Big Boss Sunny & Anee Master: యానీ మాస్టర్‌కు కొవిడ్... సన్నీకి సపోర్ట్ చేయనందుకు వచ్చిందని శాపనార్థాలు!
కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్‌కు కొవిడ్ వచ్చింది. దీనికి కారణం 'బిగ్ బాస్' హౌస్‌లో ఆమె సన్నీకి సపోర్ట్ చేయకపోవడమే అని ఓ నెటిజన్ అంటున్నారు. యానీకి కొవిడ్ రావాల్సిందేనని శాపనార్థాలు పెట్టారు.
కొరియోగ్రాఫర్, 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిన యానీ మాస్టర్‌కు కొవిడ్ వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. "లాస్ట్ ఇయర్ నాకు కొవిడ్ వచ్చింది. అప్పుడు 24 రోజులు పాజిటివ్‌గా ఉన్నాను. జనవరి 23, 2021న తగ్గింది. మళ్లీ ఇప్పుడు, ఈ ఏడాది జనవరి 24న కొవిడ్ వచ్చింది. నాకు పాజిటివ్ అని తేలింది. కొవిడ్ టైమ్ మైంటైన్ చేస్తుందా? క్వారంటైన్ చిరాకు, సో బోరింగ్" అని యానీ మాస్టర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పారు. చాలా మంది ఆమె త్వరగా కోలుకోవాలని విష్ చేస్తూ పోస్టులు వచ్చాయి.
"ఓ మై గాడ్. చాలా మెసేజ్ లు. జెన్యూన్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్. ప్రస్తుతం నాకు బావుంది. మైల్డ్ సింప్టమ్స్ (కరోనా లక్షణాలు స్వల్పంగా) ఉన్నాయి. థాంక్యూ" అని యానీ మాస్టర్ మరో పోస్ట్ చేశారు. అయితే... 'బిగ్ బాస్' హౌస్‌లో ఆమె సన్నీకి సపోర్ట్ చేయలేదని, అందుకు ఆమెకు కరోనా రావాల్సిందనని మరొకరు పోస్ట్ చేశారు.
"సన్నీకి సపోర్ట్ లేవు కదా! నీకు కరోనా రావాల్సిందే" అని యామిని అనే నెటిజన్ శాపనార్థాలు పెట్టారు. దానిపై యానీ మాస్టర్ సరదాగా స్పందించారు. "సన్నీ బాబా... కొవిడ్ అదృశ్యం అయ్యేలా నాకు సపోర్ట్ చెయ్" అని యానీ అన్నారు. 'బిగ్ బాస్' హౌస్‌లో జరిగిన విషయాలను కంటెస్టెంట్లు వదిలేసినా... బయట అభిమానులు వదిలేలా లేరు.
View this post on Instagram
Also Read: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి
Also Read: 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' పాటకు మాధురీ దీక్షిత్ రీల్ చేస్తే... కన్ను కొట్టి రొమాన్స్ పండిస్తే?
Also Read: అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం... అల్లు అర్జున్ సినిమా హిందీ డబ్బింగ్ ఆపేయడానికి కారణం అదే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.