస్ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
'బిగ్ బాస్' సీజన్ 6(Bigg Boss)లో రచ్చ మొదలైంది. హౌస్‌లో ఉన్న 21 మంది కంటెస్టెంట్ల మధ్య అప్పుడే గొడవలు మొదలైపోయాయి. హౌస్ లో అడుగుపెట్టిన తొలిరోజే నామినేషన్స్ తో రచ్చ మొదలుపెట్టారు బిగ్ బాస్. దీంతో ఎవరూ తగ్గడం లేదు. నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లుగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక నామినేషన్లో ఉన్నవారి పరిస్థితి మరింత దారుణం. వారు తమ బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. ముఖ్యంగా వచ్చిన వారం రోజులోనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తామంటే ఏంటో నిరూపించుకోడానికి కూడా తగిన సమయం లేకపోవడంతో నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు తమ ఫ్రస్ట్రేషన్‌ను తమను నామినేట్ చేసినవారిపై చూపిస్తున్నారు.
బుధవారం వెల్లడించిన నామినేషన్ల ప్రకారం.. చంటి, ఇనయా సుల్తానా, రేవంత్, ఫైమా, అభినయాశ్రీ, శ్రీసత్య, ఆరోహీలు ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. శనివారం జరగబోయే ఎలిమినేషన్లలో వీరిలో ఒకరు లేదా ఇద్దరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి హౌస్ లోకి ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ని పెట్టారు. సో.. బిగ్ బాస్ ఎప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెడతారో అనే టెన్షన్ కంటెస్టెంట్స్ లో ఉండడం ఖాయం.
Bigg Boss Latest Promo: ఇదిలా ఉండగా.. ఈరోజు షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే నామినేషన్స్ తో గొడవ పడ్డ హౌస్ మేట్స్ మధ్య ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై వాదనలు జరుగుతున్నాయి. ముందుగా మెరీనా, శ్రీ సత్యల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మెరీనా ఏడ్చేసింది. ఆ తరువాత ఏ ముగ్గురికి కెప్టెన్సీ పోటీదారులయ్యే అర్హత ఉందో ఎన్నుకొని ఏకాభిప్రాయంగా చెప్పమని హౌస్ మేట్స్ కి చెప్పారు బిగ్ బాస్.
బాలాదిత్య ఇనీషియేషన్ తీసుకొని.. ముగ్గురు పేర్లు చెప్పి వారి స్కోర్స్ ని బట్టి ఎన్నుకుందామని అన్నారు. దానికి గీతూ ఫైర్ అయింది. కెప్టెన్సీకి కారణాలు కావాలని.. నచ్చినవాళ్లకి ఓటేసుకుంటూ వెళ్లడం కాదని మండిపడింది గీతూ. ఆ తరువాత ఆరోహిరావు 'ప్రతిసారి ఈ రొట్ట పంచాయితీ నా వల్ల కాదు.. ఆ తరువాత వెళ్లి వెనకాల మాట్లాడుడు' అంటూ రేవంత్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది.
ఈ విషయంలో రేవంత్ కి ఆరోహిరావుకి మధ్య గొడవ జరిగింది. ఆయనతో మాట్లాడడం వేస్ట్ అంటూ రేవంత్ ని తక్కువ చేసి మాట్లాడింది ఆరోహి. దాంతో రేవంత్ ''గ్రూప్ గా, బయాస్డ్ గా ఉండాలనే అనిపిస్తుంది.. ఈ క్షణం వాళ్లు పంపించేస్తే వెళ్లిపోవాలనుంది నాకు. జనాల కోసం నటిస్తూ ఉండలేను. అది నా క్యారెక్టర్ కాదు' అంటూ ఫ్రస్ట్రేట్ అయ్యారు రేవంత్.
Also Read: ‘క్యాష్’లో అలియా భట్‌కు శ్రీమంతం, రణ్‌బీర్‌పై సుమ పంచ్‌లు
Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం - మణిరత్నం తీసిన విజువల్ వండర్, 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్