అన్వేషించండి

Michael Trailer : బాలకృష్ణ ఆశీస్సులతో 'మైఖేల్' ట్రైలర్ - రిలీజ్ ఎప్పుడంటే?

Balakrishna To Launch Michael Movie Trailer : సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మైఖేల్' సినిమా ట్రైలర్ బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల కానుంది.

సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' (Michael Movie).  ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆయనది స్పెషల్ యాక్షన్ రోల్. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్‌గా నటించారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రేపే 'మైఖేల్' ట్రైలర్ రిలీజ్!
'మైఖేల్' సినిమా చిత్రీకరణ పూర్తయిందని సంక్రాంతి సందర్భంగా జనవరి 15న చిత్ర బృందం వెల్లడించింది. అప్పుడు 21న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే... నిన్న ట్రైలర్ రిలీజ్ కాలేదు. రేపు... అనగా సోమవారం (జనవరి 23న) విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ఆశీసులతో, ఆయన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుంది. 'మైఖేల్' పాన్ ఇండియా సినిమా. తెలుగు సహా ఇతర భాషల్లో కూడా రూపొందుతోంది. తెలుగు ట్రైలర్ బాలకృష్ణ విడుదల చేస్తారు. మిగతా ట్రైలర్స్ ఇతర పరిశ్రమల్లో ప్రముఖులు విడుదల చేయనున్నారు. 

Also Read : ప్రభాస్ డబుల్ ధమాకా - 2023లో ఆ రెండూ గ్యారెంటీ!

ఫిబ్రవరి 3న పాన్ ఇండియా రిలీజ్!
Michael Movie Release On Feb 3rd : ఫిబ్రవరి 3న 'మైఖేల్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దివంగత శ్రీ. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు వెల్లడించారు.   దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో సినిమా విడుదల కానుంది. 

24 కిలోలు తగ్గిన సందీప్ కిషన్!
'మైఖేల్' తన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో సందీప్ కిషన్ చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని కోసం ఆయన సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. సుమారు 24 కిలోల బరువు తగ్గారు. 'మైఖేల్'తో కొత్త ప్రయత్నం చేశామని, తెలుగు ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందని టీజర్ విడుదల కార్యక్రమంలో సందీప్ కిషన్ చెప్పారు. తనకు ఇదే ఆఖరి సినిమా అన్నట్లు దర్శకుడు రంజిత్ జయకోడి సినిమా తీశారని, షూటింగులో హీరో కంటే ఎక్కువ రిస్కులు తీసుకున్నారని ఆయన వెల్లడించారు.

ఆల్రెడీ యాక్షన్ ప్యాక్డ్ టీజర్...
'నువ్వుంటే చాలు' సాంగ్ కూడా!  
ఆల్రెడీ 'మైఖేల్' టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 10న విడుదల చేశారు. ఇటీవల సినిమాలో తొలి పాట 'నువ్వుంటే చాలు'ను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఆ పాటకు మంచి స్పందన లభిస్తోంది.

Also Read : రామ్ చరణ్ తీసుకు వెళితేనే - షారుఖ్ ఖాన్ కండిషన్ విన్నారా? 

'వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి మైఖేల్' అని మాస్టర్ చెప్పగా ... 'వెంటాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడటం తెలియాల్సిన పని లేదు మాస్టర్'' అని మైఖేల్ బదులు ఇవ్వడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు... రొమాన్స్ కూడా ఉందని సందీప్ కిషన్, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ లిప్ లాక్ ద్వారా చెప్పేశారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ లుక్స్ కూడా బావున్నాయి.

వరుణ్ సందేశ్ అండ్ అనసూయ!
'మైఖేల్' సినిమాలో 'హ్యాపీ డేస్' ఫేమ్ వరుణ్ సందేశ్, స్టార్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఉన్నారు. సినిమాలో వాళ్ళ పాత్రలు ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఈ చిత్రానికి మాటలు : త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె సాంబశివరావు, ఛాయాగ్రహణం : కిరణ్ కౌశిక్,  సంగీతం : సామ్ సిఎస్, సమర్పణ : నారాయణ్ దాస్ కె. నారంగ్, నిర్మాతలు : భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, దర్శకత్వం : రంజిత్ జయకోడి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget