Balakrishna Clarity : పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నా - దేవ బ్రాహ్మణులకు బాలకృష్ణ మనవి
దేవ బ్రాహ్మణులను బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదని బాలకృష్ణ తెలిపారు. జరిగిన పొరపాటుకు మన్నిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు, ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
''దేవాంగులలో నా అభిమానులు చాలా మంది ఉన్నారు. నా వాళ్ళను నేను బాధ పెట్టుకుంటానా?'' అని తెలుగు దేశం పార్టీ నాయకులు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అని వినయపూర్వకంగా ఓ లేఖ విడుదల చేశారు. పొరపాటు జరిగిందని ఆయన పేర్కొన్నారు. అసలు, ఏమైంది? ఎందుకు లేఖ విడుదల చేశారు? అనే వివరాల్లోకి వెళితే...
దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయి
''దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ'' అని ఓ కార్యక్రమంలో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఆ మాట తప్పు అని, అలా మాట్లాడటం వల్ల తమ మనో భావాలు దెబ్బ తిన్నాయని దేవాంగుల నిరసన వ్యక్తం చేశారు. అది బాలకృష్ణ దృష్టికి రావడంతో మన్నించమని లేఖ రాశారు.
విషయం తెలిసి బాధపడ్డాను - బాలకృష్ణ
''దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని నాకు అందన సమాచారం తప్పు అని తెలియ జేసిన దేవ బ్రాహ్మణుల పెద్దలు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను. నేను అన్న మాట వల్ల దేవాంగుల మనో భావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధ పడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదని, ఉండదని తెలుగు ప్రజలు అందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకాగా వచ్చిన మాట మాత్రమే'' అని బాలకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
నాకు కలిగే ప్రయోజం ఏముంటుంది? - బాలకృష్ణ
తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. ''సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకు వచ్చే ప్రయోజం ఏం ఉంటుంది చెప్పండి?'' అని ఆయన ప్రశ్నించారు. దేవ బ్రాహ్మణులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. అదీ సంగతి!
A Note from Actor & Leader Nandamuri Balakrishna Garu to the brothers and sisters of Devabrahmanas. #NandamuriBalakrishna pic.twitter.com/6gnHSeG5Nk
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 15, 2023
సినిమాలకు వస్తే... గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'వీర సింహా రెడ్డి' సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాకు మంచి వసూళ్ళు వస్తున్నాయి. సినీ ప్రేక్షకులతో పాటు రాజకీయ వర్గాల్లో సైతం ఈ సినిమా చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వ పాలనపై సినిమాలో విమర్శలు ఉన్నాయి. ఓ సన్నివేశంలో 'అభివృద్ధి ఎక్కడ?' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ వైసీపీని ఉద్దేశించినవే. ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని బాలకృష్ణ కూడా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి అధికారుల నివేదిక
ప్రభుత్వం కూడా 'వీర సింహా రెడ్డి' చిత్రంలోని డైలాగులపై ఆరా తీసిందని సమాచారం. ప్రత్యేకంగా అధికారుల టీంను కూడా పంపి డైలాగుల చిట్టా రాసుకురమ్మన్నారనే టాక్ నడుస్తుంది. బాలయ్య తన సినిమాల్లో ప్రభుత్వాన్ని ఆ స్థాయిలో విమర్శించారా? డైలాగులతో వైసీపీని అంతగా ఇరకాటంలోకి నెట్టారా? అనే చర్చ తెర మీదకు వచ్చింది.
Also Read : పవన్ కొలతలు తీసుకోవాలి - బాలకృష్ణ మాట విన్నారా? 'అన్‌స్టాపబుల్ 2' వీడియో గ్లింప్స్ వచ్చేసిందండోయ్
'వీర సింహా రెడ్డి'లో ప్రజల అండదండలు ఉన్న నాయకుడిగా టైటిల్ పాత్రలో బాలకృష్ణ కనిపించారు. ఆయనకు హోమ్ మంత్రి నుంచి పిలుపు వస్తుంది. ఓసారి వచ్చి కలిసి వెళ్ళమని! అప్పుడు ''నువ్వు వెళ్ళడం ఏమిటి పెద్దన్నా'' అని ఓ పాత్రధారి అంటే... ''ప్రజలు ఎన్నుకున్న వెధవలు వాళ్ళు! గౌరవించడం మన ధర్మం / బాధ్యత'' అని బాలకృష్ణ బదులు ఇస్తారు. ఇదొక్కటే కాదు... ఏపీ ప్రభుత్వంపై ఇంకా పవర్ ఫుల్ సైటైర్లు ఉన్నాయి. వాటి కోసం కింద లింక్ క్లిక్ చేయండి.
Also Read : వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య... పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?