News
News
వీడియోలు ఆటలు
X

Pavan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!

ఆ పేరు వింటే చాలు అభిమానుల్లో ఉత్సాహం వచ్చేస్తుంది. అదే తెర మీద కనిపిస్తే పూనకాలే. హీరోకి అభిమానులుండడం వేరు.. తన వ్యక్తిత్వంతో ఫాలోయింగ్ పెంచుకోవడం వేరు. అందుకే హీరోలందు పవర్ స్టార్ స్టైలే వేరప్పా!

FOLLOW US: 
Share:

‘గబ్బర్ సింగ్ 2’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుందా? ‘‘ఒక్కడినే.. ఒక్కడినే.. ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే! ఎంతమంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే! ఎక్కడికైనా వస్తా.. జనంలో ఉంటా.. జనంలా ఉంటా..’’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పే ఆ డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. అది కేవలం డైలాగు మాత్రమే కాదు.. అది పవన్ కళ్యాణ్ మనసులోని మాట. ఆ డైలాగులో చెప్పినట్లే.. పవర్ స్టార్ ఒంటరిగానే పోరాడుతున్నారు. జనంలోనే ఉంటూ జనం కోసం పరితపిస్తున్నారనేది ఆయన అభిమానుల నమ్మకం. 

పవన్ కళ్యాణ్.. మిగతా హీరోలకు ఉండే అభిమానులకు చాలా వ్యత్యాసం ఉంది. సినిమాలతో పనిలేకుండా ఎల్లవేళలా అభిమానులు ఆయన వెంటే ఉంటారు. ఆయన అన్న చిరంజీవి తర్వాత అంత అభిమానాన్ని సొంతం చేసుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఎన్ని సినిమాల్లో నటించాడు? ఎన్ని హిట్టయ్యాయి? ఎన్ని ఫ్లాప్ అయ్యాయన్నది కాదు.. అభిమానులకు ఎంతలా చేరువయ్యారన్నదే ముఖ్యం. సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో అయిపోయారు. ఏకంగా ఏళ్ల పాటు హిట్ లేకపోయినా ఇమేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు.  

ఇంటర్‌తో చదువుకు స్వస్తి చెప్పిన కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. కళ్యాణ్ బాబు పేరును పవన్ కళ్యాణ్‌గా మార్చుకుని 1996లో ‘అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాల్లో హీరోగా నిలదొక్కుకున్నారు.

1999 లో వచ్చిన ‘తొలిప్రేమ’ పవన్ కెరీర్లోనే మాంచి టర్నింగ్ పాయింట్. ‘తొలిప్రేమ’ తర్వాత తమ్ముడు, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, వకీల్ సాబ్ పవన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీస్. ‘గబ్బర్ సింగ్’ సినిమాకు గాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ‘అత్తారింటికి దారేది’ వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్.. దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు.

‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చి తగ్గేదేలే అన్నారు. కరోనా కారణంగా థియేటర్లకు జనం రాని సమయంలో కూడా వసూళ్ల వర్షం కురిసిందంటే దటీజ్ పవన్ కళ్యాణ్. ఇక వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ జోరు మామూలుగా లేదు. వచ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాలతో వచ్చేందుకు సిద్ధమైపోతున్నారు.  ‘అయ్యనుప్పుమ్ కోషియం’ రీమేక్ గా తెరకెక్కుతోన్న భీమ్లానాయక్ ఫస్ట్ గ్లింప్ల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా కంటే ముందు ప్రారంభించిన ‘హరి హర వీరమల్లు’ మాత్రం భీమ్లానాయక్ తర్వాతే రానుంది.

కెరీర్‌లో తొలిసారి పవన్ కళ్యాణ్ చారిత్రక పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా మొఘలాయి రాజులను  ఎదిరించిన ’హరి హర వీరమల్లు’ ప్రతాపం తెరపై ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ నటిస్తున్నాడు. హరీశ్ శంకర్‌తో మరో ప్రాజెక్టుకు కూడా పవన్ కమిటయ్యారు. వీటితో పాటూ మరో ఇద్దరు కొత్త దర్శకులకు ఛాన్సిచ్చారని టాక్.

❤ హీరోగా మాత్రమే కాకుండా అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు పవన్ కల్యాణ్.

❤  ముగ్గురు మొనగాళ్లు (1994), సర్దార్ గబ్బర్ సింగ్ (2016) సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 

❤  దర్శకుడిగా పవన్ తొలి చిత్రం జానీ (2003).

❤  తమ్ముడు, బద్రి, ఖుషీ, డాడీ, జానీ, గుడుంబా శంకర్, తీన్మార్ చిత్రాలకు స్టంట్స్ కో-ఆర్డినేటరుగా వ్యవహరించారు.

❤ జానీ, గుడుంబా శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు కథా సహకారం అందించారు.

రాజకీయాల్లో పవనిజం: ఇక రాజకీయాల విషయానికొస్తే 2014 మార్చి 14 న జనసేన పార్టీని పవన్ స్థాపించారు.  కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడేందుకు పార్టీ స్థాపించినట్లు పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్‌ను దోషిగా నిందిస్తూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీకి ప్రచారం చేశారు. జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. ఈ సమయంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన రాజకీయవేత్తగా పవన్ కళ్యాణ్ నిలిచారు. విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడారు. 2019 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుల్లేకుండా ఒంటరిగా బరిలో దిగారు. 2017  నవంబరులో ఇండో-యూరపియన్ బిజినెస్ ఫోరమ్ నుండి గ్లోబల్ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకున్నారు. నటుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు.

వ్యక్తిగత జీవితంపై విమర్శలు: పవన్ కళ్యాణ్‌ను నేరుగా ఎదుర్కొలేని రాజకీయ నేతలు.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని తెరపైకి తేవడం మీకు తెలిసిందే. మూడు పెళ్లిల్ల ప్రస్తావనతో ఆయన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు. 1997మేలో పవన్‌కు నందినితో వివాహం జరిగింది. ఆ తర్వాత ‘బద్రి’ సినిమాలో రేణుదేశాయ్ పరిచయమైంది. ఆ పరిచయం డేటింగ్ వరకూ వెళ్లిందంటారు. ఆ సమయంలో రేణుదేశాయ్ పవన్‌తో తనకు సంబంధం ఉందని, ఓ కొడుకు కూడా ఉన్నాడంటూ కోర్టులో కేసువేసింది. మొదటి భార్య నందినికి 2008 ఆగస్టులో విడాకులిచ్చి నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్‌ను పవన్ 2009, జనవరి 28న వివాహం చేసుకున్నారు. అకీరా, ఆద్య పిల్లలు. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురొసావాపై అభిమానంతో తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు పవన్. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యా భర్తలుగా విడిపోయినా, తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం గమనార్హం. 

2013 సెప్టెంబరు 30న రష్యా నటి అన్నా లెజ్‌నేవాతో పవన్‌కు మూడో వివాహం జరిగింది. హైదరాబాద్ ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ పెళ్లి జరిగింది. అన్నాకు ఓ కొడుకు.పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. పవన్ పెళ్లిళ్లపై ఎన్నో విమర్శలొచ్చాయ్. కానీ, ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. వారి జీవితాల్లోకి తొంగి చూడటం.. హేళన చేయడం దిగజారుడుతనమే అవుతుంది. ఏది ఏమైనా.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ‘పవర్ స్టార్’ ఎప్పటికీ పవర్ స్టారే. ఆయన సినిమాల్లో ఉన్నా.. భవిష్యత్తులో రాజకీయాలను శాసించినా.. ఎప్పటికీ అభిమానుల గుండెల్లోనే ఉంటారు. 

పవన్ కళ్యాణ్ బర్త్ డేపై ‘ఏబీపీ దేశం’ స్పెషల్ వీడియో స్టోరీని ఇక్కడ చూడండి:

Also Read: భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్

Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..

Published at : 01 Sep 2021 07:55 PM (IST) Tags: Pavan Kalyan Birthday Special Article

సంబంధిత కథనాలు

Chris Hemsworth: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్‌ వెల్లడి, RRRపై ప్రశంసలు

Chris Hemsworth: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్‌ వెల్లడి, RRRపై ప్రశంసలు

Siddharth: సుజాత ఎవరు? ఆమెను చూసి హీరో సిద్ధార్థ్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు?

Siddharth: సుజాత ఎవరు? ఆమెను చూసి హీరో సిద్ధార్థ్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు?

Kajol Quits Social Media: సోషల్ మీడియాకు కాజోల్ గుడ్ బై, వెళ్తూ వెళ్తూ కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ

Kajol Quits Social Media: సోషల్ మీడియాకు కాజోల్ గుడ్ బై, వెళ్తూ వెళ్తూ కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ

Dipika Chiklia: మేం అలా ముద్దులు పెట్టుకోలేదు, మాలో దేవుళ్లను చూసేవారు - కృతి, ఓంరౌత్‌లపై ‘రామాయణం’ సీత ఫైర్

Dipika Chiklia: మేం అలా ముద్దులు పెట్టుకోలేదు, మాలో దేవుళ్లను చూసేవారు - కృతి, ఓంరౌత్‌లపై ‘రామాయణం’ సీత ఫైర్

Urfi Javed: ఏలియన్ కాదు, ఉర్ఫీ జావేద్ - ఈ సారి నిండు దుస్తులతో ఆశ్చర్యపరిచిన బిగ్ బాస్ బ్యూటీ!

Urfi Javed: ఏలియన్ కాదు, ఉర్ఫీ జావేద్ - ఈ సారి నిండు దుస్తులతో ఆశ్చర్యపరిచిన బిగ్ బాస్ బ్యూటీ!

టాప్ స్టోరీస్

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్