NBK's Unstoppable 2 : అధ్యక్షా, అర్ధరాత్రి ఫోన్ చేసిన బాలయ్య - నట సింహంతో స్నేహం అంటే అట్లుంటది మరి
Balakrishna's Unstoppable 2 Episode 4 Promo : 'అన్‌స్టాపబుల్ 2'కు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, రాధికా శరత్ కుమార్ అతిథిలుగా వచ్చిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.
''బాలయ్య కుటుంబాన్ని చూసిన మీకు... ఇవాళ బాలయ్య స్నేహాన్ని పరిచయం చేయాలనిపించింది'' అని నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. నిజాం కాలేజీలో తనతో పాటు చదువుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీయం కావడానికి ముందు స్పీకర్‌గా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డిను 'అన్‌స్టాపబుల్ 2'కు తీసుకు వచ్చారు. వాళ్ళతో పాటు సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ (Radhika Sarathkumar) కూడా సందడి చేశారు. ఆ ఎపిసోడ్ ప్రోమో నేడు విడుదల చేశారు.
బాలకృష్ణ అక్కడ చేసిన చేసిన తర్వాతే...
'అన్‌స్టాపబుల్ 2' స్టేజి మీదకు నల్లారి కిరణ్ కుమార్ వచ్చిన వెంటనే 'అధ్యక్షా... నా మైక్ ఆపేశారు అధ్యక్షా!' అని బాలకృష్ణ అన్నారు. తానూ స్పీకర్ అయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసిన బాలకృష్ణ అదే మాట్లాడారని నల్లారి చెప్పారు. వాళ్ళ కాలేజీ రీ యూనియన్ ఫోటోలు చూపించారు. కాలేజీలో తాము చేసినవి చెబితే ఎవరూ నమ్మరని బాలకృష్ణ అంటే... ''అక్కడ చేసిన తర్వాతే ఇక్కడ నటుడు అయ్యావ్'' అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. తాను క్లాసు బయట ఎక్కువ ఉండేవాడినని కెఆర్ సురేష్ రెడ్డి చెప్పారు. ఆయన మినీ రాజ్‌దూత్‌లో వచ్చేవాడిని కిరణ్ కుమార్ రెడ్డి అంటే... ''మేం అమ్మాయిలకు సైట్ కొట్టడం కోసం బైక్స్ ఎక్స్‌ఛేంజ్ చేసుకునేవాళ్లం'' అని బాలకృష్ణ చెప్పారు. ''ఆ ఫీల్డులో బాలయ్య, సురేష్ రెడ్డి హీరోలు'' అన్నారు నల్లారి. మొత్తం మీద కాలేజీ సంగతులను గుర్తుకొస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం గురించి, ఆయన చివరగా ప్రయాణించిన హెలికాఫ్టర్ జర్నీ గురించి ప్రస్తావన వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడు అని బాలకృష్ణ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డితో క్రికెట్ ఆడారు.
'అన్‌స్టాపబుల్ 2'లో ఇప్పటి వరకు డబుల్ ధమాకా నడిచింది. ఈసారి ట్రిపుల్ ధమాకా ఇవ్వడానికి బాలకృష్ణ రెడీ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిలకు తోడు రాధిక కూడా జాయిన్ అయ్యారు.
చిరంజీవిలో నచ్చనిది ఏంటి?
నాలో నచ్చినది ఏంటి?
'ఇప్పటి వరకు నన్ను అడగటానికి మొహమాట పడింది ఏదైనా అడగండి' అని రాధిక అంటే... బాలకృష్ణ సిగ్గు పడటం భలే ఉంది. తాను చెన్నైలో ఉన్నప్పుడు తనకు గాడ్ ఫాదర్ రాధిక అని బాలకృష్ణ అన్నారు. రజనీకాంత్, విజయ్ కాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ - వాళ్ళందరితో ఆమె చేశారని, కానీ తన లాంటి సూపర్ స్టార్‌తో నటించే అవకాశం ఆమెకు రాలేదన్నారు. అంతే కాదు... ''చిరంజీవిలో నచ్చనది ఏంటి? నాలో నచ్చింది'' అని రాధికను ప్రశ్నించారు.
నల్లారి కిరణ్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి, బాలకృష్ణతో రాధిక దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రోమో విడుదలైన తర్వాత 'అన్‌స్టాపబుల్ 2' నాలుగో ఎపిసోడ్ మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. రాజకీయ నాయకులు ఇద్దరూ బాలకృష్ణకు స్నేహితులు. కాలేజీ నుంచి రాజకీయాల వరకు వీక్షకులకు తెలియని ఎన్నో అంశాలు మాట్లాడినట్టు అర్థం అవుతోంది. నవంబర్ 25 నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
Also Read : 'ఐరావతం' రివ్యూ : థ్రిల్స్ ఉన్నాయా? లేదంటే టార్చర్ చేశారా?
ఆల్రెడీ 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రికార్డుల పరంపర వెండితెరపై మాత్రమే కాదు... డిజిటల్ తెరపై కూడా కంటిన్యూ అవుతోంది. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్స్, యూట్యూబ్‌లో ప్రోమోస్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2' ఫస్ట్ ఎపిసోడ్‌కు 24 గంటల్లో పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని ఆహా ఓటీటీ వెల్లడించింది. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చిన ఎపిసోడ్ రాజకీయ, సినిమా వర్గాలు వీక్షించాయి. యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ ఎపిసోడ్ బావుందనే పేరు వచ్చింది. శర్వానంద్, అడివి శేష్ ఎపిసోడ్ అయితే అందరినీ ఎంటర్‌టైన్ చేసింది.