అన్వేషించండి
Advertisement
Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?
వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు ఓ సినిమా కమిట్ అయ్యారు. మొన్నామధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది 'బంగార్రాజు', 'థాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇదిలా ఉండగా.. చైతు తన నెక్స్ట్ సినిమా పరశురామ్ దర్శకత్వంలో చేస్తారని వార్తలొచ్చాయి. 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్స్ సమయంలో పరశురామ్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
దీనికి బదులుగా.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు ఓ సినిమా కమిట్ అయ్యారు. మొన్నామధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. వెంకట్ ప్రభు తీసిన 'మానాడు' సినిమాను తెలుగులో చైతుతో రీమేక్ చేస్తారంటూ కథనాలను ప్రచురించారు. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా పక్కా అని తెలుస్తోంది. కానీ 'మానాడు' రీమేక్ కాదని సమాచారం. వెంకట్ ప్రభు కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది.
Arvind Swamy signs Naga Chaitanya’s film: అయితే ఇప్పుడు ఈ సినిమాలో అరవింద్ స్వామిని విలన్ రోల్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద్ స్వామి ఎక్కువగా విలన్ రోల్స్ లోనే నటిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమాలో విలన్ గా తన మార్క్ పెర్ఫార్మన్స్ చూపించారు అరవింద్ స్వామి. ఆ తరువాత తెలుగు సినిమాల్లో ఆయనకు అవకాశాలు వచ్చినా.. ఆయన నటించలేదు. చాలా కాలానికి ఆయన మరో తెలుగు సినిమా సైన్ చేశారు.
వెంకట్ ప్రభు చెప్పిన కథ తనకు నచ్చడంతో అరవింద్ స్వామి నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియమణి, కోలీవుడ్ నటుడు జీవా కీలకపాత్రల్లో కంటించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీని తరువాత మైసూర్ లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఆ షెడ్యూల్ లో అరవింద్ స్వామి జాయిన్ అవుతారని సమాచారం. ఈ చిత్రాన్ని హై టెక్నికల్ స్టాండర్డ్స్, భారీ బడ్జెట్‌తో.... కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే, ఆమె వరుస పరాజయాలు అక్కినేని అభిమానులను కలవరపెడుతోంది. కృతిశెట్టి, నాగ చైతన్య నటించిన 'బంగార్రాజు' మూవీ మంచి విజయమే సాధించింది. ఆ తర్వాత నాగ చైతన్యకు, కృతిశెట్టికి ఒక్క హిట్ కూడా దక్కలేదు. ముఖ్యంగా కృతిశెట్టి నటించిన 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. అలాగే చైతూ బాలీవుడ్ చిత్రం 'లాల్ సింగ్ చడ్డా' కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
గౌతమ్ మీనన్ తో చైతు సినిమా:
అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన తొలి సినిమా 'ఏ మాయ చేసావె'. ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందా..? అని ఇటీవల దర్శకుడు గౌతమ్ మీనన్ ను అడిగితే... ''నాగ చైతన్య అడిగితే తప్పకుండా చేస్తా'' అని తెలిపారాయన. తమిళంలో ఆ సినిమాకు వేరే క్లైమాక్స్ ఇచ్చామని, తెలుగులో క్లైమాక్స్ వేరుగా ఉంటుందని ఆయన అన్నారు.
చైతు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్:
చైతు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'దూత' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు 'డీజే టిల్లు' ఫేమ్ డైరెక్టర్ విమల్ కృష్ణతో కలిసి ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరికొంతమంది దర్శకుడు చైతుని కలిసి కథలు వినిపిస్తున్నారు.
చైతు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'దూత' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు 'డీజే టిల్లు' ఫేమ్ డైరెక్టర్ విమల్ కృష్ణతో కలిసి ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరికొంతమంది దర్శకుడు చైతుని కలిసి కథలు వినిపిస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
ఎంటర్టైన్మెంట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion