News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sunny Vs Shanmukh: అరె ఏంట్రా ఇది.. సిరి చేతిలో షణ్ముఖ్ భవిష్యత్? టైటిల్ రేసులో సన్నీ!

బిగ్ బాస్ టైటిల్ ఎవరు దక్కించుకుంటారనే టెన్షన్ మొదలైంది. ఇప్పటికే సన్నీకి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆల్రెడీ అభిమానులు ఉన్న షన్నుకు ఇది సవాలే.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 5.. టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో షణ్ముఖ్ జస్వంత్‌ (షన్ను)ను దురదృష్టం వెంటాడుతోంది. స్కిల్ టాస్క్ తర్వాత.. వీజే సన్నీ, షన్నుల పాయింట్స్ ఇక్వెల్ కావడంతో బిగ్ బాస్ ఇద్దరికీ పోటీ పెట్టారు. ఇందులో షన్ను కేవలం రెండు సెకన్ల తేడాతో సన్నీపై ఓడిపోయాడు. స్కిట్‌లో వేగాన్ని చూపించినా.. ఫలితం లేకపోయింది. ఈ టాస్క్‌లో షన్ను తనకి తాను తగిన పాయింట్లను తెచ్చుకోలేకపోయాడు. అయితే.. సిరి కోసం ఆడిన టాస్కులో మాత్రం ఎక్కువ పాయింట్లను సంపాదించి పెట్టాడు. దీంతో సిరి ‘టికెట్ టు ఫినాలే’ తర్వాత దశలోకి ఎంట్రీ ఇచ్చింది.

గేమ్ ప్లాన్ ఉందా.. లేదా?: షన్ను ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి పెద్దగా యాక్టివిటీల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. మిగతా కంటెస్టెంట్లు ఉన్నంత చురుకుదనం షన్నులో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే, ముక్కు సూటిగా ఉంటూ.. చెప్పాలనుకున్నది ముఖం మీదే చెప్పేసే తత్వంతో ఆడియన్స్‌కు నచ్చేశాడు. అయితే, షన్ను తీరును చూస్తే.. గత సీజన్ టైటిల్ విన్నర్ అభిజీత్‌ను ఫాలో అవుతున్నాడని అనిపిస్తుంది. అప్పట్లో అభి కూడా ఎక్కువగా కష్టపకుండా కూర్చునే కనిపించేవాడు. టాస్కుల్లో కూడా వెనకబడేవాడు. అయితే, అతడికి ఉన్న అనారోగ్య కారణాల వల్ల అతడు రిస్క్ చేసేవాడు కాదని తెలిసింది. మోనాల్‌-అభి-అఖిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆ తర్వాత దేత్తడి హారికతో స్నేహం.. ఆసక్తి కలిగించింది. అఖిల్-అభిలు ఎదురుపడ్డారంటే.. వార్ మామూలుగా ఉండేది కాదు. పైగా అభి వేసే డైలాగులకు కూడా అభిమానులు ఫిదా అయ్యేవారు. అయితే, అభికి అఖిల్ నుంచి కాకుండా.. సోహైల్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ సీజన్‌లో కూడా కొందరు వీరిని అనుకరిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా సన్నీ.. సొహైల్‌ను అనుకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

అభిమానులను సంపాదించుకున్న షన్ను: అభిని అనుకరిస్తున్న షన్ను.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం అతడికి ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రమే ఉంది. సన్నీకి మొదట్లో అంత ఫాలోయింగ్ లేకపోయినా.. బిగ్ బాస్‌లో అతడి ఆట తీరును చూసి అభిమానులు పెరుగుతున్నారు. పైగా, సన్నీకి బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉండాలనే విషయంపై స్పష్టత ఉంది. ముందు ఇంటి సభ్యుల మెప్పు పొందుతూ.. మరో వైపు అభిమానులను ఆకట్టుకోవాలనేది సన్నీ ప్లాన్. ఈ విషయాన్ని సన్నీ.. మొదట్లో షన్నుతో చెప్పిన మాటల్లోనే స్పష్టమైంది. ‘‘బయట అభిమానులు ఉన్నారని కాదు, అభిమానులను ఇక్కడ సంపాదించుకోవాలి’’ అంటూ షో మొదట్లో నామినేషన్ల సమయంలో అన్నాడు. ఇప్పుడు అదే జరిగింది. ఎన్ని వారాలు ఉంటాడో అనే సందేహంతో అడుగు పెట్టిన సన్నికి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. బిగ్ బాస్‌ను కనీసం కొంతమందైనా చూడగలగుతున్నారంటే సన్నీ చేసే కామెడీ వల్లే. అతడే లేకపోతే.. టీఆర్పీ దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. అలాగని షన్నును తక్కువ చేయలేం. అతడికి కూడా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. 

షన్ను గేమ్‌పై సిరి ప్రభావం?: సిరి వల్ల షన్ను ఆట చాలా దెబ్బతిందనేది అభిమానుల అభిప్రాయం. ఆమె లేకపోయి ఉంటే.. షన్ను వేరేలా హైలెట్ అయ్యేవాడేమో. షన్ను ఆటను కూడా సిరియే ఆడేస్తున్నట్లు ఉంటుందనే టాక్ ఉంది. అయితే, టాస్కుల విషయంలో షన్ను కంటే సిరి చాలా బెటర్. షన్ను తన అభిమానులతోపాటు తన ప్రియురాలు దీప్తి సునైన ఫ్యాన్స్ కూడా ఓట్లేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. టాస్కుల్లో బాగా ఆడి మంచి మార్కులు కొట్టాలనే ప్రయత్నం చేయడం లేదు. అయితే, షన్ను ఓవర్ యాక్షన్ చేయకుండా తన పరిధిలో తాను ఉంటూ మెప్పిస్తున్నాడు. సిరి విషయంలోనే కాస్త ఇబ్బంది పడుతున్నాడు. పైగా ఆమెతోనే ఎక్కువగా కలిసి ఉంటున్నాడు. షో మొదలు నుంచి వారిద్దరు వేర్వేరుగా ఉన్న సందర్భాలు చాలా తక్కువ. ప్రతి ఫ్రేమ్‌లో వారిద్దరే కవల పిల్లల్లా కనిపిస్తుంటారు. ఫైనల్ టాప్ 5 జాబితాలో సిరి, షన్ను ఉంటే తప్పకుండా ఇద్దరూ దుకాణం సర్దేసుకోవల్సిందే. ముఖ్యంగా సిరికి కేవలం ఆమె ఫ్యాన్స్ ఓట్లు మాత్రమే పడతాయి. ఈ వారం కూడా  ఇప్పుడు షన్నుకు కేవలం సన్నీ మాత్రమే కాదు. మానస్, శ్రీరామ చంద్ర కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. రానున్న వారం రోజుల్లో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్పా షన్ను టైటిల్ విన్నయ్యే ఛాన్సెస్ లేవనే అభిప్రాయం ఉంది.  టైటిల్ గెలిచే అవకాశాలు సన్నీకే ఎక్కువగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతమైతే.. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు ఉండనుంది. గురువారం జరిగిన ‘స్కిల్’ టాస్క్ తరహాలో షన్ను.. కొద్దిలో టైటిల్ కోల్పోయినా.. ఆశ్చర్యపోవక్కర్లేదు. షన్ను ఇప్పటికే చాలా ఆలస్యంగా కళ్లు తెరిచాడు. వచ్చే వారం ఏ చిన్న తప్పు చేసినా.. అతడి అభిమానులు ‘అరె ఏంట్రా ఇదీ’ అని ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది. 

సన్నీ ప్లస్ పాయింట్స్: 
⦿ ఎంత తొందరగా అరుస్తాడో అంతే తొందరగా కూల్ అయిపోతాడు.
⦿ ఎవ్వరితోనూ పూర్తిస్థాయి విరోధిలా ప్రవర్తించడు.
⦿ ప్రస్తుతం హౌజ్‌లో ఉన్నవారిలో అంతో ఇంతో నవ్వించేది సన్నీనే.
⦿ రిస్క్ చేయాలన్నా ముందుంటాడు( కేక్ తినేశాడు).
⦿ టాస్కుల్లో అస్సలు వెనక్కు తగ్గడు.
⦿ ఫ్రెండ్ అనేసరికి సోహైల్ తరహాలో ఏమైనా చేసేస్తాడు.
⦿ ఏమోషన్స్ కంట్రోల్ చేసుకోలేడు, ఏడ్చేస్తాడు. అందుకే దొంగ ఏడుపునే ఫీలింగ్ ప్రేక్షకులకు రాదు. 
⦿ గేమ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతాడు. కానీ వేరేవారి వెనుక వాళ్లని బ్లేమ్ చేయడు.

సన్నీ మైనస్ పాయింట్స్:
⦿ ఎప్పుడు దేనికి రియాక్టవుతాడో అర్థంకాదు.
⦿ చిన్న విషయానికే రెచ్చిపోతాడనే ఉద్దేశంతో హౌజ్ మేట్స్ కావాలని ప్రోవోక్ చేస్తున్నారని అర్థం చేసుకోడు.
⦿ కోపంలో ఎంత మాటైనా అనేస్తాడు (ఆ మాటే ప్రతివారం నామినేషన్లో ఉండేలా చేస్తోంది).

షణ్ముఖ్ ప్లస్ పాయింట్స్:
⦿ కూల్ గా ఉంటాడు, ఆలోచనా విధానం బావుంటుంది.
⦿ మైండ్ గేమ్ బాగా ఆడతాడు. 
⦿ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది.
⦿ ఎవ్వరితో ఫ్రెండ్ షిప్ లేదు, విరోధం లేదన్నట్టు ప్రవర్తించగలడు(సిరితో తప్ప).
⦿ బాధ్యత అప్పగిస్తే జన్యూన్ గా ప్రవర్తిస్తాడు.(ఆఖరికి కెప్టెన్ అయ్యాడంటే అదే కారణం).

Also Read: బిగ్ బాస్.. నాదే తప్పైతే వెళ్లిపోతా.. సిరిని గెలిపించి ఓడిన షణ్ముఖ్.. కాజల్, పింకీ ఔట్

షణ్ముక్ మైనస్ పాయింట్స్:
⦿ ఫస్ట్ మైనస్ పాయింట్ సిరి. సిరిని ఎంతవరకూ ఉంచాలో తెలుసు. ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె తగ్గకపోవడంతో నాకు తప్పడం లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు.
⦿ టాస్కుల్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ ఉండదు.
⦿ బ్రహ్మ కాస్త రాను రాను నారదగా మారుతున్నాడనే విమర్శలు (సన్నీ-కాజల్-మానస్ కలసి పింకీని దూరంగా పెడుతున్నారని ఆమెకు చెప్పి సన్నీని వీక్ చేయాలనే ప్రయత్నం).
⦿ సన్నీ తనకు పోటీ అని అర్థమైనప్పటి నుంచీ సన్నీని రెచ్చగొట్టి బ్యాడ్ చేయాలనే ప్లానింగ్.
⦿ సిరి ఎవ్వరితో మాట్లాడినా భరించలేని తీరుపై ప్రేక్షకులకు విరక్తి.
⦿ నిత్యం ఎవరో ఒకరిపై విమర్శలు, కాజల్‌ని టార్గెట్ చేయడం.

Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌
Also Read: ర‌జ‌నీకాంత్‌తో వరుస సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌.. ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో న‌యన‌తార‌...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 03 Dec 2021 05:24 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Shanmukh jaswanth బిగ్ బాస్ 5 తెలుగు షణ్ముఖ్ జస్వంత్ Shanmukh Siri Sunny బిగ్ బాస్ 5 సన్నీ Sunny Vs Shanmukh

ఇవి కూడా చూడండి

Bigg Boss Telugu 7: ‘స్పా’ బ్యాచ్‌లో మనస్పర్థలు - టమాటాల గురించి శోభా, ప్రియాంకల గొడవ

Bigg Boss Telugu 7: ‘స్పా’ బ్యాచ్‌లో మనస్పర్థలు - టమాటాల గురించి శోభా, ప్రియాంకల గొడవ

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!

Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!

Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్‌!

Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్‌!

Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్

Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్

టాప్ స్టోరీస్

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!