Ayudha Pooja Song: ‘దేవర‘ ఆయుధ పూజకు రెడీ అవ్వండి- ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే!
Devara Ayudha Pooja:‘దేవర’ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ‘ఆయుధ పూజ’ అనే పాటను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
![Ayudha Pooja Song: ‘దేవర‘ ఆయుధ పూజకు రెడీ అవ్వండి- ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే! Ayudha Pooja Song From Devara Arriving On September 19 2024 Ayudha Pooja Song: ‘దేవర‘ ఆయుధ పూజకు రెడీ అవ్వండి- ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/18/db87cb03d025eac51871c6938a18a94f1726645832769544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ayudha Pooja Song From Devara: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజీ’ సినిమా తర్వాత వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ కు మంచి స్పందన లభించింది. రీసెంట్ గా ముంబై వేదికగా విడుదల చేసిన ‘దేవర’ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఫియర్, చుట్టమల్లె, దావూదీ పాటలు ఓరేంజిలో ఆకట్టుకున్నాయి. చుట్టమల్లె పాట పాన్ ఇండియా స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. ఈ పాటలు సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో మరో పాటను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
రేపు ‘ఆయుధ పూజ’ పాట విడుదల..
‘దేవర’ సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో నెలకొన్న అంచనాలను మరింత పెంచేలా ‘ఆయుధ పూజ’ పాట ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సంబంధించి వరుసగా ట్వీట్లు చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ‘ఆయుధ పూజ’ పాటను రేపు(సెప్టెంబర్ 19)న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 11.07 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ పాట విడుదల అవుతుందా? అని ఎదరుచూస్తున్నారు. ఈ పాటను హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ లో షూట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ డ్యాన్స్ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
View this post on Instagram
జాన్వీ కపూర్ తొలి తెలుగు సినిమా
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చింది. ఈ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ‘దేవర’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాతో సినీ అభిమానులకు ఓ రేంజిలో కిక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ లో రికార్డుల మోత మోగిస్తోంది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
Read Also: ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై అనసూయ షాకింగ్ కామెంట్స్..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)