Bholaa Shankar: 'భోళా శంకర్' అప్డేట్ - చిరుపై స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్
'భోళా శంకర్' సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో 'భోళా శంకర్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వేదాళం' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో చిరంజీవి 'ఆచార్య' రిలీజ్, 'గాడ్ ఫాదర్' షూటింగ్ లతో బిజీగా ఉండడంతో 'భోళా శంకర్' సినిమాకి కాస్త బ్రేక్ వచ్చింది.
ఇప్పుడు తిరిగి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో చిరంజీవిపై స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారు. రేపటి నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. రామ్, లక్ష్మణ్ లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు మెహర్. వీరి బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద సెటప్, ప్రైవేట్ బస్సులు కనిపిస్తున్నాయి. ఒక కాంప్లెక్స్ సెట్స్ లో యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో చిరంజీవికి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. చిరుకి చెల్లెలుగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read: కరణ్ జోహార్ కిడ్నాప్ - బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ ఇదే!
Also Read: నా బర్త్ డే రోజే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది: అడివి శేష్
View this post on Instagram