News
News
X

Nandamuri Balakrishna : మెగాఫోన్ పడుతున్న బాలకృష్ణ - కల్ట్ క్లాసిక్ సీక్వెల్‌కు ఆయనే డైరెక్టర్

Balakrishna To Direct Aditya 999 Max : నట సింహం నందమూరి బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. తాను డైరెక్షన్ చేస్తున్నట్లు చెప్పారు.

FOLLOW US: 
 
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడు మాత్రమే కాదు... నిర్మాత! గాయకుడు! స్టూడియో అధినేత కుమారుడు! ఇప్పుడు కొత్తగా హోస్ట్‌గా కూడా చేస్తున్నారు. ఆయనలో దర్శకుడు కూడా ఉన్నారు. ఆ దర్శకుడు వచ్చే ఏడాది మెగాఫోన్ పడుతున్నారు. ఈ విషయం బాలకృష్ణే స్వయంగా వెల్లడించారు.  
 
బాలకృష్ణ దర్శకత్వంలో 'ఆదిత్య 999' 
బాలకృష్ణ కెరీర్‌లో కొన్ని స్పెషల్ సినిమాలు ఉన్నాయి. అందులో 'ఆదిత్య 369'ది మరీ మరీ స్పెషల్ ప్లేస్. కంటెంట్, టెక్నాలజీ పరంగా హాలీవుడ్ స్థాయి సినిమా అది. దానికి సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్స్' తెరకెక్కించనున్నట్లు 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌లో బాలకృష్ణ చెప్పారు. స్క్రిప్ట్ తానే రాస్తున్నానని కూడా వెల్లడించారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఆ సినిమాకు దర్శకత్వం కూడా బాలకృష్ణ వహించనున్నారు.
 
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన 'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ 1.0 విడుదల కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. హీరోగా నటిస్తుండటంతో పాటు ఆ చిత్రానికి విశ్వక్ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అతడు చేసిన వర్క్ గురించి చెబుతూ 'ఆదిత్య 999 మ్యాక్స్' విషయం చెప్పేశారు. 

Nandamuri Balakrishna On Aditya 369 Sequel Aditya 999 Max Direction : ''నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దామనుకున్నాను. కానీ, నా వల్ల కాలేదు. మధ్యలో ఆ సినిమా ఆగిపోయింది. అది 'నర్తనశాల'. ఆ తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. నాకు టైమ్ లేదు. కొన్ని సబ్జెక్టులు తట్టలేదు'' అని బాలకృష్ణ అన్నారు. అప్పుడు మళ్ళీ మీ దర్శకత్వంలో సినిమా లేదా? అంటూ వేదిక కింద ఉన్న అభిమానులు అడిగితే... ''ఉంది ఉంది తప్పకుండా! 'ఆదిత్య 999' ఉంది'' అని బాలకృష్ణ చెప్పారు. దాంతో ఆయన దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుందని క్లారిటీ వచ్చింది. 

'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్ వస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బాలకృష్ణ కూడా సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఆయన వందో సినిమాగా అదే చేస్తారని వినిపించింది. అయితే... కుదరలేదు అనుకోండి! ఇప్పుడు ఆ సినిమా పట్టాలు ఎక్కే సమయం వచ్చిందని బాలకృష్ణ మాటలను బట్టి అర్థం అవుతోంది.
  
వచ్చే ఏడాది సెట్స్ మీదకు!
Aditya 999 Max will be launched in February 2023 : వచ్చే ఏడాది 'ఆదిత్య 999 మాక్స్' సెట్స్ మీదకు వెళ్లనుందని, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని బాలకృష్ణ వెల్లడించారు. మరో నాలుగు నెలల తర్వాత... ఫిబ్రవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. ఇందులో బాలకృష్ణతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటించే అవకాశాలు ఉన్నాయని వినికిడి. 

News Reels

Also Read : అధ్యక్షా, అర్ధరాత్రి ఫోన్ చేసిన బాలయ్య - నట సింహంతో స్నేహం అంటే అట్లుంటది మరి

'ఆదిత్య 999 మాక్స్'తో మోక్షజ్ఞను కథానాయకుడిగా బాలకృష్ణ పరిచయం చేస్తారా? లేదా? అనేది కొన్ని రోజులు ఆగితే స్పష్టత వస్తుంది. మొత్తం మీద... కల్ట్ క్లాసిక్‌కి సీక్వెల్ రావటం పక్కా అన్నమాట. ఇప్పుడు ఈ విషయమే బాలయ్య, నందమూరి అభిమానులను  ఖుషీ చేస్తోంది.  

ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... దర్శకుడు గోపీచంద్ మలినేనితో 'వీర సింహా రెడ్డి' చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రెండిటి తర్వాత 'ఆదిత్య 999 మాక్స్' స్టార్ట్ కావచ్చు. దర్శకులు పరశురామ్, వెంకటేష్ మహా కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. 

Also Read : 'వండర్ ఉమెన్' రివ్యూ : అమ్మ కాబోయే మహిళలు, భర్తలు తప్పకుండా చూడాల్సిన సినిమా!

Published at : 18 Nov 2022 09:56 PM (IST) Tags: Balakrishna NBK To Direct Aditya 999 Aditya 999 Max Update Balakrishna Direction NBK On Aditya 999

సంబంధిత కథనాలు

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!