News
News
X

Shah Rukh Khan : రామ్ చరణ్ తీసుకు వెళితేనే - షారుఖ్ ఖాన్ కండిషన్ విన్నారా?

SRK On Ram Charan : 'పఠాన్' విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు విజిట్ చేయడానికి షారుఖ్ ఖాన్ ఓకే అన్నారు. అయితే, ఒక కండిషన్ పెట్టారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మధ్య మంచి బాండింగ్ ఉంది. సోషల్ మీడియా సాక్షిగా మరోసారి అది బయట పడింది. అసలు వివరాల్లోకి వెళితే... 

షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'పఠాన్'. అందులో దీపికా పదుకోన్ (Deepika Padukone) కథానాయిక. ఈ నెల 25న... అనగా రాబోయే బుధవారం సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కాసేపు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు షారుఖ్ ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇచ్చారు.
 
''మీరు 'పఠాన్' విడుదలైన రోజున తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను విజిట్ చేస్తారా?'' అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. అప్పుడు షారుఖ్ ఖాన్ ''తప్పకుండా విజిట్ చేస్తా! అయితే థియేటర్లకు నన్ను రామ్ చరణ్ తీసుకు వెళితేనే'' అని సమాధానం ఇచ్చారు. మరి, దీనిపై చరణ్ ఏమంటారో చూడాలి. 

'పఠాన్' తెలుగు ట్రైలర్ ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ విడుదల చేశారు. అప్పుడు ఆయనకు థాంక్స్ చెప్పిన షారుఖ్ ఖాన్... ''మీ 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆస్కార్‌ను ఇంటికి తెచ్చినప్పుడు ఒక్కసారి దానిని నన్ను టచ్ చేయనివ్వండి. లవ్ యు'' అని షారుఖ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చూసిన 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'పఠాన్' తమిళ ట్రైలర్‌ను దళపతి విజయ్ ట్వీట్ చేశారు. ఆయనకు తమిళంలో షారుఖ్ రిప్లై ఇచ్చారు.

అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్!
'పఠాన్' అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఫస్ట్ డే 14 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. 'బ్రహ్మాస్త్ర'కు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 19 కోట్లు వచ్చాయి. ఆ రికార్డును 'పఠాన్' బ్రేక్ చేసేలా ఉంది. ప్రజెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తే హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది. 

Also Read : వావ్ - 'పుష్ప 2' క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన రష్మిక

'పఠాన్' ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే... జాన్ అబ్రహం ఒక పోలీస్ కార్ మీద రాకెట్ లాంచ్ బాంబు షూట్ చేయడంతో స్టార్ట్ అయ్యింది. ఒక ప్రయివేట్ టెర్రర్ టీమ్ ఇండియా మీద భారీ ఎత్తున ఎటాక్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయం తెలిసిన ఇంటిలిజెన్స్ గ్రూప్ అజ్ఞాతవాసంలో ఉన్న గూఢచారి 'పఠాన్' (షారుఖ్ ఖాన్)ను రమ్మంటుంది. యాక్షన్.. యాక్షన్.. యాక్షన్... ట్రైలర్ మొత్తం యాక్షన్ ఉంది. హెలికాఫ్టర్ డ్రైవ్ చేస్తూ షారుఖ్ షూట్ చేసే విజువల్స్, ట్రైలర్ ఎండింగ్ హైలైట్ అని చెప్పాలి.  

Also Read  : ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను కొంటుందా? - శోభు యార్లగడ్డతో ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ 

షారుఖ్ మాత్రమే కాదు, దీపికా పదుకోన్ కూడా సోల్జర్ రోల్ చేశారు. ''నేను కూడా సోల్జర్. నీలాగా! మనం ఈ మిషన్ కలిసి చేద్దాం! నువ్వు ఈ మిషన్ లో ఉన్నావా? లేవా?'' అని దీపికా పదుకోన్ చెప్పే డైలాగ్ వింటుంటే... ఆవిడ రోల్ కూడా సూపర్బ్ ఉంటుందని అర్థం అవుతోంది.

తెలుగులోనూ జనవరి 25న విడుదల
'పఠాన్' సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్పై ఫిల్మ్ అని చెప్పవచ్చు. షారుఖ్ గూఢచారిగా కనిపించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో జనవరి 25న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. పాటలతో పాటు టీజర్, ట్రైలర్‌ను మూడు భాషల్లో విడుదల చేశారు.  

'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాల్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జోడీ నటించింది. మొదటి రెండు సినిమాల్లో వాళ్ళ కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. 'పఠాన్'లోనూ షారుఖ్, దీపిక ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉన్నారు.

Published at : 22 Jan 2023 10:05 AM (IST) Tags: Shah Rukh Khan Ram Charan Telugu States Pathaan Release

సంబంధిత కథనాలు

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

టాప్ స్టోరీస్

BRS Nanded Meeting : నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

BRS Nanded Meeting :  నాందేడ్‌లో  బీఆర్ఎస్  బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్,  అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!

IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!