Siri Kiss Shanmukh: వామ్మో.. షన్నుకు ముద్దుపెట్టేసిన సిరి, అనీ ఆగ్రహం.. అరె ఏంట్రా ఇది?
‘బిగ్ బాస్ 5’లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. అయితే, ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో సిరి, షన్ముఖ్‌కు ముద్దుపెట్టడం హైలెట్‌గా నిలుస్తోంది. మరి, అనీకి ఎందుకు కోపం వచ్చిందంటే..

‘బిగ్ బాస్ 5’ హౌస్‌లో రచ్చ మామూలుగా లేదు. కెప్టెన్సీ కోసం పెద్ద ఫైటే జరుగుతోంది. గత రెండు రోజులుగా సాగుతున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ, మానస్ విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ‘వెంటాడు వేటాడు’ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బిగ్ బాస్ వారికి థర్మాకోల్ సంచులు ఇచ్చాడు. ఒకరి సంచిలోని థర్మాకోల్‌ను మరొకరు ఖాళీ చేయాలని చెప్పడంతో వార్ మొదలైంది. దీంతో శ్రీరామ్, సన్నీల మధ్య పెద్ద గొడవే జరిగింది.
శ్రీరామ్ “కెప్టెన్ అయి ఉండి నువ్వు చేయాల్సింది ఇదేనా? సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా” అనడం సన్నీకి కోపం వచ్చింది. దీంతో ‘బిగ్ బాస్’ సీజన్ 5 ఇంకా పూర్తికాలేదు’’ అంటూ సన్నీ మండిపడ్డాడు. గురువారం సాయంత్రం వదిలిన ప్రోమోలో.. ఆనీ మాస్టర్, షన్ను, సిరీల మధ్య ‘వెంటాడు వేటాడు’ టాస్క్ జరిగింది. సిరి, షన్ను కలిసి ఆడుతున్నారనే కోపంతో ఆనీ మాస్టర్ రచ్చ చేసింది. మీరంతా గ్రూపులుగా ఆడుతున్నారని, సింగిల్‌గా ఆడేవారు ఎలా గెలుస్తారంటూ.. తన థర్మాకోల్ సంచిని కిందపడేసింది. ఈ ఇంట్లో ఉండగా కెప్టెన్ అవ్వను అని శపథం పూనింది. దీంతో రింగులో షన్ను, సిరి మాత్రమే ఉన్నారు. సిరి ఎలాగో షన్నుకు ఫ్రెండ్ కావడంతో రిజల్ట్‌ను మీరే ఊహించుకోవచ్చు. ఈ వారం షన్ముఖ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
ఇక కట్ చేస్తే.. ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకోనుంది. సిరితో షన్ను మాట్లాడుతూ.. ‘‘ఇలా మెంటల్‌గా డిస్ట్రబ్‌గా ఉన్నప్పుడే ఎమోషనల్‌గా ఎటాచ్డ్ అయిపోతాం’’ అన్నాడు. దీంతో సిరి మాట్లాడుతూ.. ‘‘నేను బాగానే ఉన్నాను. నీ వల్లే ఇంకా నేను మెంటల్‌గా డిస్ట్రబ్ అవుతున్నాను’’ అని అంది. దీంతో షన్ను ‘‘నేను నీతో మాట్లాడను రా. అదే బెస్ట్’’ అని అన్నాడు. ఆ వెంటనే సోఫా నుంచి లేచిన సిరి.. షన్ను నుదిటి మీద ముద్దుపెట్టి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా షన్ను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది. దీంతో షన్ను కెమేరా వైపు చూస్తూ.. ‘‘అరె ఏంట్రా ఇది? బాగా రికార్డు చేశారా మీరు? ఇప్పుడు నాకు ఉంటుంది’’ అని అన్నాడు. మరి దీనిపై దీప్తి సునయనా ఎలా స్పందిస్తోదనని ప్రేక్షకులు అంటున్నారు.
Also Read: సామి... సామి... సాంగ్ వచ్చిందిరా సామి!
Also Read: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?
Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి




















