News
News
X

Bigg Boss 6 Telugu Announced: ఓటీటీలో ‘బిగ్ బాస్-6’: బాలకృష్ణ హోస్టింగ్‌పై స్పందించిన నాగార్జున

‘బిగ్ బాస్’ సీజన్ 6కు బాలకృష్ణ హోస్ట్ చేయనున్నారా? దీనిపై నాగార్జున ఏం చెప్పారో చూడండి.

FOLLOW US: 

‘బిగ్ బాస్’ సీజన్ 5 ముగియడంతో.. సీజన్-6 గురించి అంతటా చర్చ నెలకొంది. ఈ సీజన్ ఓటీటీలో ప్రసారమవుతుందా? లేదా స్టార్‌మాలో ప్రసారమవుతుందా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. అలాగే.. ‘ఆహా’ ఓటీటీలో దూసుకెళ్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో హోస్ట్ నందమూరి బాలకృష్ణ ఈసారి ‘బిగ్ బాస్’ సీజన్ 6కు హోస్ట్‌గా వ్యవహరిస్తారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున ఈ సందేహాలన్నీ క్లియర్ చేశారు. 

‘బిగ్ బాస్’ సీజన్ 5.. గ్రాండ్ ఫినాలేలో మరో రెండు నెలల్లోనే ‘బిగ్ బాస్’ సీజన్-6 ప్రారంభం కానుందని ప్రకటించారు. శుక్రవారం ‘పరంపర’ వెబ్‌సీరిస్ రిలీజ్ సందర్భరంగా Disney Plus Hotstar నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘టీవీ చానెల్‌లో వచ్చే ‘బిగ్ బాస్’కు ఓటీటీలో వచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దీన్ని కొత్తగా ప్రొగ్రమింగ్ చేస్తున్నారు. అయితే, ఇందులో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు’’ అని తెలిపారు. 

ఒక పక్క సినిమాలు, మరో పక్క ‘బిగ్ బాస్’ వంటి భారీ షోలు మీకు ఒత్తిడి కలిగించవా? అనే ప్రశ్నకు నాగ్ బదులిస్తూ.. ‘‘నాకు ప్రెజర్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా పనిచేస్తాను. బిగ్ బాస్ షో నాకు అలవాటైపోయింది. అందులో ఉన్నవారంతా నాకు ఫ్యామిలీలా అనిపిస్తారు. బిగ్ బాస్ అనేది టెన్షన్ లేని ఎక్స్‌పియరెన్స్. బిగ్ బాస్‌ను ప్రేక్షకులు మాత్రమే కాదు.. నేను కూడా మిస్ అవుతున్నా’’ అని అన్నారు. 

‘బిగ్ బాస్’ ఫినాలే చాలా గ్రాండ్‌గా చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా తీసుకొస్తున్నారని అన్న విలేకరికి నాగార్జున సమాధానమిస్తూ.. ‘‘బిగ్ బాస్ షో పాపులారిటీ వల్ల మాత్రమే అంత క్రేజ్ లభిస్తోంది. చాలామంది ఈ షో మీదకు వస్తానని అంటున్నారు. 6 కోట్ల మంది ప్రేక్షకులు ఈ షోను వీక్షిస్తున్నారు. ఎందుకురారు. వారంతంట వారే వస్తారు’’ అని అన్నారు. 

మీరు చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు, ‘బిగ్ బాస్’ షోకు వ్యత్యాసం ఏమిటనే ప్రశ్నకు నాగ్ బదులిస్తూ.. ‘‘మీలో ఎవరు కోటేశ్వరుడు అనేది పూర్తిగా నాలెడ్జ్ షో. బిగ్ బాస్ దాన్ని పోల్చలేం. బిగ్ బాస్ అందుకు పూర్తిగా విరుద్దాం. అయితే, ఇందులో మనుషులపై నాలెడ్జ్ ఏర్పడుతుంది. మనుషుల ప్రవర్తన రోజు రోజుకు ఎలా మారుతుందో ఇందులో చూడవచ్చు. ఒక వ్యక్తి ఇలా ఉంటాడని అనుకుంటాం. కానీ, తర్వాతి వీక్‌లో అతడు పూర్తిగా మారిపోతాడు. ఇది కూడా ఒకరకమైన నాలేడ్జే’’ అని అన్నారు. ‘బిగ్ బాస్’ సీజన్‌కు మీరు హోస్ట్‌గా ఉండరని వార్తలు వస్తున్నాయి. 

ఈ సీజన్‌‌‌ను కూడా మీరే హోస్ట్ చేయనున్నారా? అనే ప్రశ్నకు నాగ్ బదులిస్తూ.. ‘‘బిగ్ బాస్ సీజన్-6 కూడా నేనే హోస్ట్ చేస్తాను’’ అని తెలిపారు. ఈ సమాధానంతో బాలకృష్ణ ‘బిగ్ బాస్’ హోస్ట్‌గా వ్యవహరిస్తారనే వదంతులకు నాగ్ పుల్‌స్టాప్ పెట్టారు. అయితే, ఈసారి టెలికాస్టయ్యే ‘బిగ్ బాస్’ సీజన్ 6.. హాట్ స్టార్‌లో వేరేగా, ‘స్టార్ మా’లో వేరే ఫార్మాట్‌లో ప్రసారం కానున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే ప్రోమో విడుదల కానుంది. 

Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్ట‌ర్ సంగ‌తేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అన‌సూయ‌!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 24 Dec 2021 12:44 PM (IST) Tags: నాగార్జున Star maa బాలకృష్ణ Hotstar Bigg Boss 6 Telugu Bigg Boss 6 Telugu Host Bigg Boss 6 Telugu Date Bigg Boss 6 Telugu Contestants Disney Hotstar బిగ్ బాస్ తెలుగు 6

సంబంధిత కథనాలు

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా,  రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!