Bheemla Nayak Title Song: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్.. 12 నిమిషాల్లోనే లక్షకు పైగా లైక్స్.. ట్రెండ్ సెట్ చేస్తున్న పవర్ స్టార్!

భీమ్లా నాయక్' మూవీ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో కంటే ముందే లిరిక్స్ ని విడుదల చేసి చిత్ర బృందం సంచలనం రేపింది. తాజాగా రిలీజైన సాంగ్ సోషల్ మీడియాని మోత మోగించేస్తోంది. 12 నిముషాల్లో 100K లైక్స్ వచ్చాయ్

FOLLOW US: 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ''భీమ్లా నాయక్''. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ దుమ్ములేపాయి. ఈరోజు పవన్ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ మరో సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందించారు. ముందుగా ప్రకటించినట్లుగానే 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ రిలీజ్ చేసిన కేవలం 12 నిముషాల్లో 100K లైక్స్ తో దుమ్ము దులిపేస్తోంది.

'సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు తాండాలోన.. బెమ్మాజెముడు చెట్టున్నాది' అంటూ మొదలైన ఈ పాట సబ్ ఇన్స్పెక్టర్ భీమ్లా నాయక్ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తూ సాగింది. 'ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ.. ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా.. నిమ్మళంగ కనబడే నిప్పుకొండ.. ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా.. ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క.. చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క' అంటూ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు.

'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కు ఎస్ ఎస్ థమన్ ఫ్రెష్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ గీతాన్ని రామ్ మిరియాల - శ్రీ కృష్ణ - పృథ్వీచంద్ర కలిసి ఆలపించారు. లిరికల్ వీడియో అయినప్పటికీ విజువల్ గా గ్రాండ్ గా చూపించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ సాంగ్ లో తమన్ - శివమణి, మిగతా టీమ్ అంతా సందడి చేశారు. 

మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కొషియుమ్' చిత్రానికి రీమేక్ గా 'భీమ్లా నాయక్'. ఇందులో మరో హీరోగా రానా నటిస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్.. రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'భీమ్లా నాయక్' చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Also Read: చూడప్ప సిద్దప్ప…నేనొక మాట చెప్తాను..పనికొస్తే ఈడ్నే వాడుకో లేదంటే ఏడ్నైనా వాడుకో..పవర్ కళ్యాణ్ సూపర్ హిట్స్, పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్స్

Also Read: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!

Also Read:పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?

Published at : 02 Sep 2021 11:59 AM (IST) Tags: Bheemla Nayak Title song reaches 100K likes in just 12 mins

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!