Balakrishna: ‘దొరికితే దవడ పగిలిపోద్ది’.. చిరుతో విభేదాలపై ఘాటుగా స్పందించిన బాలయ్య
చిరంజీవి, రవితేజాలతో విబేదాలంటూ వస్తున్న వార్తలపై బాలయ్య ఘటుగా స్పందించారు. ‘దవడ పగిలిపొద్ది’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నందమూరి బాలకృష్ణ.. అందరిలాంటి హీరో కాదు. ఆయన ఏం మాట్లాడినా ముక్కుసూటిగానే ఉంటుంది. బాలయ్యకు సంతోషం వచ్చినా.. ఆగ్రహం వచ్చినా తట్టుకోలేం. ఎవరైనా నచ్చని విషయం మాట్లాడితే.. అక్కడికక్కడే ఇచ్చిపడేస్తారు. అయితే, ఇప్పటివరకు ఆయన తన మనసులో మాటలను చెప్పడానికి.. తనపై వస్తున్న వదంతులపై స్పందించేందుకు తగిన వేదిక లభించలేదు. తాజాగా ‘ఆహ’ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో బాలయ్యకు ఆ అవకాశం వచ్చింది.
ఇటీవల విడుదలైన ‘అన్‌స్టాపబుల్’ ప్రోమోలో రవితేజ, చిరంజీవితో విబేధాలు గురించి బాలకృష్ణ స్పందించారు. ‘‘సోషల్ మీడియాలో ఏది పడితే అది అంటున్నారు. పేరులేని, లొకేషన్ తెలియని అడ్రస్‌లతో బాధ్యతలేకుండా ప్రవర్తిస్తున్నారు. రవితేజాకు బాలకృష్ణకు పడదు, బాలకృష్ణ-చిరంజీవి ఫోన్లో మాట్లాడుకోరు. నా హీరో తోపు.. నీ హీరో సోపు. ఏంటి ఇవన్నీ.. లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయ్యింది. దొరికితే దవడ పగిలిపోద్ది. ఊరు పేరు చెప్పుకోలేని, ధైర్యం లేని ఈ వేద*లను క్షమిద్దాం. మన మీద వచ్చే విమర్శలను ప్రేమించినప్పుడే మనం ‘అన్‌స్టాపబుల్’ అవుతాం’’ అని బాలకృష్ణ అన్నారు.
Also Read: ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అదిరిపోయే రికార్డ్, బాలకృష్ణ ఎక్కడా తగ్గట్లేదుగా..
బాలయ్యకు 2021 బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. బోయపాటి దర్శకత్వంలో ఆయన నటించిన ‘అఖండ’ సినిమా ఏ స్థాయిలో హిట్ కొట్టిందో తెలిసిందే. అంతేకాదు.. ‘అన్‌స్టాపబుల్’తో కూడా ఆయన మరోసారి తన సత్తా చాటారు. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షో IMDB (ఇండియన్ మూవీ డేటా బేస్)లో చోటు సంపాదించుకుంది. ఈ షో టాప్ 10 రియాలిటీ టీవీలో లిస్టులో చేరినట్టు ప్రకటించింది. IMDB 9.4/10 రేటింగ్‌తో దూసుకుపోతోంది. మొత్తంగా బాలయ్య ‘ఆహా’ ఓటీటీ వేదికతో నిజంగా హోస్ట్‌గా ప్రేక్షకులతో ఆహా అనిపిస్తున్నారు. ప్రస్తుతం అఖండ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బాలకృష్ణ... సంక్రాంతి తర్వాత గోపీచంద్ మలినేని ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకెళ్లనున్నారు.
Also Read: అజిత్ సినిమాకు కరోనా ఎఫెక్ట్... వలిమై రిలీజ్ వాయిదా వేసిన చిత్ర బృందం
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?