Bigg Boss 5 Telugu: ఆటలో ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్ విశ్వరూపం, షణ్ముక్ ని ఫేక్ అన్న సిరి
బిగ్ బాస్ 5 హౌస్ లో తొమ్మిదోవారం నడుస్తోంది. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా ఇచ్చిన 'సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్' కొనసాగింది.
'సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్' కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా ఇంట్లో సభ్యులను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక గ్రూపు సూపర్ విలన్స్, మరో గ్రూప్ సూపర్ హీరోస్. హీరోస్ గ్రూపులో షణ్ముక్, ప్రియాంక, కాజల్, శ్రీరామచంద్ర, మానస్ ఉండగా.. విలన్స్ గ్రూపులో రవి, యానీ మాస్టర్, సన్నీ, జెస్సీ, విశ్వ, సిరి ఉన్నారు. బుధవారం ఎపిసోడ్ లో విలన్స్ టీమ్ శ్రీరామ్ ని టార్గెట్ చేయగా హీరోస్ టీమ్ రవిని టార్గెట్ చేశారు.
సూపర్ హీరోస్ నుంచి ప్రియాంక సింగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు సూపర్ విలన్స్. టాస్క్ లో భాగంగా పచ్చి ఎగ్స్ ని తాగేసింది ప్రియాంక, పైన పేడనీళ్లు పోశారు. ఏవేవో కలిపి ఇచ్చిన జ్యూస్ లు తాగింది. పచ్చి ఆనియన్స్ తిన్నాక పెయింట్ లో ఎగ్ కలిపి ఇచ్చి ముఖానికి రాసుకోమని చెప్పగానే రాసేసుకుంది. చేతులు స్ట్రైట్ గా పెట్టి 25 టైమ్స్ గుంజీలు తీసింది. 25 గుంజీలు తీసిన తర్వాత చేతులు స్ట్రైట్ గానే ఉంచి బకెట్ తగిలించి కొద్దిసేపు అలాగే ఉంచారు. జుట్టు కట్ చేసుకోమని సిరి కత్తెర ఇవ్వగా.... చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుకోవడం తన డ్రీమ్ అని పైగా క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చేందుకు పెంచుతున్నానని చెప్పిన ప్రియాంక కట్ చేసుకునేందుకు సిద్ధపడింది. ఇంతలో కత్తెర తీసుకున్న సిరి.. కేవలం ఏమంటాలో టెస్ట్ చేశాం అని చెప్పింది. పాట పాడుతుండగా బజర్ మోగడంతో ప్రియాంక సింగ్ గేమ్ పూర్తైంది.
Also Read: బాలకృష్ణ - గోపీచంద్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్... ఆమె ఎవరంటే?
ఎప్పటిలా షణ్ముక్, సిరి వాదించుకున్నారు. పర్సనల్ గా తనను టార్గెట్ చేశావంటూ షణ్ముక్ పై సిరి సీరియస్ అయింది. పింకీకి సపోర్ట్ చేశావ్ అంటూ గొడవకు దిగింది. సారీ చెప్పాకదా అన్నా సిరి వినకపోవడంతో పది గుంజీలు తీశాడు. తర్వాత ఇంట్లో సభ్యలందరికీ వినిపించేలా సారీ చెప్పమంది. ఇంతలో పింకీ సారీ అని షణ్ముక్ అనడంతో మళ్లీ అలిగింది. ఎట్టకేలకు స్పెషల్ గా మళ్లీ మళ్లీ సారీ చెప్పించుకుంది.
Also Read: దీపావళి తర్వాత మెగాస్టార్ ధమాకా! ఆ రోజు 'పూనకాలు...' స్టార్ట్!
60 వ రోజు ఉదయాన్నే భళా చాంగుభళా సాంగ్ కి ఇంటి సభ్యులంతా ఉత్సాహంగా స్టెప్పులేశారు. తమ టీమ్ లో ఒకర్ని ఇంకో టీమ్ లో ఒకరితో స్వాప్ చేసుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఈ విషయంలో షణ్ముక్-సన్నీ వాదించుకున్నారు. ఎవ్వరూ మారేందుకు అంగీకరించలేదు. విలన్స్ టీమ్ లో ఉన్న రవి, ఆనీ మాస్టర్ ఇద్దరూ మాట్లాడుకుని ట్రేలో ఉన్న తాళాలు ట్రే కింద పెట్టేశారు. అయినప్పటికీ హీరోస్ టీమ్ తాళం దక్కించుకోవడంతో సూపర్ హీరోస్ కి ఛాన్స్ వచ్చింది. ఆనీ మాస్టర్ ని ఎంపిక చేసుకున్నారు. సాస్ లు, ఎగ్స్, పాలు అన్నీ మిక్స్ చేసిన జ్యూస్ ఇచ్చారు. మిర్చి తిన్నది, పెయింట్ ఒళ్లంతా పూసుకుంది. ఐస్ వాటర్ తలపై పోసుకుంది, పేడ మిక్స్ చేసిన వాటర్ పోసుకుంది. ఎట్టకేలక ఆనీ కూడా తగ్గకుండా ఆడింది.
Also Read: రవితేజ వర్సెస్ బెల్లంకొండ... రియల్ టైగర్ ఎవరు? ఎవరి టైగర్ ముందు?
మళ్లీ సిరి-షణ్ముక్ రచ్చ కొనసాగింది. సిరిపై అరుస్తున్నావంటూ జస్వంత్.. షణ్ముక్ ని అడిగాడు. తన టీమ్ లోకి రానందుకే షణ్ముక్ ఇలా ప్రవర్తిస్తున్నాడని మాట్లాడుకున్నారు. విలన్స్ టీమ్ లో ఉన్న సిరి... శ్రీరామ్ దుస్తులన్నీ విసిరి పడేసింది. శ్రీరామ్ కూడా అదే పని చేశాడు. దుస్తులు విసిరేసిన విషయంపై షణ్ముక్-సిరి వాదించుకున్నారు. ఈ లోగా బజర్ మోగడంతో తాళం తీసుకుని ఛాన్స్ విలన్స్ టీమ్ దక్కించుకున్నారు.
Also Read: ప్రభాస్ రీసెంట్ కెరీర్‌లో ఇదొక రికార్డ్... అంత తక్కువ రోజుల్లోనా!?
షణ్ముక్ తో గొడవపడిన సిరి బయట కూర్చుని ఏడుస్తుండగా..పింకీ కామెంట్ చేసింది. ఆ కామెంట్స్ ని తప్పుబట్టిన మానస్ నువ్వు కోపంలో ఏదేదో మాట్లాడేస్తావని అన్నాడు. మళ్లీ సారీ చెప్పడంతో పింకీ కూలైంది. సిరి సేమ్ టీమ్ లో ఉంటే పర్వాలేదు కానీ పక్కటీమ్ కి పంపించకూడదంటూ షణ్ముక్-కాజల్ చర్చ పెట్టుకున్నారు. తామిద్దరం కలసి ఆడుతాం అన్న మాట కరెక్ట్ కాదని అందరకీ అర్థమవ్వాలనే చెరో టీమ్ లో ఉన్నాం అన్నాడు షణ్ముక్.
ఇక శుక్రవారం రాత్రి ప్లే కానున్న ఎపిసోడ్ లోనూ సిరి-షణ్ముక్ మధ్య వాదన, అలకలు, బతిమలాడుకోవడాలు కొనసాగాయి. షణ్ముక్ ది ఫేక్ ఫ్రెండ్ షిప్ అని సిరి కన్నీళ్లు పెట్టుకుంది. షణ్ముక్ బతిమలాడినా పట్టించుకోకుండా వెళ్లిపోయింది.
Also Read: ఒక్క పాటకు వెయ్యి మందితో... అల్లు అర్జున్ తగ్గేదే లే!
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా.. ఇలాగైతే కష్టమే!
Also Read: హన్సికను గొలుసులుతో బంధించి... తల్లకిందులుగా వేలాడదీసి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి