News
News
X

Brahmastra: ‘క్యాష్‌’లో అలియా భట్‌కు శ్రీమంతం, రణ్‌బీర్‌పై సుమ పంచ్‌లు

ర‌ణ్‌బీర్‌ కపూర్ తెలుగు మార్కెట్ మీద గట్టిగా దృష్టి పెట్టారు. హైదరాబాద్ వచ్చి సినిమాను ప్రమోట్ చేయడమే కాదు, తెలుగు టీవీ షోలో పాల్గొన్నారు. ఇందులో ఆలియాకు శ్రీమంతం చేయడం విశేషం.

FOLLOW US: 

హిందీలో మాత్రమే సినిమాలు హిట్ అయితే చాలదు. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులనూ ఆకట్టుకోవాలని బాలీవుడ్ హీరోలు ప్లాన్ చేస్తున్నారు. హిందీ తర్వాత దేశంలో అతిపెద్ద మార్కెట్ అయిన తెలుగు మీద దృష్టి పెడుతున్నారు మన బాలీవుడ్ పెద్దలు. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు అందరూ హైదరాబాద్ వచ్చి తెలుగులో తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ర‌ణ్‌బీర్‌ కపూర్ ఒక అడుగు ముందుకు వేసి.. తెలుగు టీవీ షోలో పాల్గొన్నారు.

'బ్రహ్మాస్త్ర' కోసం... సుమ 'క్యాష్'లో!

బాలీవుడ్ క్యూట్ కపుల్ ర‌ణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన సినిమా 'బ్రహ్మాస్త్ర' (Brahmastra Movie). సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల కానుంది. ఆల్రె డీ ఈ సినిమా ప్రచారం కోసం రెండు సార్లు ర‌ణ్‌బీర్‌, ఆలియా అండ్ టీమ్ హైదరాబాద్ వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినా, అది జరగలేదు. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా ప్రెస్ మీట్ మాత్రమే నిర్వహించారు. అంతే కాదు సుమ 'క్యాష్' ప్రోగ్రామ్‌లో కూడా సందడి చేశారు. ఇప్పటివరకు బాలీవుడ్ ‘క్యాష్’ కార్యక్రమంలో ఎవరూ పాల్గోలేదు. దీంతో ప్రేక్షకులకు కూడా ఈ షోపై ఆసక్తి నెలకొంది. 

అలియాకు శ్రీమంతం, రణ్బీర్ కు పంచ్లు

సుమ కనకాల అంటే ఫన్. ఫన్ అంటే సుమ కనకాల. 'క్యాష్'లో ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలియా, రాజమౌళితో ఆమె ఎంత వినోదం పండించారో.. అంతే స్పాంటేనియస్‌గా ఎన్ని పంచ్ డైలాగ్స్ వేశారు. పెళ్లైన భర్తలు.. భార్యలు చెప్పినట్లు వినక తప్పదంటూ ఛలోక్తులు విసిరారు. అటు షో చివరలో ఆలియాకు సుమ శ్రీమంతం చేసింది. పూలు, పండ్లు, గాజులు పెట్టి సత్కరించింది. తెలుగు సంప్రదాయానికి  ఈ బాలీవుడ్ దంపతులు ఫిదా అయ్యారు. ఈ షోలో మౌని రాయ్ సైతం పాల్గొన్నారు.

రాజమౌళి గారూ.. ఒక్కసారి గిచ్చరా?
  
క్యాష్' ప్రోగ్రామ్‌లో సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలు వస్తుంటారు. అది సహజమే. అయితే ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి రావడంతో 'క్యాష్' ప్రోగ్రామ్ హోస్ట్, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆనందానికి అవధులు లేవు. 'రాజమౌళి గారూ.. ఒక్కసారి గిచ్చరా?' అంటూ ఆయన దగ్గరకు వెళ్లారు. గిచ్చిన తర్వాత 'ఆ వచ్చారు... వచ్చారు' అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె రియాక్షన్ సూపర్ అని చెప్పాలి. ఈ షో ఈ నెల 10న ప్రసారం కానుంది.

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా ప్రచారంలో భాగంగా గతంలో ఆలియా భట్ (Alia Bhatt) హైదరాబాద్ వచ్చారు. అప్పుడు సుమ కనకాలతో ఆమెకు పరిచయం అయ్యింది. షోలో కూడా ఆలియా సూపర్ యాక్టివ్ గా ఉన్నారని, బాగా నవ్వించారని టాక్. 
 
హిందీలో ర‌ణ్‌బీర్‌ కపూర్ స్టార్ హీరో. నటుడిగా పేరు తెచ్చుకున్నారు. వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ... కథానాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.  హిందీ చలన చిత్ర పరిశ్రమలోకి కపూర్ కుటుంబ వారసుడిగా ర‌ణ్‌బీర్‌ అడుగు పెట్టినప్పటికీ...  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం - మణిరత్నం తీసిన విజువల్ వండర్, 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్

Published at : 07 Sep 2022 07:44 PM (IST) Tags: SS Rajamouli Suma Kanakala Mouni Roy Ranbir Kapoor Alia Bhatt Brahmastra Movie Brahmastra Promotion Cash Latest Promo

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!