By: ABP Desam | Updated at : 15 Jun 2023 07:33 PM (IST)
అర్జున్ లీలలో అల్లు అర్జున్, శ్రీ లీల ( Image Source : Aha Videoin Twitter )
ప్రముఖ తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’ కోసం అల్లు అర్జున్, శ్రీలీల ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. వీరిద్దరూ ‘ అర్జున్ లీల’ అనే వీడియోలో నటించారు. అయితే ఇది ఏదైనా అనౌన్స్‌మెంటా? లేకపోతే ఏంటి అన్నది మాత్రం తెలియరాలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు.
ఈ గ్లింప్స్‌లో శ్రీలీల మెడపై ఒక రౌడీ కత్తి పెట్టగా కమెడియన్ చమ్మక్ చంద్ర పోలీస్ గెటప్‌లో గన్ను పట్టుకుని ‘హ్యాండ్సప్’ అని అరుస్తాడు. అప్పుడు ఆ రౌడీ ‘ఆ... మరి దీని పీక మీద కత్తెవడు పెడతాడు?’ అని అడుగుతాడు. అప్పుడు వెంటనే ‘పోలీస్’ అంటూ అల్లు అర్జున్ కారులో ఎంట్రీ ఇస్తాడు. తర్వాత ‘అర్జున్ లీల’ అనే టైటిల్ పడుతుంది. గ్లింప్స్‌లో ప్రస్తుతానికి ఇవే చూపించారు. గ్లింప్స్ నిడివి కేవలం 16 సెకన్లు మాత్రమే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో రేపు (శుక్రవారం) ఆహా యాప్‌లో విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ వీడియోకు నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్‌గా ఏ.యస్.ప్రకాష్, సినిమాటోగ్రాఫర్‌గా రవి కె.చంద్రన్ వ్యవహరించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి గతంలోనే పలు రికార్ఢులను బ్రేక్ చేశారు. 2020 సంక్రాంతికి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఎంటర్‌టైన్‌మెంట్ సునామీ సృష్టించేందుకు సిద్ధమయ్యారంటూ 'ఆహా వీడియోస్' సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "కలిశారు మళ్లీ ఇద్దరూ... ఇక రికార్డుల వేట మొదలు.. అతి పెద్ద మూవీ పండగ చేసుకుందామా? గెట్ రెడీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ సునామీ" అని పేర్కొంటూ ఈ క్రేజీ న్యూస్ ను చెప్పారు. దాంతో పాటు వీరిద్దరూ షూట్ లో ఓ ఇంట్రస్టింగ్ పిక్ ను కూడా పంచుకుంది.
ఈ ఫొటోలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో ఏదో సీరియస్ గా సంభాషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది షూటింగ్ సెట్ లో తీసిన ఫొటోగా అర్థమవుతోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ తెగ ఉప్పొంగిపోతున్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా సినిమా చేస్తారా, లేదా ఆహా (Aha) ఛానల్ కోసం ఏదైనా షో చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అల.. వైకుంఠపురంలో'.. సినిమా ఏ రేంజ్ లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్ళీ ఇప్పుడు చేతులు కలపడంపై అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్.. ప్రిన్స్ మహేష్ బాబుతో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఓ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా సాగుతుండగానే.. ఇప్పుడు బన్నీతో మరో ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను... భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ
Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Allu Aravind: అది ఆయన ఫెయిల్యూర్, మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు: ‘సంతోషం’ వివాదంపై అల్లు అరవింద్ కామెంట్స్
Animal Deleted Scene: ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ‘యానిమల్’ డిలీటెడ్ సీన్ - ఎందుకు డిలీట్ చేశారంటూ వాపోతున్న ఫ్యాన్స్!
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
CMD Prabhakar Rao Resign: ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా
/body>