Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి
Bigg Boss 6 Telugu: ప్రోమోలానే కొత్తగా హైలైట్స్ ను యూట్యూబ్ లో విడుదల చేస్తోంది స్టార్ మా.
Bigg Boss 6 Telugu: ఎవరూ ఊహించని విధంగా ఆదివారం నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది. అందరూ వాసంతి ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు. అంతెందుకు వాసంతి కూడా దాదాపు అదే ఫిక్స్ అయింది. కానీ బిగ్ బాస్ పెద్ద ట్విస్టు ఇచ్చాడు. నేహా చౌదరిని ఎలిమినేట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తగిలింది ఇంటి సభ్యులకు. అదే విషయాన్ని రాజశేఖర్, ఆదిరెడ్డి మాట్లాడుకుంటూ కనిపించారు.
పూల్ పక్కన సేదతీరుతూ ఆదిరెడ్డి - రాజ్ ముచ్చట్టు పెట్టారు. నేహా ఎందుకు ఎలిమినేట్ అయింది అనే విషయంపై రివ్యూ చేశారు. ఆదిరెడ్డి రివ్యూలు వద్దని చెప్పినా మళ్లీ అదే పని చూస్తూ కనిపించాడు. నేహా అతిగా మాట్లాడడం, కచ్చితంగా గెలవాలి అనుకోవడం వల్లే ఎలిమినేట్ అయ్యిందని అన్నాడు ఆదిరెడ్డి. ఆవిడ నాతో చివరి వరకు బాగానే ఉన్నారని, చాలా రోజులు ఉంటారని, టాప్ 5 వరకు ఉంటారని అనుకున్నానని అన్నాడు ఆదిరెడ్డి. ఆమె ఓటమిని తీసుకోకపోవడం వల్ల నెగిటివ్ వెళ్లిందని, కొన్ని చోట్ల గివప్ చేయాలని, కొన్ని సార్లు గివప్ ఇవ్వకూడదంటూ మాట్లాడుకున్నారు.
రివ్యూలు మానరా?
ఆదిరెడ్డి, గీతూ ఇద్దరూ బిగ్ బాస్ వల్లే బయటి ప్రపంచానికి తెలిశారు. వారు వరుస సీజన్లను రివ్యూలు చేసుకుంటు వచ్చి స్టార్ మా దృష్టిలో పడ్డారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ లో అడుగుపెట్టి కూడా ఇంకా రివ్యూలు చేస్తూనే ఉన్నారు వీరిద్దరూ. నాగార్జున ప్రత్యేకంగా రివ్యూలు మానేయమని చెప్పారు. అయినా ఆదిరెడ్డి మానలేదు. తన ఆట గురించి తాను రివ్యూ చేసుకోకుండా పక్కవాళ్ల ఆట గురించి రివ్యూలు చేస్తున్నాడు.
ఏంటీ హైలైట్స్...
ఆ రోజు ఎపిసోడ్ కు సంబంధించి రెండు ప్రోమోలు విడుదలవుతాయి. అలాగే ఇప్పుడు కొత్తగా హైలైట్స్ పేరుతో చిన్న చిన్న షాట్స్ యూట్యూబ్ లో విడుదల చేస్తోంది స్టార్ మా. ఓటీటీ 24 గంటల షో చూసే వారి కన్నా కేవలం ఎపిసోడ్లు చూసేవారికి ఇది కాస్త ఎంటర్ టైనింగ్ గా అనిపిస్తుంది.
ఈ సారి నామినేషన్స్ లో ఎక్కువమందే ఉన్నారు. ఆదివారం కీర్తి, అర్జున్ కళ్యాణ్ నేరుగా నామినేట్ అయ్యారు.
1. సుదీప
2. కీర్తి
3. ఆరోహి
4. గీతూ
5. శ్రీహాన్
6. ఇనయా
7. రాజశేఖర్
8. సూర్య
9. అర్జున్
10. రేవంత్
ఈసారి వాసంతి, కీర్తి, రాజశేఖర్... ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా. బిగ్ బాస్ లో ఏమైనా జరగొచ్చని నేహా ఎలిమినేట్ అయ్యాక అర్థమవుతోంది. కాబట్టి ఈ అంచనా కచ్చితమని కూడా చెప్పలేం. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ నాలుగురోజుల్లోని ఆట తేల్చేస్తుంది. గత వారం నేహ ఆట చక్కగా ఆడినా కూడా ఎలిమినేట్ అయ్యింది.
Also read: ముద్దలు కలిపి అర్జున్‌కు తినిపించిన శ్రీసత్య, హౌస్‌లో ఫన్నీ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్
Also read: హౌస్ టార్గెట్ ఇనయా, ఇలాగే అయితే ఇనయా ఆర్మీ రెడీ అవ్వడం ఖాయం, నామినేట్ అయింది వీళ్లే