Bangarraju: నాగార్జున సినిమాకి భారీ డిమాండ్.. ఛాన్స్ కొట్టినట్లే..
'బంగార్రాజు' డిమాండ్ పెరిగిపోయింది. ఈ సినిమాకి ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేస్తున్నారు బయ్యర్లు.
అక్కినేని నాగార్జున నటించిన 'బంగార్రాజు' సినిమా సడెన్ గా సంక్రాంతి రేసులోకి వచ్చింది. నిజానికి రెండు వారాల ముందు వరకు కూడా ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి ప్రీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో సంక్రాంతికి విడుదల చేయాలని ఫస్ట్ నుంచి అనుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' లాంటి సినిమాలు రిలీజ్ కి ఉండడంతో 'బంగార్రాజు'పై ఎవరి దృష్టి పడలేదు.
బయ్యర్లు ఈ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. దీంతో ఓ మోస్తరు రేట్లకే సినిమాను అమ్మేయాలని అనుకున్నారు. మంచి టాక్ వస్తే అప్పుడు చూసుకోవచ్చని అనుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా పడింది. 'రాధేశ్యామ్' కూడా రావడం కష్టమనే అంటున్నారు. దీంతో 'బంగార్రాజు' డిమాండ్ పెరిగిపోయింది.
ఈ సినిమాకి ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేస్తున్నారు బయ్యర్లు. పండక్కి ఇది పెర్ఫెక్ట్ మూవీ.. పైగా పేరున్న సినిమాలేవీ సంక్రాంతికి వచ్చేలా లేవు. సడెన్ గా రేసులోకి వచ్చిన చిన్న సినిమాలతో పోలిస్తే 'బంగార్రాజు' సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. సినిమాకి మంచి టాక్ వస్తే భారీ కలెక్షన్స్ ను సాధించే ఆస్కారం ఉండడంతో బయ్యర్లు ముందుకొస్తున్నారు.
మొదట జనవరి 15న సినిమాను విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు జనవరి 12నే సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు ఈ విషయంపై అధికార ప్రకటన రానుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా.. నాగచైతన్య సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ..
Also Read: 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే.. రివీల్ చేసిన నిర్మాత..
Also Read: సంక్రాంతి రేసులో డబ్బింగ్ సినిమాలు.. అజిత్ Vs విశాల్..
Also Read: ఇది చాలా టఫ్ టైం.. 'రాధేశ్యామ్' దర్శకుడు హింట్ ఇస్తున్నాడా..?
Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..
Also Read: రాజమౌళితో కరణ్ జోహార్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?