Anchor Anasuya: ఆ వెబ్ సిరీస్‌లో వేశ్య పాత్రలో అనసూయ? స్టార్ యాంకర్ అస్సలు తగ్గట్లేదుగా
యాంకర్ అనసూయ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకంటూ కెరీర్‌ను బిల్టప్ చేసుకుంటోంది.
యాంకర్ అనసూయకు స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ ఉంది అభిమానుల్లో. మొన్నటిదాకా బుల్లి తెరను తిరుగులేకుండా ఏలిన అందాల యాంకర్ ఇప్పుడు తన దృష్టిని వెండితెరపై పెట్టింది. మంచి పాత్రలను ఎంచుకుంటూ ఆచి తూచి అడుగులేస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ, తరువాత పుష్ప సినిమాలో ద్రాక్షాయణిగా మెరిసింది. ఆ రెండూ విభిన్నమైన పాత్రలే. ఇప్పుడు గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమాలో కూడా నటించింది. త్వరలో ఆమె ఓ ఛాలెంజింగ్ రోల్‌ను పోషిస్తున్నట్టు సమాచారం. ఓ వెబ్ సిరీస్ లో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుందట.
ఏంటా వెబ్ సిరీస్?
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి స్క్రిప్ట్ అందిస్తున్న వెబ్ సిరీస్ ‘కన్యా శుల్కం’. గురజాడ అప్పారావు రచించిన నాటకం. దీని ఆధారంగా అదే పేరుతో క్రిష్ ఓ కథను సిద్ధం చేశాడని టాక్. అందులో మధుర వాణి పాత్రకు అనసూయను కాంటాక్ట్ చేశారని, ఆమె కూడా చేసేందుకు ఒప్పుకుందని చెప్పుకుంటున్నారు. కన్యాశుల్కంలో మధుర వాణి ఒక వేశ్య పాత్ర పేరు. ఈ పాత్ర చేసేందుకు అనసూయ ఒప్పుకుందంటే నిజంగా అది ఆమెకు పేరు తెచ్చిపెట్టడం ఖాయం. సినిమాల్లో అవకాశాలు ఇలా వరుస కట్టడం వల్లే ఆమె జబర్ధస్త్ యాంకరింగ్ కూడా వదిలేసినట్టు తెలుస్తోంది.
లేడీ డాన్ గా...
దర్జా అనే సినిమాలో లేడీ డాన్ గా నటించిందట అనసూయ భరద్వాజ్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్టు చేస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు బుల్లి తెరను, వెండి తెరను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతోంది. ఇకపై బుల్లి తెరకు బైబై చెబుతుందేమో చూడాలి.
View this post on Instagram
Also read: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా
Also read: మా అత్తగారి డైమండ్ నెక్లెస్ పవిత్ర దగ్గరే ఉంది, నరేష్ మూడో భార్య రమ్య ఆరోపణలు