News
News
X

Bigg Boss 6 Telugu: ఇంట్లో బుట్టబొమ్మ ఎవరు? బాలాదిత్యను ప్రశ్నించిన నాగ్, ఎవరి పేరు చెప్పాడో గెస్ చేయండి

బిగ్ బాస్ నేటి ప్రోమో వచ్చేసింది. సండే రోజు చాలా ఫన్ గా నడిపించారు నాగ్.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: సన్ డే ఫన్ డే... వచ్చేసింది. నాగ్ హ్యాండ్సమ్ గా రెడీ అయి వేదికపై కనిపించారు. ఇక ఇంట్లో సభ్యులంతా మరింత అందంగా ముస్తాబయ్యారు. ఫన్నీ ప్రశ్నలతో కాసేపు ఇంట్లోని సభ్యులను ఛిల్ చేశారు నాగ్. ఆదివారం ఎసిపోడ్ కు సంబంధించి ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. 

ఎవరికి ఎంత తెలుసు?
ఇంట్లో ఎవరికి ఎంత తెలుసు అనే ఆట ఆడించారు. అందులో కొన్ని ప్రశ్నలు అడిగి, జవాబు తెలిసిన వారు బజర్ నొక్కాలి. ‘శ్రీహాన్ కు ఇంట్లో మొదట ఎక్స్ ప్లోర్ చేసిన ప్లేస్ ఏది?’ అని అడిగారు నాగ్. దానికి నేహా బజర్ నొక్కి ‘వాష్ రూమ్’ అని చెప్పింది. అది కరెక్టేనని చెప్పారు నాగ్. రెండో ప్రశ్నగా ఆర్జే సూర్య ఎంత మందిని మిమిక్రీ చేయగలడు? అని అడిగారు. దానికి ఇనయా అమాయకంగా ‘చాలా మందిని చేయగలడు’ అని ఆన్సర్ చెప్పింది. దానికి హౌస్ లో ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు. 

షానీ అంటే...
ఇంట్లో సభ్యులు షానీ పేరులో పూర్తి ఫామ్ ఏమిటో చెప్పమన్నారు నాగార్జున, ఎవరూ చెప్పలేకపోవడంతో నాగార్జునే జవాబు చెప్పారు. శ్రీలత, హర్షిత, అనిత, నిషా, ఈషాల మొదటి అక్షరాలన్నీ కలిపి షానీ పేరు ఏర్పడింది. బాలాదిత్యను ‘ఈ హౌస్ లో ఉన్న బుట్టబొమ్మ ఎవరు?’ అని అడిగారు. కాసేపు ఆలోచించిన బాలాదిత్య ‘మెరీనా’ పేరు చెప్పాడు. చాలా సేఫ్ గేమ్ ఆడావ్ అంటూ నాగ్ నవ్వేశారు. ఇక శ్రీ సత్య శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ అని చెప్పాడు. వాసంతి ... గ్లామర్ ఆఫ్ బిగ్ బాస్, ఫైమా ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పారు. ఇక గీతూ గురించి చెబుతూ గీతక్క సీతక్క అని కామెంట్ చేశాడు బాలాదిత్య. దానికి గీతూ మాట్లాడుతూ ‘నేను టెంకాయలాగా,బయట గట్టిగా ఉంటా, లోపల స్వీట్ గా ఉంటా’ అంది. దానికి నాగ్ ‘బేసిగ్గా పగులగొట్టాలంటావ్ నిన్ను’ అనగానే అందరూ నవ్వేశారు. అందరూ నవ్వడం చూసి గీతూ ‘మీరంతా హ్యాపీ కదా’ అంటూ సెటైర్ వేసింది. ఈ ప్రోమో చూస్తుంటే సన్ డే నిజంగా ఫన్ డే లాగే సాగినట్టు తెలుస్తోంది.

నో ఎలిమినేషన్
ఈ రోజు ఎలిమినేషన్ లేనట్టు సమాచారం. నిజానికి డేంజర్ జోన్లో ఆరోహి, అభినయశ్రీ, ఇనయా సుల్తానా ఉన్నారని తెలుస్తోంది. అయితే మొదటి వీక్ ఎలిమినేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని సమాచారం. అంటే ఈ సారి ఇంట్లోంచి ఎవరూ బయటకు వెళ్లారన్న. అలా అయితే నిజంగా కొంతమంది లైఫ్ వచ్చినట్టే. ముఖ్యంగా అభినయశ్రీ వెళ్లిపోతుందని టాక్ వచ్చింది. అందరికన్నా ఆమెకే తక్కువ ఓట్లు పడ్డాయని తెలిసింది. కానీ ఎవరినీ ఎలిమినేట్ చేయకుండా వదిలేశారు.  

Also read: గీతూని నోరు అదుపులో పెట్టుకోమన్న నాగ్ - ఏడుగురిలో వారిద్దరూ సేఫ్!

Also read: వారిద్దరూ భార్యాభర్తలు, లైసెన్స్ ఉంది అంటూ నాగ్ ‘నారాయణ’ జపం

Published at : 11 Sep 2022 02:59 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg boss 6 Promo Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Host Nagarjuna

సంబంధిత కథనాలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

God Father: 'గాడ్ ఫాదర్'లో 'బింబిసార' బ్యూటీ - ఒక్క సాంగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?

God Father: 'గాడ్ ఫాదర్'లో 'బింబిసార' బ్యూటీ - ఒక్క సాంగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?

యాంకర్‌ను బూతులు తిట్టిన హీరో, అరెస్టు చేసిన పోలీసులు

యాంకర్‌ను బూతులు తిట్టిన హీరో, అరెస్టు చేసిన పోలీసులు

టాప్ స్టోరీస్

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?