X

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్.. నాదే తప్పైతే వెళ్లిపోతా.. సిరిని గెలిపించి ఓడిన షణ్ముఖ్.. కాజల్, పింకీ ఔట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగింపు దశకు వచ్చింది. మరి గురువారం జరిగిన ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌లో విజేతగా నిలిచింది ఎవరు? తుది టాస్క్‌కు చేరిందెవరు?

FOLLOW US: 

బిగ్ బాస్‌లో గురువారం ప్రసారమైన 89వ ఎపిసోడ్‌లో ‘టికెట్ టు ఫినాలే’ ఆట కొనసాగింది. సమయాన్ని అంచనా వేసే టాస్క్‌లో మానస్ గెలిచాడు. అయితే.. టైమ్ అంచనా వేయడానికి మానస్‌‌పై ఆధారపడిన సన్నీ మాత్రం చివరి స్థానంలో నిలిచాడు. షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, ప్రియాంక, కాజల్‌, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

షన్నుకు మళ్లీ హగ్గు..: సిరి-షన్నుల హగ్గులపర్వం ఈ ఎపిసోడ్‌లో కొనసాగింది. సిరి పిలిచి మరీ షన్నును హగ్ చేసుకుంది. ఈ సందర్భంగా షన్ను కెమేరాల వైపు చూస్తూ.. ఇది కేవలం ఫ్రెండ్‌షిప్ హగ్ మాత్రమేనని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో సిరి కూడా షన్ను తనని బాగా చూసుకుంటున్నాడని, హగ్ ఇవ్వకపోతే ఎలా అని అంది. ఇప్పుడు అమ్మకు అర్థమవుతుందని సిరి అనుకుంది. సిరికి హగ్గిచ్చిన తర్వాత ప్రియాంక కూడా హగ్ కావాలని అని అంది. కానీ, షన్ను పట్టించుకోలేదు. 

కాజల్ Vs షన్ను: ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో కాజల్, షణ్ముఖ్‌లు కాసేపు వాగ్వాదం చేసుకున్నారు. నువ్వా.. నేనా అన్నట్లు పోట్లాడుకున్నారు. దీంతో షన్ను.. ‘‘నిజంగా నాది తప్పైతే నీ కంటే ముందే వెళ్లిపోతా’’ అని అన్నాడు. దీంతో కాజల్.. ‘‘నువ్వు నన్ను తప్పు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తావ్’’ అంటూ వాదించింది. ఆ తర్వాత షన్ను, సిరిల గురించి కాజల్, మానస్, సన్నీ కాసేపు మాట్లాడుకున్నారు. 

సిరికి బదులు షన్ను, శ్రీరామ్‌కు బదులు సన్నీ: ‘టికెట్ టు ఫినాలే’ 3వ టాస్క్‌లో సిరి, శ్రీరామ్‌లకు ఆడే అవకాశం రాలేదు. వారి కాళ్లకు గాయాలు కావడం వల్ల.. ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. సిరి తాను స్వయంగా వెళ్లి ఆడతానని ముందుకొచ్చింది. ‘‘ఒకసారి మానస్‌తో నా గేమ్ ఆడించినందుకు ఆ ఫీలింగ్ అలానే ఉండిపోయింది. ఈసారి మాత్రం నా గేమ్ నేనే ఆడతా’’ అని అంది. కానీ, బిగ్ బాస్ మాత్రం అంగీకరించలేదు. వారికి బదులుగా వేరే వాళ్లను ఆడేందుకు ఎంపిక చేసుకోవాలని సిరి, శ్రీరామ్‌లకు బిగ్ బాస్ చెప్పాడు. దీంతో సిరి తన ఫ్రెండ్ షన్ముఖ్ పేరు చెప్పింది. శ్రీరామ్.. సన్నీని ఆడమని కోరాడు. 

స్కిల్ టాస్క్‌లోనూ మానస్‌దే పైచేయి: మూడో టాస్క్ ప్రకారం.. ఓ స్లైడ్‌లో ఉన్న బాల్స్‌ను కేవలం నీటిని పోస్తూ బయటకు తీయాలి. బాల్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత బెల్ కొట్టాలి. ముందుగా సన్నీ, షన్ముఖ్‌, ఆ తర్వాత కాజల్, ప్రియాంక పోటీ పడ్డారు. చివరిగా సిరి తరపున సన్నీ, శ్రీరామ్ తరపున సన్నీ, మానస్‌తో పోటీ పడ్డారు. ఇందులో మానస్‌, శ్రీరామ్‌, సిరి, ప్రియాంక, కాజల్‌, సన్నీ, షణ్ముఖ్‌ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు.

కాజల్, ప్రియాంక, షన్ను ఔట్: ‘టికెట్ టు ఫినాలే’లోని మూడు టాస్కుల్లో తక్కువ పాయింట్లు సాధించడం వల్ల కాజల్, ప్రియాంక, షణ్మఖ్ జస్వంత్ చివరి పోటీ నుంచి తప్పుకోవలసి వచ్చింది. అయితే, చివరి పాయింట్లలో షన్ను, సన్నీ చెరో 10 పాయింట్లతో సమానంగా ఉన్నారు. దీంతో బిగ్ బాస్ మరోసారి వారిద్దరికి ‘స్కిల్’ టాస్క్ ఇచ్చాడు. ఇది చాలా ఉత్కంఠంగా సాగింది. సన్నీ 20 సెకన్లలో పూర్తి చేసి బెల్ కొట్టగా.. షన్ను 22 సెకన్లలో పూర్తి చేశాడు. 2 సెకన్ల తేడాతో పాయింట్లను కోల్పోయి ఫినాలే ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాడు. అయితే, సిరికి మాత్రం ఈ టాస్కులో మంచి పాయింట్లే వచ్చాయి. దీంతో షన్ను.. సిరిని గెలిపించి.. తాను ఓడినట్లయ్యింది.

Also Read: ‘ఒమిక్రాన్’.. ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

ఎవరెవరికి ఎన్ని పాయింట్లు?: టికెట్ టు ఫినాలేలో మూడు టాస్కులు కలిపి.. కాజల్‌కు 8, ప్రియాంకకు 8, షన్నుకు 10 పాయింట్లు వచ్చాయి. దీంతో వారు రేస్ నుంచి తప్పుకోక తప్పలేదు. మిగతా సభ్యుల్లో మానస్ 18 పాయింట్లతో ముందున్నాడు. ఆ తర్వాత శ్రీరామచంద్ర 16, సిరి 15, సన్నీ 10 పాయింట్లతో ఫినాలే ఫైనల్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులు గెలిచిన నలుగురి మధ్య మరో పోటీ పెట్టాడు. వీరిని కాజల్ డిస్ట్రబ్ చేయడానికి ప్రయత్నించడం, సన్నీకి ఆగ్రహం వచ్చి లేచి నిలబడటం, ‘‘కొడతావా’’ అంటూ కాజల్ గద్దించడాన్ని ప్రోమోలో చూపించాడు. శుక్రవారం ప్రసారం కానున్న 90వ ఎపిసోడ్‌లో టాప్-5లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకొనే కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోతుంది.

Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌
Also Read: ర‌జ‌నీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌... ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో న‌యన‌తార‌...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Kajal Shanmukh jaswanth Bigg Boss 5 Telugu Updates బిగ్ బాస్ 5 తెలుగు manas Siri Sunny షన్ముఖ్ సన్నీ Bigg Boss 5 Telugu Finale Winner

సంబంధిత కథనాలు

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Lata Mangeshkar Health Update: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏం అన్నారంటే?

Lata Mangeshkar Health Update: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏం అన్నారంటే?

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

Ravi Teja: రోజుకి అన్ని లక్షలా..? క్యామియో రోల్ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?

Ravi Teja: రోజుకి అన్ని లక్షలా..? క్యామియో రోల్ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?

Kriti Sanon: నడుము సన్నగా ఉండాలట... నేనేమైనా ప్లాస్టిక్ బొమ్మనా?

Kriti Sanon: నడుము సన్నగా ఉండాలట... నేనేమైనా ప్లాస్టిక్ బొమ్మనా?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు

AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి

Breaking News Live: ఏపీలో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం

Breaking News Live: ఏపీలో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం

Tecno Pop 5 Pro: కొత్త బడ్జెట్ ఫోన్‌తో వస్తున్న టెక్నో.. రూ.7 వేలలోపే భారీ బ్యాటరీ!

Tecno Pop 5 Pro: కొత్త బడ్జెట్ ఫోన్‌తో వస్తున్న టెక్నో.. రూ.7 వేలలోపే భారీ బ్యాటరీ!