అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Prabhas 2023 Releases : ప్రభాస్ డబుల్ ధమాకా - 2023లో ఆ రెండూ గ్యారెంటీ!

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. 2023లో తమ అభిమాన హీరోను రెండుసార్లు థియేటర్లలో చూసే అవకాశం వస్తోంది. 

రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు గుడ్ న్యూస్ ఇది. ఈ ఏడాది వాళ్ళకు డబుల్ ధమాకా గ్యారెంటీ. తమ అభిమాన హీరోను రెండు సార్లు థియేటర్లలో చూసే అవకాశం వాళ్ళ ముందుకు వస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే...
 
జూన్ 16న 'ఆదిపురుష్'
ప్రభు శ్రీరామ్ పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా 'ఆదిపురుష్'. తొలుత గత ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలని భావించారు. అయితే, ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కోసం వాయిదా వేశారు. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే, టీజర్ విడుదలైన తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్ మీద ట్రోల్స్ రావడంతో మళ్ళీ వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ మీద రీ వర్క్ చేస్తున్నారు.  

ఫైనల్ రిలీజ్ డేట్ ఏంటంటే... జూన్ 16న! ఆ రోజు 'ఆదిపురుష్'ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. వెనక్కి వెళ్ళేది లేదని కూడా యూనిట్ చెప్పారు. సో... ఈ ఏడాది ఫస్ట్ 'ఆదిపురుష్'తో ప్రభాస్ థియేటర్లలోకి వస్తారు. ఆ తర్వాత 'సలార్' విడుదల కానుంది. 

సెప్టెంబర్ 28న 'సలార్'
జూన్ 16న 'ఆదిపురుష్' విడుదల అవుతుంది కాబట్టి 'సలార్' వాయిదా పడే ఛాన్స్ ఉందని కొందరు అనుకున్నారు. అయితే, హోంబలే ఫిలిమ్స్ సంస్థ సెప్టెంబర్ 28న ఆ సినిమాను విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. దాంతో ఆ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.  

'అర్జున్ రెడ్డి' స్టైల్‌లో ప్రభాస్ సినిమా!
'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో, ఆ సినిమా హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'తో ఉత్తరాది ప్రేక్షకులలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనకంటూ స్పెషల్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. ప్రభాస్ హీరోగా ఆయన 'స్పిరిట్' చేయనున్నారు. ఆ సినిమాను చాలా రోజుల క్రితం అనౌన్స్ చేశారు. అందులో ప్రభాస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. 

'స్పిరిట్' సినిమాను టీ సిరీస్ పతాకంపై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు.

Also Read : రామ్ చరణ్ తీసుకు వెళితేనే - షారుఖ్ ఖాన్ కండిషన్ విన్నారా?

''స్పిరిట్' చాలా యూనిక్ సినిమా. ఇదొక కాప్ డ్రామా. ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే, సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు స్పెషల్ స్టైల్ తీసుకు వచ్చారు. మ్యూజిక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడూ అటువంటి చూసి ఉండరు'' అని భూషణ్ కుమార్ పేర్కొన్నారు. 'స్పిరిట్' కంటే ముందు 'యానిమల్' విడుదల కానుందని కాబట్టి ప్రభాస్ సినిమా గురించి ఎక్కువ చెప్పడం మాట్లాడటం లేదని ఆయన తెలిపారు. 

ప్రభాస్ లిస్టులో...
Prabhas Upcoming Movies : 'ఆదిపురుష్', 'సలార్', మారుతి సినిమాలు కాకుండా... 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా సెట్స్ మీద ఉంది. అది సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేయనుంది. లేటెస్టుగా 'అన్‌స్టాపబుల్‌ 2'కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి వచ్చారు. వాళ్ళను ప్రభాస్ సినిమా గురించి బాలకృష్ణ అడగ్గా... కన్ఫర్మ్ చేశారు. పైన చెప్పిన 'స్పిరిట్' ఇంకొకటి. 

Also Read : వావ్ - 'పుష్ప 2' క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన రష్మిక 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget