News
News
X

Aunty Controversy: ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు? విష్ణు ప్రియ సమాధానం వింటే అనసూయ షాకవ్వడం ఖాయం!

యాంకర్ విష్ణు ప్రియ నోరు జారింది. మర్చిపోయిన ‘ఆంటీ‘ వివాదాన్ని మళ్లీ గుర్తుచేసింది. ఓ షోలో ఆంటీ అంటే భయపడే ఆంటీ అనసూయ అని చెప్పి నాలుక్కర్చుకుంది.

FOLLOW US: 

యాంకర్ విష్ణుప్రియ.. బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన అమ్మాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మధ్య బుల్లి తెరపై కనిపించడం తగ్గించినా.. నెట్టింట్లో ఎక్కువ టైం గడుపుతోంది. సినిమాల్లో అవకాశాల  కోసం ప్రయత్నిస్తున్నా.. పెద్దగా అమ్మడు గుమ్మం తొక్కడం లేదు. ఇన్ స్టా రీల్స్, పోస్టులతోనే కాలం వెల్లదీస్తోంది. తాజాగా ఆమె ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాలో నటించింది. ఇందులో విష్ణు తన అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. 

తాజా విష్ణుప్రియ ఆర్జే కాజల్‌కు చెందిన ఓ షోలో పాల్గొంది. అందులో కాజల్.. ర్యాపిడ్ పైర్‌లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఉన్నట్లుండి ఓ వివాదాస్పద ప్రశ్న అడిగింది. దానికి విష్ణుప్రియ ఠక్కున సమాధానం చెప్పి నాలుక్కర్చుకుంది. ఇంతకీ యాంకర్ ఏం అడిగిందంటే? ‘ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు?’ అని క్వశ్చన్ చేసింది. విష్ణు ప్రియ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘అనసూయ’ అని సమాధానం చెప్పింది. వెంటనే ‘ఆంటీ’ వివాదం గుర్తుకొచ్చి నాలుక కరుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అనసూయ.. ఇప్పుడు క్వశ్చన్ అడిగిన యాంకర్ మీద కేసు పెడుతుందా? ఆన్సర్ చెప్పిన విష్ణుప్రియ మీద పెడుతుందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆంటీ వివాదం తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో జరుగుతున్న వేధింపులకు చరమగీతం పాడాలని స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా గళం వినిపిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా 'సే నో టు ఆన్ లైన్ అబ్యూజ్' హ్యాష్ ట్యాగ్‌తో వరుస పోస్టులు పెట్టారు. తాజాగా విడుదలైన  విజయ్ దేవరకొండ 'లైగర్'  సినిమా కూడా ఇందుకు కారణం అయ్యింది. 'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ ఉపయోగించిన ఒక పదం మీద అప్పట్లో అనసూయ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆ సమస్యను అందరూ మర్చిపోయారు.

తాజాగా  అనసూయ చేసిన ట్వీట్‌తో మరోసారి వివాదం మొదలైంది. ''అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ... కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా'' అంటూ ఒక ట్వీట్ చేశారు.  'లైగర్' ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని అనసూయ ఆ ట్వీట్ చేశారని భావించిన విజయ్ అభిమానులు.. మళ్ళీ అనసూయ మీద ట్రోలింగ్ స్టార్ట్  చేశారు.  కొంత మంది ఆంటీ అంటూ తిట్టడం మొదలు పెట్టారు. తనను తిడుతున్న ట్వీట్లను స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నానని, కేసులు పెడతానని హెచ్చరించారు అనసూయ.  ''నన్ను ఆంటీ అనడంతో పాటు ఏజ్ షేమింగ్ చేయడం, తిట్టడం చేస్తున్న ప్రతి అకౌంట్ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. వారిందరిపై  కేసులు పెడతా.  ఇదే నా ఫైనల్ వార్నింగ్'' అని అనసూయ మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం చల్లారింది. ఈ నేపథ్యంలో విష్ణు ప్రియ సమాధానం మళ్లీ వివాదం రేపే అవకాశం ఉంది.

Also Read : చంపు లేదంటే చావు - ఇది కథ కాదు, గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఎదిగిన సామాన్యుడి (ముత్తు) జీవితం

Published at : 14 Sep 2022 07:16 PM (IST) Tags: Vishnu Priya Anasuya bharadwaj Aunty controversy

సంబంధిత కథనాలు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!