Bithiri Sathi: రేంజ్ రోవర్ కారు కొన్న బిత్తిరి సత్తి - రేటు తెలిస్తే షాకే!
తన మాటలు, యాక్షన్, కామెడీతో యాంకర్ గా అందరినీ అలరించారు బిత్తిరి సత్తి.

బుల్లితెర ప్రేక్షకుల్లో బిత్తిరి సత్తి పేరు తెలియని వారుండరు. ఈ మధ్యకాలంలో వెండితెరపై కూడా పాపులర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అతడిని హీరోగా పెట్టి 'తుపాకీ రాముడు' అనే సినిమా కూడా తీశారు. తెలుగు టీవీ ఛానెల్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు బిత్తిరి సత్తి. ఆయన అసలు పేరు రవి కుమార్. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఓ టీవీ ఛానెల్ లో ప్రోగ్రామ్ తో ఇతడు వెలుగులోకి వచ్చారు.
తన మాటలు, యాక్షన్, కామెడీతో యాంకర్ గా అందరినీ అలరించారు. ఆ తరువాత పలు టీవీ ఛానెల్స్ అతడికి అవకాశాలు ఇచ్చాయి. ఇప్పుడు ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకుంటున్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఆ సినిమా హీరో, హీరోయిన్లతో బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ గ్యారెంటీగా ఉంటుంది. మహేష్ బాబు, రవితేజ ఇలా చాలా మంది అతడితో షో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు.
మొన్నామధ్య మహేష్ బాబుని బిత్తిరి సత్తి చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. ఈ ఇంటర్వ్యూలు చేస్తున్నందుకు అతడికి రెమ్యునరేషన్ బాగానే వేస్తున్నట్లుంది. అందుకే ఏకంగా కోట్లు విలువ చేసే కారు కొన్నారు. దసరా పండుగ సందర్భంగా.. రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేశారు బిత్తిరి సత్తి. ఈ కారు ధర వేరియెంట్స్ వారిగా రూ.89 లక్షల నుంచి రూ.1.1 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
అంత కాస్ట్లీ కారు కొనడమంటే మామూలు విషయం కాదు. ఈ మధ్యకాలంలో చాలా మంది యాంకర్స్ ఇలాంటి లగ్జరీ కార్లు కొనేస్తున్నారు. ఇప్పుడు బిత్తిరి సత్తి వంతు వచ్చింది. విజయ దశమి సందర్భంగా కొత్త కారుని కొన్న ఆయన.. ఆయుధ పూజని నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?
Also Read : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















